పరుగులే చేయలేని పూరన్‌కి రూ.16 కోట్లా... గౌతమ్ గంభీర్ చెప్పిన ఆన్సర్ వింటే...

First Published Dec 24, 2022, 1:53 PM IST

ఐపీఎల్ 2023 మినీ వేలంలో అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసిన విషయం నికోలస్ పూరన్‌కి రూ.16 కోట్ల బంపర్ ప్రైజ్ దక్కడం. సామ్ కుర్రాన్, బెన్ స్టోక్స్, కామెరూన్ గ్రీన్ వంటి ప్లేయర్లకు భారీ ధర దక్కుతుందని చాలామంది అంచనా వేశారు. అనుకున్నట్టే వారికి రికార్డు ధర దక్కింది. అయితే పూరన్‌కి ఇంత ధర దక్కడం మాత్రం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది...

ఐపీఎల్ 2021 సీజన్‌లో పంజాబ్ కింగ్స్ తరుపున ఆడిన నికోలస్ పూరన్, నాలుగు సార్లు డకౌట్ అయ్యాడు. 12 మ్యాచుల్లో కలిపి 7.72 సగటుతో 85 పరుగులు మాత్రమే చేయగలిగాడు. దీంతో పూరన్‌ని 2022 మెగా వేలానికి విడుదల చేసింది పంజాబ్ కింగ్స్...

nicholas pooran

ఐపీఎల్ 2022 సీజన్ సమయంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు రూ.10 కోట్ల 75 లక్షలు పోసి మరీ నికోలస్ పూరన్‌ని కొనుగోలు చేసింది. 2021 సీజన్‌తో పోలిస్తే గత సీజన్‌లో పూరన్ కాస్త బెటర్ పర్ఫామెన్సే ఇచ్చాడు. 14 మ్యాచులు ఆడి 144.34 స్ట్రైయిక్ రేటుతో 306 పరుగులు చేశాడు...

అయితే పూరన్ ఆడిన ఆటకు, అతనికి పెట్టిన ప్రైజ్‌కి పొంతన లేదని భావించిన సన్‌రైజర్స్ హైదరాబాద్... వెస్టిండీస్ మాజీ కెప్టెన్‌ని వేలానికి విడుదల చేసింది.. నికోలస్ పూరన్‌కి మహా అయితే రూ.4-6 కోట్ల వరకూ దక్కుతుందని అంచనా వేశారు క్రికెట్ ఎక్స్‌పర్ట్స్...

nicholas pooran

అయితే నికోలస్ పూరన్ కోసం ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ పోటీపడడం ఆ తర్వాత రేసులోకి వచ్చిన లక్నో సూపర్ జెయింట్స్ జట్టు ఏకంగా రూ.16 కోట్లకు దక్కించుకోవడం జరిగిపోయాయి. పూరన్‌‌ని రూ.10 కోట్లకు కొనడమే వేస్ట్ అంటూ కామెంట్ చేసిన గౌతీ, ఇప్పుడు అతని కోసం రూ.16 కోట్లు పెట్టడానికి సిద్ధం కావడం విశేషం...

Nichoals Pooran

‘నికోలస్ పూరన్ గత సీజన్లలో ఎలా ఆడాడనే విషయాన్ని మేం ఆలోచించలేదు. పూరన్ ఏం చేయగలడో, అతని సత్తా ఏంటో మాకు బాగా తెలుసు. నికోలస్ పూరన్ లాంటి హిట్టర్ కావాలని ముందుగానే అనుకున్నాం. అతని వయసు ఇంకా 26-27 ఏళ్లే...

Nicholas Pooran

భవిష్యత్తులో ఇంకా ఎంతో చేయగలడు, మరెంతో సాధించగలడు. టాపార్డర్‌లో ఆడగలడు, లోయర్ ఆర్డర్‌లోనూ మ్యాచులు ఫినిష్ చేయగలడు. అంతేకాకుండా డానియల్ సామ్స్, రొమారియో షెఫర్డ్, జయ్‌దేవ్ ఉనద్కట్ వంటి ప్లేయర్లను బేస్ ప్రైజ్‌కే దక్కించుకున్నాం... కాబట్టి పూరన్‌కి పెట్టిన డబ్బు ఎక్కువని అనిపించలేదు.. ’ అంటూ కామెంట్ చేశాడు లక్నో సూపర్ జెయింట్స్ మెంటర్ గౌతమ్ గంభీర్...

click me!