MS Dhoni: లెజెండ్స్ లీగ్ క్రికెట్‌లో ధోనీని ఎందుకు ఆడనివ్వడం లేదు.. ? అస‌లు కారణం ఇదే..

First Published | Nov 27, 2023, 1:39 PM IST

Mahendra Singh Dhoni: మూడు ప్రధాన ఐసీసీ టోర్నమెంట్లలో తన జట్టును ఛాంపియన్‌గా మార్చిన ప్రపంచంలోనే మొదటి, ఏకైక కెప్టెన్ ఎంఎస్ ధోనీ. టీ20, వ‌న్డే టైటిళ్ల‌ను అందించ‌డంతో పాటు 2013లో ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్‌ను భార‌త్ కు అందించాడు ధోని.
 

Former India captain MS Dhoni: లెజెండ్స్ లీగ్ క్రికెట్ రెండో ఎడిషన్ ప్రస్తుతం జార్ఖండ్ రాజధాని రాంచీలో జరుగుతోంది. తొలి ఐదు మ్యాచ్‌లు రాంచీలోని జేఎస్‌సీఏ స్టేడియంలో జరగనున్నాయి. అయితే, లెజెండ్స్ లీగ్ క్రికెట్ లో భార‌త మాజీ కెప్టెన్ మ‌హేంద్ర సింగ్ ధోని ఎందుకు ఆడ‌టం లేద‌నే ప్ర‌శ్న చాలా మందికి వ‌చ్చే ఉంటుంది.
 

టీమిండియా మాజీ దిగ్గజ ఆటగాడిగా, కెప్టెన్ కూల్ గా పేరు సంపాదించిన‌ మహేంద్ర సింగ్ ధోనీ ఆల్ టైమ్ గ్రేట్ ప్లేయర్స్‌లో చోటు దక్కించుకున్నారు. అతని కెప్టెన్సీలో ఐసీసీ వ‌న్డే ప్రపంచకప్‌లో భారత్‌కు రెండోసారి ట్రోఫీని గెలుచుకునే అవకాశం లభించింది. మూడు ప్రధాన ఐపీసీ టోర్నమెంట్లలో తన జట్టును ఛాంపియన్‌గా మార్చిన ప్రపంచంలోనే మొదటి, ఏకైక కెప్టెన్ ధోనీ.
 

Latest Videos


ధోని కెప్టెన్సీలో భారత్ 2011లో వన్డే ప్రపంచకప్‌ను గెలుచుకుంది, ఆ తర్వాత 2013లో ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్‌ను గెలుచుకుంది. ఇది కాకుండా 2007లో ధోనీ సారథ్యంలో భారత్ తొలి టీ20 ప్రపంచకప్‌ను కైవసం చేసుకుంది. ఇంత విజయవంతమైన కెప్టెన్, ప్ర‌ముఖ ప్లేయ‌ర్ అయినప్పటికీ, ధోనీని లెజెండ్స్ లీగ్ క్రికెట్ ఆడటానికి ఎందుకు అనుమతించలేదు అనే ప్రశ్న ఇప్పుడు తలెత్తుతుంది.

ధోని లెజెండ్స్ లీగ్ క్రికెట్ ఆడ‌క‌పోవ‌డానికి అస‌లు కార‌ణం బీసీసీఐ. ఇది విచిత్రంగా అనిపించినా ఇదే నిజం. బీసీసీఐ నిబంధనల ప్రకారం.. బీసీసీఐతో తన సంబంధాలను తెంచుకునే వరకు ఏ ఆటగాడు ఏ విదేశీ లేదా ఫ్రాంచైజీ లీగ్‌లో (ఐపీఎల్ మినహా) ఆడకూడదు.
 

విదేశీ లేదా ఫ్రాంచైజీ లీగ్ ఆడేందుకు ఆటగాడు బీసీసీఐ అనుమతి తీసుకోవాలి. ధోని అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్ అయ్యాడు. ఏ దేశవాళీ క్రికెట్‌లో పాల్గొనలేదు, అయినప్పటికీ అతను ఇప్పటికీ  ఐపీఎల్ లో భాగమైనందున లెజెండ్స్ లీగ్‌ని ఆడటానికి అనుమతించలేదు.
 

ధోనీ చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ గా కొన‌సాగుతున్న సంగ‌తి తెలిసిందే. రాబోయే ఐపీఎల్ 2024 సీజ‌న్ లో కూడా ధోని చెన్నై సూప‌ర్ కింగ్స్ లో కొన‌సాగుతార‌ని స‌మాచారం. ఇది సీఎస్కే, ధోని ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ అనే చెప్పాలి. 
 

ప్ర‌స్తుతం లెజెండ్స్ లీగ్ క్రికెట్ రెండో ఎడిషన్ ప్రస్తుతం జార్ఖండ్ రాజధాని రాంచీలో జరుగుతోంది. తొలి ఐదు మ్యాచ్‌లు రాంచీలోని జేఎస్‌సీఏ స్టేడియంలో జరగనున్నాయి. భార‌త ప్లేయ‌ర్ల‌తో పాటు విదేశాల నుండి చాలా మంది వెటరన్ ప్లేయర్స్ ఈ లీగ్ లో పాల్గొంటున్నారు
 

లెజెండ్స్ లీగ్ క్రికెట్‌లో భార‌త్ తో పాటు విదేశీ ప్లేయ‌ర్లు పాల్గొన్నారు. గౌతమ్ గంభీర్, మునాఫ్ పటేల్, యూసుఫ్, ఇర్ఫాన్ పఠాన్, షేన్ వాట్సన్, తిలకరత్నే దిల్షాన్, హర్భజన్ సింగ్, మహ్మద్ కైఫ్ వంటి వెటరన్ ఆటగాళ్లు ఈ లీగ్‌లో ఆడుతున్నారు.
 

click me!