సంజూ శాంసన్ ఉండగా జితేశ్ శర్మను ఎందుకు సెలక్ట్ చేశారు! శశి థరూర్ కామెంట్స్..

First Published | Oct 3, 2023, 4:17 PM IST

ఏషియన్ గేమ్స్ 2023 టోర్నీలో భారత పురుషుల క్రికెట్ జట్టు సెమీ ఫైనల్‌కి ప్రవేశించింది. నేపాల్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్స్‌లో 23 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది టీమిండియా...
 

నేపాల్‌తో జరిగిన మ్యాచ్ ద్వారా జితేశ్ శర్మ, రవిశ్రీనివాస్ సాయి కిషోర్ అంతర్జాతీయ ఆరంగ్రేటం చేశారు. రవిశ్రీనివాస్ సాయి కిషోర్ ఓ వికెట్ తీసి ఇంప్రెస్ చేయగా వికెట్ కీపర్ జితేశ్ శర్మ 4 బంతుల్లో ఓ ఫోర్‌తో 5 పరుగులు చేసి అవుట్ అయ్యాడు...

Sanju Samson

‘భారత సెకండ్ స్ట్రింగ్ జట్టు, ఏషియన్ గేమ్స్‌లో బాగా ఆడడం ఆనందంగా ఉంది. యశస్వి జైస్వాల్ చాలా సత్తా ఉన్న ఆటగాడని మరోసారి నిరూపించుకున్నాడు. కానీ ఎందుకని సంజూ శాంసన్‌కి ఈ టీమ్‌లో చోటు దక్కలేదు. జితేశ్ శర్మ కంటే సంజూ శాంసన్‌కి మంచి రికార్డు ఉంది. 

Latest Videos


Sanju Samson-Chahal

అతనేమైనా కుర్రాడా? అంటే అదీ లేదు. సంజూ శాంసన్ కంటే పెద్ద. ఈ సెలక్టర్లు ఏ ప్రాతిపదికన టీమ్‌ని సెలక్ట్ చేస్తున్నారో నాకైతే అంతుచిక్కడం లేదు’ అంటూ ట్వీట్ చేశాడు మాజీ మంత్రి శశి థరూర్..

Sanju Samson

కెఎల్ రాహుల్ గాయంతో బాధపడుతుండడంతో ఆసియా కప్ 2023 టోర్నీకి స్టాండ్ బై ప్లేయర్‌గా ఎంపికయ్యాడు సంజూ శాంసన్. అయితే రాహుల్ పూర్తిగా కోలుకోవడంతో సంజూ శాంసన్‌, స్వదేశానికి తిరిగి వచ్చేశాడు..

Sanju Samson-Jitesh Sharma

వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలోనూ చోటు దక్కించుకోలేకపోయిన సంజూ శాంసన్, ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లోనూ చోటు సంపాదించుకోలేకపోయాడు. 

click me!