ఆడించనప్పుడు ఆ ఇద్దరినీ ఎందుకు సెలక్ట్ చేస్తున్నారు... మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్‌లకు...

Published : Feb 26, 2022, 08:07 PM IST

రోహిత్ శర్మ కెప్టెన్సీలో టీమిండియా వరుస విజయాలతో దూసుకుపోతోంది. స్వదేశంలో తిరుగులేని విజయాలు సాధిస్తూ... న్యూజిలాండ్, వెస్టిండీస్‌ను చిత్తు చేసింది. శ్రీలంక కూడా అదే పనిలో ఉంది...

PREV
111
ఆడించనప్పుడు ఆ ఇద్దరినీ ఎందుకు సెలక్ట్ చేస్తున్నారు... మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్‌లకు...

విరాట్ కోహ్లీ నుంచి మూడు ఫార్మాట్లలో కెప్టెన్సీ పగ్గాలు స్వీకరించిన రోహిత్ శర్మ... వరుసగా 10 విజయాలు అందుకుని, కివీస్, వెస్టిండీస్ జట్లను వైట్ వాష్ చేశాడు...

211

అయితే రోహిత్ శర్మ కెప్టెన్సీలో కొందరు ప్లేయర్లకు విఫలమైనా వరుస అవకాశాలు దక్కుతుంటే, మరికొందరికి తుదిజట్టులో అసలు అవకాశమే దక్కడం లేదు...
 

311

ఆస్ట్రేలియా టూర్‌ 2020-21లో టెస్టు ఆరంగ్రేటం చేసినప్పటి నుంచి అద్బుతంగా బౌలింగ్ చేస్తూ... పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో కూడా చోటు దక్కంచుకోగలిగాడు మహ్మద్ సిరాజ్...

411

దీపక్ చాహార్ గాయం కారణంగా శ్రీలంకతో టీ20 సిరీస్‌కి దూరం కావడంతో మహ్మద్ సిరాజ్‌కి అవకాశం దక్కుతుందని భావించారంతా...
 

511

ఫామ్‌లో లేని లంకపై జస్ప్రిత్ బుమ్రా వంటి సీనియర్ ప్లేయర్‌ను ఆడించడం కంటే, సిరాజ్‌కి టీ20ల్లో మరో అవకాశం ఇస్తే బెటర్ అని భావించారు క్రికెట్ విశ్లేషకులు...

611

అయితే రోహిత్ శర్మ మాత్రం మహ్మద్ సిరాజ్‌కి ఒక్క అవకాశం కూడా ఇవ్వడం లేదు. అలాగే స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ పరిస్థితి కూడా అదే...
 

711

చైనామెన్ యాక్షన్‌తో రెండు హ్యాట్రిక్‌లు తీసిన మొదటి భారత బౌలర్‌గా నిలిచిన కుల్దీప్ యాదవ్‌... రెండేళ్లుగా సరైన అవకాశాలు దక్కించుకోలేకపోతున్నాడు...

811

టీమ్‌కి ఎంపిక అవుతున్నా, కుల్దీప్ యాదవ్‌కి తుది జట్టులో మాత్రం చోటు దక్కడం లేదు. అప్పుడప్పుడూ కాదనకుండా ఓ మ్యాచ్‌లో ఆడించి, తర్వాత పక్కనబెట్టేస్తున్నారు...

911

మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్ లాంటి ప్లేయర్లను ఆడించలేనప్పుడు... వారిని ఎంపిక చేయకపోతే రంజీ ట్రోఫీలో ఆడే అవకాశం ఉండేది...

1011

అలా రంజీ ట్రోఫీ ఆడనివ్వకుండా, టీమిండియాలో ఆడే ఛాన్స్ అవకాశం ఇవ్వకుండా టూర్‌లు తిప్పించడం ఎందుకుని నిలదీస్తూ పోస్టులు పెడుతున్నారు అభిమానులు...

1111

ఐపీఎల్‌కి ముందు కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్ రంజీ ట్రోఫీలో ఆడితే... ఆర్‌సీబీ, ఢిల్లీ క్యాపిటల్స్ వంటి జట్లకి లాభం చేకూరుతుందనే ఉద్దేశంతో రోహిత్ శర్మ... వారిని పక్కనబెట్టాడని కామెంట్లు చేస్తున్నారు విరాట్ ఫ్యాన్స్...

Read more Photos on
click me!

Recommended Stories