బౌలర్లను ఎందుకు అంటున్నారు, ఫైనల్ ఓటమికి అసలు కారణం వాళ్లే... మాజీ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్...

Published : Jul 01, 2021, 01:17 PM IST

వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో భారత జట్టు 8 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. న్యూజిలాండ్ బౌలర్లు, భారత బ్యాట్స్‌మెన్‌ను ముప్పుతిప్పలు పెట్టిన చోట, టీమిండియా బౌలర్లు ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోయారు. అయితే ఫైనల్ పరాజయం బాధ్యత మొత్తం బ్యాట్స్‌మెన్‌దే అంటున్నాడు మాజీ చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్...

PREV
19
బౌలర్లను ఎందుకు అంటున్నారు, ఫైనల్ ఓటమికి అసలు కారణం వాళ్లే... మాజీ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్...

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు వర్షం, వాతావరణం అంతరాయం కలిగించడంతో పలుమార్లు ఆగి మొదలైన మొదటి ఇన్నింగ్స్‌లో 217 పరుగులకు ఆలౌట్ అయ్యింది...

29

న్యూజిలాండ్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 249 పరుగులు చేయడంతో తొలి ఇన్నింగ్స్‌లో కివీస్‌కి 32 పరుగుల స్వల్ప ఆధిక్యం దక్కింది. రెండో ఇన్నింగ్స్‌లో భారత జట్టు కేవలం 170 పరుగులకే కుప్పకూలడంతో న్యూజిలాండ్‌కి 139 పరుగుల విజయలక్ష్యం వచ్చింది.

39

ఆ టార్గెట్‌ను 2 వికెట్లు కోల్పోయి చేధించిన న్యూజిలాండ్, మొట్టమొదటి ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ టోర్నీ విజేతగా నిలిచింది. తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ టెయిలెండర్ల వికెట్లను తీయడంతో భారత బౌలర్లు చేసిన ఆలస్యానికి భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది.

49

‘ఫైనల్‌లో భారత జట్టు బెస్ట్ బౌలింగ్ కాంబినేషన్‌ను ఆడించింది. అందులో ఎలాంటి తప్పూ లేదు. ఓటమికి అసలు బాధ్యత బ్యాట్స్‌మెన్‌దే. భారత జట్టు రెండో ఇన్నింగ్స్‌లో ఇంకో 60 పరుగులు చేసి ఉంటే ఫలితం వేరేగా ఉండేది.

59

తొలి ఇన్నింగ్స్‌లో 300 పరుగులైనా చేయాల్సింది. అప్పుడు మ్యాచ్ ఫలితం కచ్ఛితంగా భారత్‌వైపు మళ్లేది. లేదా డ్రా అయినా అయ్యేది. ప్లేయింగ్ ఎలెవన్ జట్టులో ఎలాంటి తప్పు జరగలేదు. కానీ బ్యాట్స్‌మెన్ పరుగులు చేయడానికి పడిన ఇబ్బందే, టీమిండియా ఓటమికి కారణమైంది...

69

రవిచంద్రన్ అశ్విన్ ఫైనల్ మ్యాచ్‌లో నాలుగు వికెట్లు తీశాడు. రవీంద్ర జడేజా పర్ఫామెన్స్ మాత్రం తీవ్రంగా నిరాశపరిచింది. ఒకే ఒక్క వికెట్ తీసిన జడ్డూ, బ్యాటింగ్‌లోనూ మెరుపులు మెరిపించలేకపోయాడు...

79

వర్షం అంతరాయం కలిగించకుండా ఉండి ఉంటే, మ్యాచ్ పూర్తి ఓవర్ల పాటు సాగి ఉంటే... రిజల్ట్ భారత జట్టుకి ఫేవర్‌గానే ఉండేది. ఎందుకంటే పిచ్ మీద ఫుట్‌మార్క్‌ ఎక్కువగా పడడం, న్యూజిలాండ్ జట్టులో లెఫ్ట్ హ్యాండర్లు ఎక్కువగా ఉండడం వల్ల అశ్విన్‌కి మరిన్ని వికెట్లు దక్కేవి...’ అంటూ చెప్పుకొచ్చాడు మాజీ క్రికెటర్, మాజీ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్...

89

వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో న్యూజిలాండ్ జట్టు తరుపున తొలి ఇన్నింగ్స్‌లో డివాన్ కాన్వే హాఫ్ సెంచరీ చేయగా, కేన్ విలియంసన్ 49 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో రాస్ టేలర్ 47, కేన్ విలియంసన్ 52 పరుగులు చేశారు.

99

భారత జట్టు తరుపున తొలి ఇన్నింగ్స్‌లో వైస్ కెప్టెన్ అజింకా రహానే చేసిన 49 పరుగులే అత్యధికం. కెప్టెన్ విరాట్ కోహ్లీ తొలి ఇన్నింగ్స్‌లో 44 పరుగులు చేయగా, రిషబ్ పంత్ రెండో ఇన్నింగ్స్‌లో 41 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు..

click me!

Recommended Stories