ఐసీసీ ట్రోఫీలు గెలవడం ఈజీ కాదు, ధోనీ అలా చేశాడు! ఐపీఎల్ ఆడడం మానేయండి... రోహిత్‌కు రవిశాస్త్రి కౌంటర్

First Published Jun 11, 2023, 8:25 PM IST

టీమిండియా ఎప్పుడు ఏ ఐసీసీ టోర్నీలో ఓడిపోయినా వెంటనే మహేంద్ర సింగ్ ధోనీ ప్రస్తావన రావడం కామన్. ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ 2023 ఫైనల్‌లో రోహిత్ సేన పరాజయం తర్వాత మరోసారి ధోనీ ట్రెండింగ్‌లో నిలిచాడు..

Dhoni ICC trophy

మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్సీలో నాలుగు ఐసీసీ టోర్నీ ఫైనల్స్ ఆడిన టీమిండియా, మూడింట్లో విజయాలు అందుకుంది. బ్యాటర్‌గా ధోనీ భాగస్వామ్యం ఎంతైనా 2007 టీ20 వరల్డ్ కప్, 2011 వన్డే వరల్డ్ కప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీల్లో విజయాలు అందుకుంది టీమిండియా...

MS Dhoni-Ravi Shastri

ధోనీ కెప్టెన్సీలో 2014 టీ20 వరల్డ్ కప్ టోర్నీ ఫైనల్‌లో శ్రీలంక చేతుల్లో ఓడినప్పటి నుంచి టీమిండియాకి శని పట్టుకుంది. ఆ తర్వాత ధోనీ కెప్టెన్సీలో 2015 వన్డే వరల్డ్ కప్, 2016 టీ20 వరల్డ్ కప్‌ టోర్నీల్లో ఫెయిలైన టీమిండియా... కోహ్లీ కెప్టెన్సీలో, రోహిత్ శర్మ కెప్టెన్సీలో కూడా ఐసీసీ టైటిల్ కల నెరవేర్చుకోలేకపోతోంది..

Latest Videos


Rohit Sharma

ధోనీ కంటే ముందే ఐపీఎల్‌లో ఐదు టైటిల్స్ గెలిచి మోస్ట్ సక్సెస్‌ఫుల్ కెప్టెన్‌గా ఉన్న రోహిత్ శర్మ, ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ 2023 ఫైనల్ ఓటమి తర్వాత కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశాడు...

‘టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌ని జూన్‌లోనే పెట్టడం కరెక్ట్ కాదు. అదీ ఇంగ్లాండ్‌లోనే పెట్టాలనుకోవడం కూడా కరెక్ట్ కాదు. ఇలాంటి మ్యాచులకు కనీసం 25 రోజుల సమయం కావాలి...
 

రెండేళ్ల కష్టాన్ని ఒక్క ఫైనల్ మ్యాచ్‌తో తేల్చడం కంటే, మూడు మ్యాచుల సిరీస్ పెడితే బాగుంటుంది.. అప్పుడు బెస్ట్ టీమ్ ఏదో తేలిపోతుంది...’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ..
 

దీనిపై టీమిండియా మాజీ హెడ్ కోచ్, కామెంటేటర్ రవిశాస్త్రి ఘాటుగా స్పందించాడు. ‘ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కి ప్రిపేర్ అవ్వడానికి 25 రోజుల సమయం కావాలంటే, ఐపీఎల్ ఆడడం మానేయాలి...
 

ఐపీఎల్ ఆడడం మానేస్తే, రెండు నెలల సమయం దొరుకుతుంది. అయినా ఐసీసీ ట్రోఫీ గెలవడం అంత ఈజీ కాదు, మహేంద్ర సింగ్ ధోనీ అలా ఈజీగా కనిపించేలా చేశాడు.. ’ అంటూ వ్యాఖ్యానించాడు రవిశాస్త్రి..

ఆస్ట్రేలియా టెస్టు కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ కూడా మూడు మ్యాచుల ఫైనల్ కరెక్ట్ కాదని వ్యాఖ్యానించాడు. ‘ఫైనల్‌ విజేతని డిసైడ్ చేయడానికి ఒక్క మ్యాచ్ కాదు. 16 రౌండ్లుగా సాగే ఒలింపిక్స్‌లో కూడా ఫైనల్‌ రన్‌లో గెలిచిన అథ్లెట్లకే మెడల్స్ ఇస్తారు...’ అంటూ వ్యాఖ్యానించాడు ప్యాట్ కమ్మిన్స్.. 

click me!