రిషబ్ పంత్‌ని కాదని, జస్ప్రిత్ బుమ్రాకి వైస్ కెప్టెన్సీ... బీసీసీఐ నిర్ణయం వెనక అసలు కారణం అదేనా...

Published : Jan 02, 2022, 04:13 PM IST

సౌతాఫ్రికాతో జరిగే వన్డే సిరీస్‌కి రోహిత్ శర్మ గాయం కారణంగా దూరం కావడంతో కెప్టెన్‌గా కెఎల్ రాహుల్‌కి బాధ్యతలు అప్పగించారు సెలక్టర్లు. అయితే జస్ప్రిత్ బుమ్రాకి వైస్ కెప్టెన్సీ ఇవ్వడం హాట్ టాపిక్ అయ్యింది...

PREV
19
రిషబ్ పంత్‌ని కాదని, జస్ప్రిత్ బుమ్రాకి వైస్ కెప్టెన్సీ... బీసీసీఐ నిర్ణయం వెనక అసలు కారణం అదేనా...

కెఎల్ రాహుల్, ఐపీఎల్‌లో రెండు సీజన్లుగా పంజాబ్ కింగ్స్‌ జట్టుకి కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. కెప్టెన్‌గా జట్టుకి విజయాలు సాధించలేకపోయినా బ్యాట్స్‌మెన్‌గా రాణిస్తున్నాడు...

29

అయితే జస్ప్రిత్ బుమ్రాకి ఎలాంటి కెప్టెన్సీ అనుభవం లేదు. సీనియర్ ఫాస్ట్ బౌలర్‌గా పేస్ విభాగాన్ని నడిపిస్తున్నా, జట్టును కెప్టెన్‌గా నడిపించింది లేదు... దీంతో బుమ్రాకి వైస్ కెప్టెన్సీ ఇవ్వడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి...

39

‘జస్ప్రిత్ బుమ్రాకి వైస్ కెప్టెన్సీ ఇచ్చారని తెలిసి ఆశ్చర్యపోయాను. ఎందుకంటే బుమ్రాకి వైస్ కెప్టెన్సీ దక్కుతుందని నేను ఏ మాత్రం ఊహించలేదు...

49

ఎందుకంటే రిషబ్ పంత్, శ్రేయాస్ అయ్యర్ వంటి ప్లేయర్లు ఉండగా బుమ్రాకి వైస్ కెప్టెన్సీ ఇస్తారని అనుకుంటారా... పంత్‌కి కెప్టెన్‌గా చేసిన అనుభవం కూడా ఉంది...

59

జస్ప్రిత్ బుమ్రాకి భవిష్యత్తులో కెప్టెన్సీ అప్పగించే ఆలోచన బీసీసీఐకి ఉందా? నాకైతే నమ్మకం లేదు...’ అంటూ కామెంట్ చేశాడు భారత మాజీ క్రికెటర్ సబా కరీం...

69

‘బుమ్రాకి వైస్ కెప్టెన్సీ ఇవ్వడానికి ఆస్ట్రేలియా టెస్టు కెప్టెన్‌గా ప్యాట్ కమ్మిన్స్ నియమితుడవ్వడమే కారణమనుకుంటున్నా. బుమ్రా, 2016 నుంచి టీమ్‌లో ప్రధాన ప్లేయర్‌గా మారిపోయాడు...

79

అంతేకాకుండా జస్ప్రిత్ బుమ్రాను వైస్ కెప్టెన్‌గా నియమిస్తే, భవిష్యత్ ఫాస్ట్ బౌలర్లకు ఉత్సాహాన్ని ఇచ్చినట్టు అవుతుందని సెలక్టర్లు ఈ నిర్ణయం తీసుకొని ఉండొచ్చు..

89

నాకు తెలిసి రోహిత్ శర్మ గాయం నుంచి కోలుకున్న తర్వాత ఎలాగూ వైస్ కెప్టెన్‌గా కెఎల్ రాహుల్ బాధ్యతలు తీసుకొంటాడు. 

99

కాబట్టి బుమ్రాకి వైస్ కెప్టెన్సీ ఈ ఒక్క సిరీస్‌కే పరిమితం కావచ్చు...’ అంటూ కామెంట్ చేశాడు బీసీసీఐ మాజీ చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్.

Read more Photos on
click me!

Recommended Stories