ఈసారి టైటిల్ గెలిచినా, క్రెడిట్ అంతా అతనికేగా... విరాట్ కోహ్లీ ఫ్యాన్స్‌లో అసంతృప్తి...

First Published Sep 9, 2021, 9:34 AM IST

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీకి జట్టుని ప్రకటించింది బీసీసీఐ. 15 మంది ప్లేయర్లు, ముగ్గురు స్టాండ్‌బై ప్లేయర్లతో కూడిన జట్టులో కొన్ని సర్‌ప్రైజ్‌లు కూడా ప్యాక్ చేసి పెట్టారు సెలక్టర్లు. అంతా బాగానే ఉంది కానీ, ఓ నిర్ణయంపై మాత్రం విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు...

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీకి భారత జట్టుకి మెంటర్‌గా ఎమ్మెస్ ధోనీ వ్యవహరించబోతున్నాడని, బీసీసీఐ విన్నపాన్ని ఆయన ఆహ్వానించాడని తెలియచేశాడు బీసీసీఐ సెక్రటరీ జై షా...

2007లో భారత జట్టుకి టీ20 వరల్డ్‌కప్ అందించిన ఎమ్మెస్ ధోనీ, ఆ తర్వాత 2009, 2010, 2012, 2014, 2016 సీజన్లలో కెప్టెన్‌గా వ్యవహరించాడు... 

మాహీ లేకుండా ఆడుతున్న మొట్టమొదటి టీ20 వరల్డ్‌కప్ ఇది. షెడ్యూల్ ప్రకారం 2020లో టీ20 వరల్డ్‌కప్ జరిగి ఉంటే, ధోనీ ఆడేవాడే. కరోనా కారణంగా ఈ టోర్నీ వాయిదా పడడంతో అతను రిటైర్మెంట్ ప్రకటించేశాడు...

మాహేంద్ర సింగ్ ధోనీని మెంటర్‌గా నియమించడంతో మరోసారి విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, మాహీ రూపంలో ముగ్గురు టీమిండియా సూపర్ స్టార్లను ఒక్కచోట చూసే అదృష్టం, టీమిండియా ఫ్యాన్స్‌కి దక్కనుంది...

అయితే ఇప్పటికీ చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్లు దీపక్ చాహార్, శార్దూల్ ఠాకూర్, రవీంద్ర జడేజా వంటి ప్లేయర్లు ఎప్పుడు మ్యాచ్ విన్నింగ్ పర్ఫామెన్స్ ఇచ్చినా, ఆ క్రెడిట్ అంతా మాహీ చలవే అంటూ కామెంట్లు చేస్తున్నారు ధోనీ అభిమానులు...

అంతేనా భారత జట్టుతో ఏ మాత్రం సంబంధం సామ్ కుర్రాన్, మొయిన్ ఆలీ వంటి ప్లేయర్లు... మెరుపులు మెరిపించినా దానికి ధోనీయే కారణం అంటూ తెగ ఊదరకొడతారు...

అలాంటిది ఈసారి టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీకి మహేంద్ర సింగ్ ధోనీనే మెంటర్‌గా నియమించింది బీసీసీఐ. కెప్టెన్‌గా తన తొలి టీ20 వరల్డ్‌కప్‌లో కోహ్లీ టైటిల్ గెలిచినా... అందులో అతనికి దక్కే క్రెడిట్ తక్కువే...

కెప్టెన్‌‌గా టెస్టుల్లో టీమిండియాకి అద్వితీయ విజయాలు అందిస్తున్న విరాట్ కోహ్లీ, టీ20ల్లోనూ మంచి రికార్డు క్రియేట్ చేశాడు...

కోహ్లీ కెప్టెన్సీలో టీమిండియా గత 15 నెలలుగా టీ20 సిరీస్‌ ఓడిపోలేదు. భారత జట్టు ఓడిన చివరి రెండు టీ20 సిరీస్‌లు కూడా ఒకటి రోహిత్ శర్మ కెప్టెన్సీలో, మరోటి శిఖర్ ధావన్ కెప్టెన్సీలో ఓడిన శ్రీలంక సిరీస్...

అయినా కూడా విరాట్ కోహ్లీకి దక్కుతున్న గుర్తింపు చాలా తక్కువే. కారణం మహేంద్ర సింగ్ ధోనీ, రోహిత్ శర్మ... మహేంద్ర సింగ్ ధోనీ సాధించలేని విజయాలను అందుకుంటున్నందుకు మాహీ ఫ్యాన్స్‌కి విరాట్ కోహ్లీ అంటే పడదు...

అలాగే ఐపీఎల్‌లో ఐదు టైటిల్స్ అందించిన రోహిత్ శర్మకు కెప్టెన్సీ దక్కకుండా అడ్డుగా నిలబడినందుకు హిట్ మ్యాన్ ఫ్యాన్స్‌కి విరాట్ కోహ్లీ అంటే చెప్పలేనంత ద్వేషం, కోపం...

ఇప్పుడు విరాట్ కోహ్లీ తన కెప్టెన్సీతో టీ20 వరల్డ్‌కప్‌లో భారత జట్టుని విజేతగా నిలిపినా... క్రెడిట్ మొత్తం మెంటర్‌గా డ్రెస్సింగ్ రూమ్‌లో ఉండే ఎమ్మెస్ ధోనీకే పోతుంది... అందులో ఎలాంటి సందేహాలు అవసరం లేదు...

వాస్తవానికి టీమిండియా ఇప్పుడు టెస్టుల్లో అదరగొడుతోంది. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా వంటి టాప్ క్లాస్ టీమ్‌లకే చుక్కలు చూపిస్తోంది. అయితే ఇండియాలో మాత్రం కోహ్లీ కెప్టెన్సీకి దక్కాల్సినంత క్రెడిట్ దక్కడం లేదు...

అదే విరాట్ కోహ్లీ స్థానంలో మహంద్ర సింగ్ ధోనీ ఉంటే, టీమిండియా ఫ్యాన్స్ ఇప్పటికి గుడి కట్టేసేవాళ్లు... అని అంటున్నారు విరాట్ కోహ్లీ. వారి ఆవేదనలోనూ నిజం లేకపోలేదని అంటున్నారు క్రికెట్ ఎక్స్‌పర్ట్స్...

click me!