పెళ్లాయ్యాక సోకు పెరిగింది, ఆట తగ్గింది... బుమ్రా పర్ఫామెన్స్ కారణంగా సంజనపై ట్రోలింగ్...

Published : Jul 01, 2021, 11:29 AM IST

టీమిండియా ఫెయిల్ అయినా, ఐపీఎల్‌లో ఆర్‌సీబీ ఫెయిల్ అయినా... ఆ ఎఫెక్ట్ విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మపై పడేది. కోహ్లీ ఫెయిల్యూర్‌కి అనుష్క శర్మను కారణంగా చూపిస్తూ ట్రోల్స్ చేసేవాళ్లు నెటిజన్లు. ఇప్పుడు జస్ప్రిత్ బుమ్రా విషయంలో కూడా అదే సీన్ రిపీట్ అవుతోంది...

PREV
111
పెళ్లాయ్యాక సోకు పెరిగింది, ఆట తగ్గింది... బుమ్రా పర్ఫామెన్స్ కారణంగా సంజనపై ట్రోలింగ్...

వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో భారత స్టార్ పేసర్ జస్ప్రిత్ బుమ్రా ఘోరంగా విఫలమయ్యాడు. ఓవర్‌సీస్‌లో మంచి రికార్డు ఉన్న బుమ్రా, రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ వికెట్ తీయలేకపోయాడు...

211

మొదటి ఇన్నింగ్స్‌లో ఓపెనిగ్ బౌలింగ్ వేసిన బుమ్రా... 26 ఓవర్లు వేసినా వికెట్లేమీ తీయలేకపోగా 57 పరుగులు ఇచ్చాడు... తొలి సెషన్‌లో అయినా 11 ఓవర్లలోనే 34 పరుగులిచ్చి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేశాడు బుమ్రా...

311

తొలి ఇన్నింగ్స్‌లో ఇషాంత్ శర్మ 3, షమీ 4 వికెట్లు తీయగా స్పిన్‌కి అనుకూలించని పిచ్‌పై అశ్విన్ 2, జడేజా ఓ వికెట్ తీయగా... భారత స్టార్ పేసర్ జస్ప్రిత్ బుమ్రా వికెట్ తీయకపోవడం తీవ్ర చర్చనీయాంశమైంది...

411

రెండో ఇన్నింగ్స్‌లో 10.4 ఓవర్లు వేసిన జస్ప్రిత్ బుమ్రా, 35 పరుగులిచ్చాడు. బుమ్రా బౌలింగ్‌లో రాస్ టేలర్ ఇచ్చిన క్యాచ్‌ను ఛతేశ్వర్ పూజారా జారవిడచడంతో అతనికి వికెట్ దక్కలేదు...

511

ఫైనల్ మ్యాచ్‌లో బుమ్రా, బుమ్రా రేంజ్‌లో పర్ఫామెన్స్ ఇచ్చి ఉండి ఉంటే, ఇంగ్లాండ్‌కి లీడ్ దక్కేది కాదు. కచ్ఛితంగా ఆఖరి రోజు భారత జట్టుదే పైచేయి అయ్యేదనేది క్రికెట్ విశ్లేషకుల అభిప్రాయం. 

611

షమీ, ఇషాంత్ శర్మ అంచనాలకు తగ్గట్టుగా రాణించినా భారీ అంచనాలతో ఫైనల్‌ మ్యాచ్ జస్ప్రిత్ బుమ్రా ఘోరంగా ఫెయిల్ అయ్యాడు. అతని స్థానంలో మహ్మద్ సిరాజ్‌ను ఆడించినా ఫలితం దక్కేదని కామెంట్లు వినిపించాయి...

711

బౌలింగ్‌లో వికెట్లేమీ తీయకుండా సున్నాతో ముగించిన జస్ప్రిత్ బుమ్రా, బ్యాటింగ్‌లోనూ అదే ఫీట్ రిపీట్ చేశాడు. రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ డకౌట్ అయ్యి, ఒక్క పరుగు కూడా చేయలేకపోయాడు.

811

ప్రస్తుతం ఇంగ్లాండ్‌తో హాలీడేస్ ఎంజాయ్ చేస్తున్న జస్ప్రిత్ బుమ్రా, ఆయన భార్య సంజన గణేశన్‌... లండన్ వీధుల్లో విహరిస్తూ ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు... దీంతో బుమ్రా జోడీని టార్గెట్ చేస్తూ కామెంట్లతో ట్రోల్ చేస్తున్నారు టీమిండియా ఫ్యాన్స్...

911

ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్ మధ్యలో పెళ్లి కోసం విరామం తీసుకున్న జస్ప్రిత్ బుమ్రా, ఆ తర్వాత జరిగిన వన్డే, టీ20 సిరీస్‌లో పాల్గొనలేదు. ఐపీఎల్ సీజన్‌లో బాగానే రాణించినా... ఆ తర్వాత కీలకమైన మ్యాచ్‌లో ఫెయిల్ కావడం ఫ్యాన్స్ తట్టుకోలేకపోతున్నారు.

1011

పెళ్లి అయిన తర్వాత భార్యతో గడపడానికి బుమ్రాకి సమయం సరిపోవడం లేదనే, ఇక బౌలింగ్ ప్రాక్టీస్ చేసేందుకు టైం ఎక్కడ ఉంటుందని... కాస్త సోకు తగ్గించి, ఆటపై ఫోకస్ పెడితే కెరీర్ బాగుంటుందని కామెంట్లు చేస్తున్నారు...

1111

స్పోర్ట్స్ యాంకర్ సంజన గణేశన్‌ను ప్రేమించి పెళ్లాడిన జస్ప్రిత్ బుమ్రా... కళ్యాణ వేడుక తన జీవితంలో బెస్ట్ మూమెంట్ అంటూ కామెంట్ చేయడం విశేషం... పెళ్లికి ముందు సోషల్ మీడియాలో చాలా తక్కువగా యాక్టీవ్‌గా ఉండే బుమ్రా, పెళ్లి తర్వాత వరుసగా సంజనతో దిగిన ఫోటోలను పోస్టు చేస్తూ ఆమెపై తనకున్న ప్రేమను వ్యక్తపరుస్తుండడం కొసమెరుపు.

click me!

Recommended Stories