టెక్నిక్‌లో కోహ్లీ కంటే మంచి బ్యాటర్లు ఉన్నారు కానీ విరాట్ స్థాయి వేరు! - షోయబ్ అక్తర్

First Published Nov 6, 2023, 8:14 PM IST

ఐసీసీ మెన్స్ వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో 8 మ్యాచుల్లో 6 సార్లు 50+ స్కోర్లు దాటిన విరాట్ కోహ్లీ, రెండు సెంచరీలు బాదాడు. సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో సెంచరీతో వన్డేల్లో 49 సెంచరీలు నమోదు చేశాడు విరాట్ కోహ్లీ..

‘వన్డేల్లో విరాట్ కోహ్లీ 49 సెంచరీలు బాదాడు. ఇది నిజంగా బుర్ర పాడు విషయం. కోహ్లీ కంటే మంచి టెక్నిక్ ఉన్న ప్లేయర్లు చాలా మంది ఉన్నారు. 
 

Virat Kohli-Shreyas Iyer

అయితే విరాట్ కోహ్లీ సక్సెస్‌కి అతని అచంచలమైన కమిట్‌మెంట్, ఫోకస్, ఫిట్‌నెస్ కారణం. ఇవన్నీ కలిసి అతన్ని వరల్డ్ బెస్ట్ బ్యాటర్‌ని చేశాయి...
 

విరాట్ కోహ్లీకి ముందు చాలా గొప్ప బ్యాటర్లు వచ్చారు. కానీ అతని కమిట్‌మెంట్, కోహ్లీ స్థాయిని పెంచింది. క్రికెటర్ కావాలని కలలు కనే వారందరికీ విరాట్ కోహ్లీ ఓ గొప్ప ఉదాహరణగా నిలుస్తాడు..’ అంటూ చెప్పుకొచ్చాడు పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్..
 

వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో 8 మ్యాచుల్లో 543 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ, క్వింటన్ డి కాక్ తర్వాత అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా ఉన్నాడు..
 

‘నా హీరో సచిన్ టెండూల్కర్ రికార్డును సమం చేశాననే విషయాన్ని నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నా. నేను ఎప్పటికీ సచిన్‌లా ఆడలేను. నేనే కాదు ఎవ్వరూ సచిన్‌లా ఆడలేరు..’ అంటూ కామెంట్ చేశాడు విరాట్ కోహ్లీ..

click me!