రిషబ్ పంత్, శ్రేయాస్ అయ్యర్‌లను ఎందుకు పక్కనబెట్టారు... కెప్టెన్సీ రాని కెఎల్ రాహుల్‌కి కెప్టెన్సీ...

Published : Jan 02, 2022, 03:22 PM IST

రోహిత్ శర్మ గాయంపై క్లారిటీ రాకపోవడంతో సౌతాఫ్రికాతో జరిగే వన్డే సిరీస్‌కి కెఎల్ రాహుల్‌ని కెప్టెన్‌గా నియమిస్తూ నిర్ణయం తీసుకుంది బీసీసీఐ. జస్ప్రిత్ బుమ్రాకి వైస్ కెప్టెన్సీ అప్పగించారు సెలక్టర్లు...

PREV
111
రిషబ్ పంత్, శ్రేయాస్ అయ్యర్‌లను ఎందుకు పక్కనబెట్టారు... కెప్టెన్సీ రాని కెఎల్ రాహుల్‌కి కెప్టెన్సీ...

ఇంగ్లాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో గాయపడడానికి ముందు టీమిండియా ఫ్యూచర్ కెప్టెన్‌గా శ్రేయాస్ అయ్యర్ గురించి తెగ ప్రచారం జరిగింది...

211

అయ్యర్ ఫిట్‌గా ఉంటే, శ్రీలంకలో పర్యటించిన భారత జట్టుకి అతనే కెప్టెన్‌గా వ్యవహరించేవాడని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కూడా కామెంట్ చేశాడు...

311

శ్రేయాస్ అయ్యర్‌తో పాటు రిషబ్ పంత్ కూడా తన కెప్టెన్సీ స్కిల్స్‌తో అందరి దృష్టిని ఆకర్షించాడు. అయితే ఈ ఇద్దరినీ కాదని కెఎల్ రాహుల్‌కి కెప్టెన్సీ అప్పగించారు సెలక్టర్లు...

411

ఐపీఎల్‌లో కెఎల్ రాహుల్ కెప్టెన్సీపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఆరెంజ్ క్యాప్ గెలవడం తప్ప, టీమ్‌కి విజయాలు అందించడంలో సారథిగా ఫెయిల్ అయ్యాడు కెఎల్ రాహుల్...

511
KL Rahul

అయినా కెఎల్ రాహుల్‌కి కెప్టెన్సీ ఇవ్వడానికి కారణం మూడు ఫార్మాట్లలో అతను చూపిస్తున్న నిలకడైన ప్రదర్శనే... 

611

వన్డే, టీ20ల్లో అద్భుతమైన ఫామ్‌లో ఉన్న కెఎల్ రాహుల్, టెస్టుల్లోనూ రీఎంట్రీ తర్వాత అదరగొడుతున్నాడు...

711

ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌లో రీఎంట్రీ ఇచ్చిన కెఎల్ రాహుల్, రోహిత్ శర్మ గైర్హజరీతో టెస్టు వైస్ కెప్టెన్సీ కూడా దక్కించుకుని, వన్డే సిరీస్‌కి కెప్టెన్‌గా ఎంపికయ్యాడు...

811

శ్రేయాస్ అయ్యర్ గాయం నుంచి కోలుకున్న తర్వాత టీమిండియా తరుపున వైట్ బాల్ క్రికెట్ ఆడలేదు. కాన్పూర్ టెస్టులో సెంచరీతో ఆకట్టుకున్నా, ఆ పర్ఫామెన్స్‌తో వన్డే కెప్టెన్సీ ఇవ్వలేని పరిస్థితి...

911

రిషబ్ పంత్... టెస్టుల్లో రాణిస్తున్నా, వైట్ బాల్ క్రికెట్‌లో అతని నుంచి ఆశించిన స్థాయిలో నిలకడైన ప్రదర్శన మాత్రం రావడం లేదనే చెప్పాలి...

1011

అందుకే మూడు ఫార్మాట్లలోనూ నిలకడైన ప్రదర్శన ఇస్తున్న కెఎల్ రాహుల్‌కి కెప్టెన్సీ అప్పగించడమే న్యాయమని భావించి, ఈ నిర్ణయం తీసుకున్నారు సెలక్టర్లు...

1111

భవిష్యత్తులో రిషబ్ పంత్, శ్రేయాస్ అయ్యర్ మూడు ఫార్మాట్లలో నిలకడగా రాణిస్తే... ఈ ఇద్దరి మధ్య టీమిండియా కెప్టెన్సీ రేసు ఉండే అవకాశం ఎక్కువగా ఉంది...

Read more Photos on
click me!

Recommended Stories