టీ20 వరల్డ్‌కప్‌కి జట్టుని ప్రకటించిన బీసీసీఐ... మెంటర్‌గా ఎమ్మెస్ ధోనీ...

First Published Sep 8, 2021, 9:38 PM IST

టీ20 వరల్డ్‌కప్‌ 2021కి భారత జట్టుని ప్రకటించింది బీసీసీఐ... ముందుగా చెప్పినట్టుగానే కొన్ని సర్‌ప్రైజ్‌లతో 15 మంది ప్లేయర్లు, నలుగురు స్టాండ్ బై ప్లేయర్లతో కూడిన జట్టును ప్రకటించింది భారత క్రికెట్ బోర్డు...

విరాట్ కోహ్లీ: టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీకి విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా వ్యవహరించబోతున్నాడు... ముందుగా ప్రకటించినట్టుగానే ఈ లీగ్‌లో ఓపెనర్‌గా కూడా రావాలనుకుంటున్నాడు విరాట్ కోహ్లీ.

రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్: ఓపెనర్లుగా రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్‌లను ఎంపిక చేసింది బీసీసీఐ. రోహిత్ ఈ మెగా టోర్నీకి వైస్ కెప్టెన్‌గా,  కెఎల్ రాహుల్ అవసరమైతే వికెట్ కీపర్‌గా, మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌గా రాబోతున్నాడు.

Latest Videos


వికెట్ కీపర్లుగా రిషబ్ పంత్‌తో పాటు ఇషాన్ కిషన్‌కి కూడా అవకాశం ఇచ్చింది బీసీసీఐ. వన్‌డౌన్ ప్లేయర్‌గా సూర్యకుమార్ యాదవ్‌కి చోటు దక్కింది...

హార్ధిక్ పాండ్యా, రవీంద్ర జడేజా ఆల్‌రౌండర్లుగా టీ20 వరల్డ్‌కప్‌కి ఎంపికయ్యారు. హార్ధిక్ పాండ్యా అన్న కృనాల్ పాండ్యాకి మాత్రం నిరాశే ఎదురైంది...

కొన్నేళ్లుగా టెస్టులకే పరిమితమైన రవిచంద్రన్ అశ్విన్‌ను సర్‌ప్రైజ్ ప్యాక్‌గా టీ20 వరల్డ్‌కప్‌కి ఎంపిక చేసింది బీసీసీఐ. వాషింగ్టన్ సుందర్ గాయపడడంతో అశ్విన్‌కి చోటు దక్కినట్టు అంచనా...

అక్షర్ పటేల్‌, రాహుల్ చాహార్, వరుణ్ చక్రవర్తిలకు అవకాశం ఇచ్చిన బీసీసీఐ, పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ప్రధాన స్పిన్నర్‌గా ఉన్న యజ్వేంద్ర చాహాల్‌, కుల్దీప్ యాదవ్‌లకు షాక్ ఇచ్చింది...

జస్ప్రిత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీలో భారత పేస్ భారాన్ని మోయనున్నారు....

వీరితో పాటు స్టాండ్‌బై ప్లేయర్లుగా శ్రేయాస్ అయ్యర్, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహార్‌లకు టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీ కోసం యూఏఈ వెళ్లనున్నారు. 

భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ లేకుండా ఆడుతున్న మొట్టమొదటి టీ20 వరల్డ్‌కప్ ఇది. ఈ టోర్నీకి మహీ మెంటర్‌గా వ్యవహారించబోతున్నట్టు బీసీసీఐ సెక్రటరీ జే షా తెలిపారు...

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీకి భారత జట్టు ఇది: విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, రాహుల్ చాహార్, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రిత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ
స్టాండ్ బై ప్లేయర్లు: శ్రేయాస్ అయ్యర్, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహార్.

click me!