ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో టీమిండియా 210 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా చేతుల్లో చిత్తుగా ఓడిపోయింది. నాలుగో ఇన్నింగ్స్‌లో 210 పరుగుల భారీ లక్ష్యఛేదనతో బ్యాటింగ్‌కి దిగిన టీమిండియాకి థర్డ్ అంపైర్ షాక్ ఇచ్చాడు...
19 బంతుల్లో 18 పరుగులు చేసిన శుబ్‌మన్ గిల్ అవుట్ విషయంలో తీవ్ర వివాదం రేగింది. కామెరూన్ గ్రీన్ పట్టిన క్యాచ్, నేలను తాకుతున్నట్టు టీవీ రిప్లైలో స్పష్టంగా కనిపించినా థర్డ్ అంపైర్ అవుట్‌గా ప్రకటించడం తీవ్ర వివాదాస్పదమైంది..
25
దీనిపై మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తీవ్రంగా స్పందించాడు. ‘ఐపీఎల్‌లో 10 విభిన్నమైన యాంగిల్స్‌లో చూసేందుకు అనువుగా సౌకర్యాలు, టెక్నాలజీ అందుబాటులో ఉంది..
35
అలాంటప్పుడు ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో అలాంటి సదుపాయాలు ఎందుకు లేవో నాకు అర్థం కావడం లేదు. అల్ట్రా మోక్షన్, జూమ్ ఇన్ యాంగిల్ ఉండి ఉంటే శుబ్‌మన్ గిల్ నాటౌట్‌గా తేలేవాడు..
45
కనీసం థర్డ్ అంపైర్ ఇంకొంచెం సేపు శ్రద్దగా రిప్లై చూసి ఉండాల్సింది. అంత త్వరగా డెసిషన్ తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఆ నిర్ణయం మమ్మల్ని తీవ్రంగా నిరుత్సాహపరిచింది...’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ..
55
శుబ్‌మన్ గిల్ అవుట్ విషయంలో టీమిండియా మాజీ క్రికెటర్లు కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. టీవీ రిప్లై చూసే సమయంలో థర్డ్ అంపైర్ కళ్లకు గంతలు కట్టుకుని ఉండవచ్చంటూ వీరేంద్ర సెహ్వాగ్ చేసిన ట్వీట్ తెగ వైరల్ అయ్యింది..