ఆసియా కప్, టీ20 వరల్డ్‌ కప్, ఇంగ్లాండ్‌తో మిగిలిన టెస్టు... ఈ ఏడాది టీమిండియా షెడ్యూల్ ఇదే...

First Published Jan 2, 2022, 1:43 PM IST

2021 ఏడాదిలో టీమిండియా అద్భుత విజయాలు అందుకుంది. ద్వైపాక్షిక సిరీసుల్లో తిరుగులేని ఆధిపత్యం చూపించిన భారత జట్టు, సిడ్నీ టెస్టులో చారిత్రక టెస్టుతో 2021 ఏడాదిని ఆరంభించి, సెంచూరియన్ టెస్టుతో ముగించింది.

2021 సీజన్‌లో జరిగిన రెండు ఐసీసీ టోర్నీల్లోనూ టైటిల్ గెలవలేకపోయిన టీమిండియా, ఆస్ట్రేలియా టూర్‌లో, ఇంగ్లాండ్ టూర్‌లో మంచి టెస్టు విజయాలు సాధించగలిగింది...

ఈ ఏడాది టీమిండియా ఫుల్లు బిజీ షెడ్యూల్‌తో గడపనుంది. జనవరిలో సౌతాఫ్రికాతో మిగిలిన రెండు టెస్టులు, మూడు వన్డే మ్యాచులు ఆడి స్వదేశానికి చేరుకుంటుంది భారత జట్టు...

ఆ తర్వాత స్వదేశంలో వెస్టిండీస్‌తో కలిసి మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచులు ఆడుతుంది భారత జట్టు. విండస్ టూర్ ముగిసిన తర్వాత శ్రీలంకతో సిరీస్ మొదలవుతుంది...

శ్రీలంకతో రెండు టెస్టులు, మూడు టీ20 మ్యాచులు ఆడుతుంది భారత జట్టు. ఆ తర్వాత ఆఫ్ఘనిస్తాన్‌తో కలిసి మూడు వన్డేలు ఆడనుంది...

ఆఫ్ఘాన్‌తో సిరీస్ ముగిసిన తర్వాత ఐపీఎల్ 2022 సీజన్ మొదలు కానుంది. 10 జట్లతో సాగే 2022 సీజన్ 74 రోజుల పాటు సుదీర్ఘంగా సాగనుంది... 

ఐపీఎల్‌ ముగిసిన తర్వాత సౌతాఫ్రికాతో కలిసి ఐదు టీ20 మ్యాచులు ఆడుతుంది. షెడ్యూల్ ప్రకారం ఈ టూర్‌లో టీ20 సిరీస్ కూడా జరగాల్సింది, అయితే పరిస్థితుల కారణంగా టీ20 సిరీస్‌ను వాయిదా వేయడం జరిగింది. 

జూన్‌లో తిరిగి ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్తుంది భారత జట్టు. అక్కడ గత ఏడాది కరోనా కారణంగా వాయిదా పడిన ఐదో టెస్టు ఆడనుంది. ఇప్పటికే ఈ సిరీస్‌లో 2-1 తేడాతో ఆధిక్యంలో ఉన్న విరాట్ సేన, ఈ మ్యాచ్‌ను డ్రా చేసుకున్నా టెస్టు సిరీస్ గెలవగలుగుతుంది...

మిగిలిన గెస్టుతో పాటు మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచులు ఆడి, ఇంగ్లాండ్ పర్యటన ముగిసిన తర్వాత వెస్టిండీస్ పర్యటనకి వెళ్తుంది భారత జట్టు. అక్కడ మూడు టీ20 మ్యాచులు, మూడు వన్డేలు ఆడుుతుంది...

ఆ తర్వాత సెప్టెంబర్, 2022లో శ్రీలంక వేదికగా ఆసియా కప్ టోర్నీలో పాల్గొంటుంది భారత జట్టు. 2018 ఆసియా కప్‌లో రోహిత్ శర్మ కెప్టెన్సీలోనే టైటిల్ సాధించింది టీమిండియా...

అక్టోబర్ నెలలో ఆస్ట్రేలియాలో ప్రారంభమయ్యే టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో రోహిత్ కెప్టెన్సీలో పాల్గొంటుంది టీమిండియా...

ఆ తర్వాత బంగ్లాదేశ్‌తో కలిసి రెండు టెస్టులు, మూడు వన్డే మ్యాచులు ఆడుతుంది. షెడ్యూల్‌ ప్రకారం జింబాబ్వే టూర్‌ కూడా జరగాల్సి ఉంది...ఓవరాల్‌గా ఈ ఏడాది 18 వన్డేలు ఆడే భారత జట్టు, ఏడు టెస్టు మ్యాచులు ఆడనుంది. 

click me!