ఆ ఇద్దరి వల్లే గబ్బా టెస్టులో అలా ఆడాం... గబ్బా టెస్టు విజయంపై మాజీ కోచ్ రవిశాస్త్రి కామెంట్స్...

First Published Jan 2, 2022, 1:10 PM IST

భారత క్రికెట్ జట్టు చరిత్రలో అత్యద్భుత టెస్టు విజయాల్లో ఒకటిగా చరిత్రలో నిలిచిపోతుంది బ్రిస్బేన్‌లోని గబ్బాలో జరిగిన ఆస్ట్రేలియా, భారత్‌ మధ్య జరిగిన నాలుగో టెస్టు మ్యాచ్... అయితే ఈ మ్యాచ్‌లో భారత జట్టు ఆటను నిర్ణయించింది ఇద్దరు కుర్రాళ్లట...

32 ఏళ్లుగా ఓటమి ఎరుగని గబ్బాలో టెస్టు మ్యాచ్ కావడంతో ఓవర్ కాన్ఫిరెన్స్‌తో బరిలో దిగింది ఆస్ట్రేలియా... సిడ్నీ టెస్టు సమయంలో ఆసీస్ కెప్టెన్ టిమ్ పైన్ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చూశాడు...

అప్పటికే ఆడిలైడ్ పింక్ బాల్ టెస్టులో టీమిండియా 36 పరుగులకే ఆలౌట్ కావడంతో ఎలాగైనా సిరీస్ గెలుస్తామనే ధీమా ఆసీస్‌ జట్టులో కనిపించింది...

ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 369 పరుగులకి ఆలౌట్ అయ్యింది. మొట్టమొదటి టెస్టు మ్యాచ్ ఆడుతున్న నటరాజన్, వాష్టింగన్ సుందర్, రెండో టెస్టు ఆడుతున్న శార్దూల్ ఠాకూర్ మూడేసి వికెట్లతో ఆకట్టుకున్నారు...

భారత జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 186 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో శార్దూల్ ఠాకూర్, వాషింగ్టన్ సుందర్ కలిసి ఏడో వికెట్‌కి 123 పరుగుల భాగస్వామ్యం జోడించారు...

వాషింగ్టన్ సుందర్ 62, శార్దూల్ ఠాకూర్ 67 పరుగులు చేయడంతో భారత జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 336 పరుగులకి ఆలౌట్ అయ్యింది. ఆసీస్‌కి తొలి ఇన్నింగ్స్‌లో 33 పరుగుల ఆధిక్యం దక్కింది...

రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 294 పరుగులకి ఆలౌట్ అయ్యింది. మహ్మద్ సిరాజ్ 5 వికెట్లు తీయగా, శార్దూల్ ఠాకూర్ 4, వాషింగ్టన్ సుందర్ ఓ వికెట్ తీశాడు...

నాలుగో ఇన్నింగ్స్‌లో 328 పరుగుల భారీ లక్ష్యం... రోహిత్ శర్మ 7 పరుగులకే అవుట్ కావడంతో 18 పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది భారత జట్టు. ఆఖరి రోజు మ్యాచ్ డ్రా చేసుకోవాలంటే 90 ఓవర్లు నిలబడాలి. భారత జట్టు గెలుస్తుందనే నమ్మకం ఏ అభిమానికి లేదు...

అయితే ఆఖరి రోజు భారత జట్టు అద్భుతమై చేసింది. శుబ్‌మన్ గిల్ 146 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 91 పరుగులు చేసి అవుట్ కాగా, రిషబ్ పంత్ 138 బంతుల్లో 9 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 89 పరుగులు చేసి మ్యాచ్‌ని ముగించాడు...

‘బ్రిస్బేన్ టెస్టులో ఐదో రోజు ఆటతీరు ఎలా ఉండాలనే విషయంలో టీమ్ మీటింగ్ జరుగుతోంది. అజింకా రహానే, ఛతేశ్వర్ పూజారా వంటి సీనియర్లు... డ్రా కోసం ప్రయత్నిద్దామని చెప్పారు...

అయితే శుబ్‌మన్ గిల్, రిషబ్ పంత్ మాత్రం గెలుపు కోసం ఆడదామని అన్నారు. ఆఖరి రోజు వికెట్ కాపాడుకోవడం కోసం డిఫెన్స్ ఆడితే వికెట్లు పడతాయి...

అదే బౌండరీలు బాదుతూ, పరుగులు చేస్తూ లక్ష్యంవైపు సాగుతుంటే, ప్రత్యర్థి జట్టును ఒత్తిడిలోకి నెట్టొచ్చు. ఇదే గిల్, పంత్ అభిప్రాయపడ్డారు...

వారి ఆలోచననే అమలు చేయాలని అనుకున్నాం. రెండో వికెట్‌కి శుబ్‌మన్ గిల్, పూజారా 114 జోడించిన తర్వాత ఇక లక్ష్యాన్ని ఛేదించాలని ఫిక్స్ అయ్యాం.. 

ఆ విజయంలో క్రెడిట్ మాత్రం గిల్, పంత్‌లకే దక్కుతుంది...’ అంటూ కామెంట్ చేశాడు మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి... 

click me!