యజ్వేంద్ర చాహాల్‌ని కాదని ఆ మిస్టరీ స్పిన్నర్‌కి ఛాన్స్... టీ20ల్లో బెస్ట్ స్పిన్నర్‌ని కాదని...

First Published Sep 9, 2021, 9:57 AM IST

టీ20, వన్డేల్లో భారత జట్టుకి ప్రధాన స్పిన్నర్‌గా ఉన్నాడు యజ్వేంద్ర చాహాల్. తన సహచర స్పిన్నర్ కుల్దీప్ యాదవ్, జట్టుకి దూరమైనా చాహాల్ మాత్రం పరిమిత ఓవర్ల క్రికెట్‌లో జట్టులో కీలక సభ్యుడిగా ఉన్నాడు. అయితే టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీలో మాత్రం అతనికి చోటు దక్కలేదు...

పరిమిత ఓవర్ల క్రికెట్‌లో టీమిండియా స్పిన్ భారాన్ని మోస్తున్న యజ్వేంద్ర చాహాల్‌ని పక్కనబెట్టి... అతని స్థానంలో మరో ఐదుగురు స్పిన్నర్లను ఎంపిక చేశారు సెలక్టర్లు...

నాలుగేళ్ల క్రితం టీ20 ఫార్మాట్‌కి దూరమైన రవిచంద్రన్ అశ్విన్‌కి వరల్డ్‌కప్ టీమ్‌లో చోటు కల్పించి, సడెన్ సర్‌ప్రైజ్ ఇచ్చిన సెలక్టర్లు... అతనితో పాటు మరో నలుగురు స్పిన్నర్లను ఎంపిక చేశారు...

రాహుల్ చాహార్, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజాలతో పాటు వరుణ్ చక్రవర్తికి టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీ ఆడే జట్టులో చోటు దక్కింది... 

ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ తరుపున ఆడే రాహుల్ చాహార్‌కి మూడు టీ20 మ్యాచులు ఆడిన అనుభవం మాత్రమే ఉంది. విండీస్‌పై తన మొదటి మ్యాచ్ ఆడిన రాహుల్, మూడు మ్యాచుల్లో మూడు వికెట్లు మాత్రమే పడగొట్టాడు...

అలాగే అనూహ్యంగా టీ20 వరల్డ్‌కప్ జట్టులోకి వచ్చిన అక్షర్ పటేల్, తన కెరీర్‌లో 12 టీ20 మ్యాచులు ఆడి, 9 వికెట్లు పడగొట్టాడు... 

వరుణ్ చక్రవర్తి గురించి ఇంక చెప్పాల్సిన అవసరమే లేదు. ఐపీఎల్ 2020 సీజన్‌లో ఒకే మ్యాచ్‌లో ఐదు వికెట్లు తీసి, సెలక్టర్లను ఆకర్షించిన వరుణ్ చక్రవర్తి, ఆస్ట్రేలియా టూర్‌కి ఎంపికయ్యాడు...

అయితే గాయం కారణంగా ఆ సిరీస్‌ ఆడలేకపోయిన వరుణ్ చక్రవర్తి, స్వదేశంలో ఇంగ్లాండ్‌తో జరిగిన సిరీస్‌కి ఎంపికైనా ఫిట్‌నెస్ టెస్టు ఫెయిల్ అవ్వడంతో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేకపోయాడు...

మొత్తానికి రాహుల్ ద్రావిడ్ కారణంగా శ్రీలంకతో జరిగిన సిరీస్‌లో ఎంట్రీ ఇచ్చిన వరుణ్ చక్రవర్తి... మూడు మ్యాచుల్లో రెండే వికెట్లు పడగొట్టగలిగాడు...

ఈ ముగ్గురి కంటే యజ్వేంద్ర చాహాల్‌కి టీ20ల్లో అనుభవం చాలా ఎక్కువ. టీమిండియా తరుపున 49 టీ20 మ్యాచులు ఆడిన చాహాల్, 63 వికెట్లు పడగొట్టాడు...

అలాంటి యజ్వేంద్ర చాహాల్‌ను కాదని, ఏ మాత్రం అనుభవం లేని వరుణ్ చక్రవర్తికి ఛాన్స్ ఇవ్వడంపై క్రికెట్ విశ్లేషకులు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు...

‘యుజి చాహాల్ టీమిండియాకి టీ20ల్లో కొన్నేళ్లుగా బెస్ట్ స్పిన్నర్‌గా ఉన్నాడు. రషీద్ ఖాన్ తర్వాత వరల్డ్‌లో బెస్ట్ స్పిన్నర్ అతనే. ఇండియా తరుపున ఐదుగురు స్పిన్నర్లకి ఛాన్స్ ఇచ్చి, చాహాల్‌ని పట్టించుకోకపోవడం... దేనికి అర్థం...’ అంటూ ట్వీట్ చేశాడు మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా...

click me!