సిరాజ్‌ను ఛాంపియన్స్ ట్రోఫీ జ‌ట్టు నుంచి ఎందుకు తొలగించారో తెలుసా?

Published : Jan 19, 2025, 11:45 AM IST

Mohammed Siraj: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం బీసీసీఐ భార‌త జ‌ట్టును ప్ర‌క‌టించింది. మ‌హ్మ‌ద్ షమీ, జ‌స్ప్రీత్ బుమ్రాలు జ‌ట్టులో ఉన్నారు. అయితే, మ‌హ్మ‌ద్ సిరాజ్ ను జ‌ట్టులోకి ఎందుకు తీసుకోలేదు?   

PREV
15
సిరాజ్‌ను ఛాంపియన్స్ ట్రోఫీ జ‌ట్టు నుంచి ఎందుకు తొలగించారో తెలుసా?
Mohammed siraj

Mohammed Siraj: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నీకి భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారత జట్టును ప్రకటించింది. ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభం కానున్న ఛాంపియ‌న్స్ ట్రోఫీ కోసం ప్ర‌క‌టించిన జ‌ట్టులో పేస్ బౌలింగ్ విభాగంలో మ‌హ్మ‌ద్ ష‌మీ, జ‌స్ప్రీత్ బుమ్రా, అర్ష‌దీప్ సింగ్ లు ఉన్నారు. వన్డేల్లో అద్భుతమైన రికార్డు ఉన్న ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్‌ను ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నీకి ఎంపిక చేయకుండా సెలక్టర్లు అందరినీ ఆశ్చర్యపరిచారు.

భారత్‌ స్పిన్‌పై ఆధారపడటం, పాత బంతితో మహ్మద్‌ సిరాజ్‌ ఆకట్టుకోలేకపోవటంతో ఛాంపియన్స్‌ ట్రోఫీ జట్టు నుంచి తప్పించాల్సి వ‌చ్చింద‌ని స‌మాచారం. మహ్మద్ సిరాజ్ వన్డేల్లో అత్యుత్తమ రికార్డులు క‌లిగిన‌ బౌలర్. మహ్మద్ సిరాజ్ ఇప్పటివరకు 44 వన్డేల్లో 24.06 సగటుతో 71 వికెట్లు పడగొట్టాడు. వన్డేల్లో మహ్మద్ సిరాజ్ 21 పరుగులకు 6 వికెట్లు పడగొట్టడం అత‌ని అత్యుత్తమ బౌలింగ్.

25

మ‌హ్మ‌ద్ సిరాజ్‌ను ఛాంపియన్స్ ట్రోఫీ టీమ్ నుంచి ఎందుకు తొలగించారు?

ఫిబ్రవరి 19న ప్రారంభమయ్యే ఎనిమిది జట్ల టోర్నీకి 15 మంది సభ్యులతో కూడిన జట్టును భారత్ శనివారం ప్రకటించింది. భారత్ తన అన్ని మ్యాచ్‌లను దుబాయ్‌లో ఆడాల్సి ఉంది. దుబాయ్‌లోని పిచ్‌లు ఫాస్ట్ బౌలర్‌లకు పెద్దగా సహాయపడవు, అందుకే, వెస్టిండీస్‌లో జరిగిన T20 ప్రపంచకప్ మాదిరిగానే, భారతదేశం నలుగురు స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్‌లను ఎంపిక చేసింది.

వాంఖడే స్టేడియంలో జట్టును ప్రకటించిన తర్వాత భారత కెప్టెన్ రోహిత్ శర్మ మీడియాతో మాట్లాడుతూ, 'మాకు రెండు ఎంపికలు ఉన్న జట్టు కావాలి, అంటే కొత్త బంతితో బౌలింగ్, డెత్ ఓవర్‌లు కూడా కీల‌కమ‌ని చెప్పారు.

35
Image Credit: Getty Images

అందుకే సిరాజ్ ను జ‌ట్టులోకి తీసుకోలేదా? 

