ధోనీ వల్లే అశ్విన్, వన్డే ఫార్మాట్‌కి దూరం అయ్యాడు! కారణం అదే... అమిత్ మిశ్రా ఇంట్రెస్టింగ్ కామెంట్స్.

First Published | Sep 21, 2023, 11:10 AM IST

అవసరమైతే 2023 వన్డే వరల్డ్ కప్‌లో రవిచంద్రన్ అశ్విన్‌ని ఆడిస్తామని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కామెంట్ చేశాడు. ప్రపంచ కప్‌కి ముందు ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లోనూ అశ్విన్ ఆడబోతున్నాడు. అసలు అశ్విన్, వన్డే ఫార్మాట్‌కి ఎందుకు దూరం కావాల్సి వచ్చింది..

R Ashwin

2010లో అంతర్జాతీయ వన్డే ఆరంగ్రేటం చేసిన రవిచంద్రన్ అశ్విన్, 2017 వరకూ 111 వన్డేలు ఆడడు. ఆ తర్వాత పూర్తిగా టెస్టులకే పరిమితమైన రవి అశ్విన్, వన్డే, టీ20 ఫార్మాట్‌కి దూరమయ్యాడు. యజ్వేంద్ర చాహాల్, కుల్దీప్ యాదవ్ వైట్ బాల్ క్రికెట్‌‌లో స్పిన్నర్లుగా వ్యవహరిస్తే, అశ్విన్ - జడేజా ద్వయం టెస్టుల్లో రాణించేవాళ్లు..

రవీంద్ర జడేజా, త్రీ ఫార్మాట్ ఆల్‌రౌండర్‌గా వైట్ బాల్ క్రికెట్‌లో కూడా రాణిస్తూ వస్తున్నాడు. 2018 నుంచి 2021 మధ్య నాలుగేళ్లలో ఒక్క వన్డే కూడా ఆడని రవిచంద్రన్ అశ్విన్, 2022లో రెండు వన్డేలు మాత్రమే ఆడాడు.

Latest Videos


అక్షర్ పటేల్ గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోతే అతని స్థానంలో రవిచంద్రన్ అశ్విన్, వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ ఆడడం ఖాయం. ఇప్పటికే అశ్విన్‌తో పాటు వాషింగ్టన్ సుందర్‌ని, 2023 వన్డే వరల్డ్ కప్‌కి రిజర్వు ప్లేయర్‌గా ప్రకటించింది బీసీసీఐ..

‘రవిచంద్రన్ అశ్విన్ ఓ అద్భుతమైన క్వాలిటీ బౌలర్. వికెట్ టేకర్. అదీకాకుండా ఇది టీ20 గేమ్ కాదు, 50 ఓవర్ల గేమ్. కచ్ఛితంగా 10 ఓవర్ల పాటు బౌలింగ్ చేయాలి. 40 ఓవర్ల పాటు ఫీల్డింగ్ చేయాలి. బ్యాటింగ్ కూడా చేయాలి..

అశ్విన్‌కి ఎంతో సుదీర్ఘమైన అనుభవం ఉంది. అతను పక్కనెబట్టడానికి ఫీల్డింగ్ ప్రధాన కారణం. కుర్రాళ్లు, అశ్విన్ కంటే వేగంగా ఫీల్డ్‌లో కదులుతారు. కాబట్టి ధోనీ కెప్టెన్సీలో అశ్విన్ టెస్టు ఫార్మాట్‌కి పరిమితమై, కుర్రాళ్లను వైట్ బాల్ క్రికెట్‌లో ఆడిస్తూ వచ్చారు. అయితే ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లో అశ్విన్ బౌలింగ్‌‌ని టీమిండియా పరిశీలిస్తుంది..

వన్డే ఫార్మాట్‌లో వికెట్లు తీయడానికి ఏం చేయాలో అశ్విన్‌కి బాగా తెలుసు. రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ ఇద్దరు లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్లు. అది కూడా ఈ ఇద్దరూ వైట్ బాల్ క్రికెట్‌లో ఆడడానికి కారణం. లెఫ్ట్ హ్యాండ్- రైట్ హ్యాండ్ కాంబినేషన్ కోసం ఈ ఇద్దరికీ ఎక్కువ అవకాశాలు ఇస్తూ వచ్చింది టీమిండియా..

Washington Sundar

వాషింగ్టన్ సుందర్ కుర్రాడు. అశ్విన్‌కి తుది జట్టులో చోటు దక్కడానికి అతను అనుభవం సరిపోతుంది. అతన్ని ఆడించడానికి మిడిల్ ఆర్డర్‌ని వీక్ చేయాల్సిన పని లేదు. ఎందుకంటే అశ్విన్ బ్యాటింగ్ కూడా చేయగలడు...’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా వెటరన్ స్పిన్నర్ అమిత్ మిశ్రా..

Amit Mishra

టీమిండియా తరుపున 36 వన్డేలు, 8 టీ20 మ్యాచులు, 22 టెస్టులు ఆడిన అమిత్ మిశ్రా... వన్డేల్లో 64, టెస్టుల్లో 76 వికెట్లు తీశాడు. అయితే 2017 తర్వాత మిశ్రాని పూర్తిగా పక్కబెట్టేసింది టీమిండియా. ఇంకా అంతర్జాతీయ క్రికెట్‌కి రిటైర్మెంట్ ఇవ్వని అమిత్ మిశ్రా, ఐపీఎల్, దేశవాళీ టోర్నీలు ఆడుతున్నాడు..

click me!