కోహ్లీ గెలవలేకపోయాడని, రోహిత్‌కి ఇచ్చారు! ఇప్పుడు హార్ధిక్ పాండ్యాకి టీమిండియా కెప్టెన్సీ ఇస్తారా...

Published : Jun 11, 2023, 07:22 PM IST

ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో టీమిండియా ఓటమితో కెప్టెన్ రోహిత్ శర్మపై తీవ్రమైన ట్రోలింగ్ వస్తోంది. రోహిత్ శర్మ రిటైర్ అవ్వాల్సిన సమయం వచ్చిందంటూ ‘Retire Rohit, Retire Vadapav’ హ్యాష్‌ట్యాగ్స్‌ని ట్రెండ్ చేస్తున్నారు టీమిండియా ఫ్యాన్స్...

PREV
18
కోహ్లీ గెలవలేకపోయాడని, రోహిత్‌కి ఇచ్చారు! ఇప్పుడు హార్ధిక్ పాండ్యాకి టీమిండియా కెప్టెన్సీ ఇస్తారా...

ఐపీఎల్‌లో ఐదు సార్లు ముంబై ఇండియన్స్‌ని విజేతగా నిలిపాడు రోహిత్ శర్మ. ఈ రికార్డు కారణంగానే విరాట్ కోహ్లీని తప్పించి, రోహిత్ శర్మకు కెప్టెన్సీ పగ్గాలు అప్పగించింది బీసీసీఐ.. అయితే రోహిత్ శర్మ మాత్రం ఐపీఎల్ చూపించిన సక్సెస్, టీమిండియా కెప్టెన్‌గా చూపించలేకపోతున్నాడు...

28

ఐపీఎల్ 2023 సీజన్‌లో ఆకాశ్ మద్వాల్, కుమార్ కార్తికేయ, హృతీక్ షోకీన్, అర్జున్ టెండూల్కర్‌ వంటి అంతర్జాతీయ అనుభవం లేని బౌలింగ్ యూనిట్‌తో రెండో క్వాలిఫైయర్ దాకా టీమ్‌ని తీసుకెళ్లిన రోహిత్ శర్మ... ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో షమీ, సిరాజ్, ఉమేశ్ యాదవ్, జడేజా వంటి వరల్డ్ క్లాస్ బౌలర్లను సరిగ్గా వాడుకోలేకపోయాడు..

38
Rohit and Pujara

ట్రావిస్ హెడ్, స్టీవ్ స్మిత్ కలిసి 285 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పుతుంటే కెప్టెన్ రోహిత్ శర్మ, ఆ పార్టనర్‌షిప్‌ని విడదీసేందుకు చేసిన ప్రయత్నాలు ఏవీ సక్సెస్ కాలేదు. దీంతో రోహిత్ శర్మపై తీవ్రమైన ట్రోలింగ్ వస్తోంది...

48

2017 ఛాంపియన్స్ ట్రోఫీ, 2019 వన్డే వరల్డ్ కప్, 2021 టీ20 వరల్డ్ కప్, 2021 ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్స్‌లో  టీమిండియా కెప్టెన్‌గా వ్యవహరించిన విరాట్ కోహ్లీ... ఐసీసీ టైటిల్ గెలవలేకపోయాడు...

58

దీంతో విరాట్ వల్ల కావడం లేదని అతన్ని తప్పించి, రోహిత్ శర్మకు కెప్టెన్సీ పగ్గాలు ఇచ్చింది బీసీసీఐ. 2022 ఆసియా కప్, టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీల్లో అట్టర్ ఫ్లాప్ అయిన రోహిత్ సేన, 2023 వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లోనూ ఫెయిల్ అయింది..

68

ఇప్పుడు రోహిత్ శర్మ కూడా ఫెయిల్ కావడంతో, 2022 ఐపీఎల్ టైటిల్ గెలిచి, 2023లో గుజరాత్ టైటాన్స్ టీమ్‌ని ఫైనల్స్‌కి చేర్చిన హార్ధిక్ పాండ్యాకి కెప్టెన్సీ ఇస్తారా? అంటూ బీసీసీఐని ట్రోల్ చేస్తూ... వ్యంగ్యంగా పోస్టులు పెడుతున్నారు  టీమిండియా ఫ్యాన్స్...

78
Rohit Sharma Prank

కెప్టెన్‌గానే కాకుండా బ్యాటర్‌గా కూడా ఫెయిల్ అయిన ఇక క్రికెట్ నుంచి, టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పుకుంటే బెటర్ అంటూ ట్రోల్స్ విపరీతంగా పెరుగుతున్నాయి. ఇలాంటి పోస్టులు చేస్తున్నవారిలో ఎక్కువ మంది విరాట్ కోహ్లీ ఫ్యాన్సే ఉన్నారు.. 

88

ఒకవేళ రోహిత్ శర్మ ఇప్పుడు టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పుకున్నా, భారత జట్టును నడిపించే తర్వాతి సారథిని ఎంచుకోవడం ఇప్పట్లో అయ్యే పని కాదు. నాలుగేళ్లుగా టెస్టులు ఆడని హార్ధిక్ పాండ్యా, సుదీర్ఘ ఫార్మాట్ ఆడేందుకు కూడా ఇష్టపడడం లేదు.. 

Read more Photos on
click me!

Recommended Stories