ఇంగ్లండ్‌తో జరిగే మొదటి రెండు వన్డేలకు జస్ప్రీత్ బుమ్రా అందుబాటులో  ఉండ‌ర‌ని స‌మాచారం. ఫిబ్రవరి 12న అహ్మదాబాద్‌లో జరిగే చివరి మ్యాచ్‌కు మాత్రమే తిరిగి వస్తాడు. నాగ్‌పూర్, కటక్‌లలో జరిగే తొలి రెండు వన్డేలకు హర్షిత్ రాణా ఎంపికయ్యాడు. సిరాజ్ గైర్హాజరీలో జట్టులో అనుభవం లేమిగా కనిపిస్తోందని, అయితే ఈ నిర్ణయానికి కారణం కూడా చెప్పాడు రోహిత్. చివర్లో అర్ష్‌దీప్‌ సింగ్‌ బౌలింగ్ చేస్తాడ‌నీ, మహ్మద్‌ షమీ కొత్త బంతితో బౌలింగ్‌ చేయాలని భావిస్తున్నామ‌ని చెప్పారు.  సిరాజ్ కొత్త బంతితో బౌలింగ్ చేయకపోతే అతను అంతగా ఆకట్టుకోలేడని పేర్కొన్నాడు.

45

రోహిత్ శర్మ సిరాజ్ గురించి ఏం చెప్పారంటే? 

రోహిత్ శర్మ జ‌ట్టులోకి సిరాజ్ ను తీసుకోక‌పోవ‌డం గురించి మాట్లాడుతూ.. 'మేము దీని గురించి వివరంగా చర్చించాము. ఆల్ రౌండర్లందరూ అందుబాటులో ఉండాలని మేము కోరుకుంటున్నాము కాబట్టి మేము ముగ్గురు ఫాస్ట్ బౌలర్లను మాత్రమే తీసుకుంటున్నాము. ఇది సిరాజ్‌కి దురదృష్టకరం, కానీ మాకు మ‌రో అవకాశం లేదు. ప్రత్యేక పాత్రల కోసం మాకు ప్రత్యేక ఆటగాళ్లు కావాలి.

జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్ ఈ భారీ టోర్నీకి ఫాస్ట్ బౌలర్‌లుగా ఎంపికయ్యారు. బౌలింగ్ విభాగం గురించి మాట్లాడితే అక్షర్, సుందర్, జడేజా, కుల్దీప్ యాదవ్ లు స్పిన్ విభాగాన్ని నిర్వహిస్తారు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో అద్భుతంగా బౌలింగ్ చేసిన స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా పేస్ అటాక్‌కు నాయకత్వం వహిస్తాడు. దీంతో అనుభవజ్ఞుడైన మహ్మద్ షమీ చాలా కాలం తర్వాత మళ్లీ అంతర్జాతీయ క్రికెట్‌లోకి వచ్చాడు.

55

అలాగే, "జస్ప్రీత్ బుమ్రా ఆడతాడా లేదా అనేది మాకు ఖచ్చితంగా తెలియదు. అందుకే, కొత్త బంతితోనూ, పాత బంతితోనూ బౌలింగ్ చేయగల వ్యక్తి కావాలి. అందుకే, బ్యాకెండ్‌లో అతని సామర్థ్యాల కారణంగా మేము అర్ష్‌దీప్ సింగ్‌ను ఎంచుకున్నాము. కొత్త బంతిని ఉపయోగించకపోతే సిరాజ్ ప్రభావం తగ్గుతుంది. అతన్ని తప్పించడం అతని దురదృష్టకరం" అని సెలెక్టర్ల ఛైర్మన్ అజిత్ అగార్కర్‌తో కలిసి రోహిత్ విలేకరుల సమావేశంలో అన్నారు.

ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత జట్టు

రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ షమీ, మహ్మద్ షమీ అర్ష్‌దీప్ సింగ్, రవీంద్ర జడేజా, యశస్వి జైస్వాల్.

Read more Photos on
click me!

Recommended Stories