జో రూట్ పడేశాడు! బెన్ స్టోక్స్ పైకి తెస్తున్నాడు... వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ రేసులోకి ఇంగ్లాండ్...

Published : Dec 13, 2022, 04:29 PM IST

కెప్టెన్‌ని, హెడ్ కోచ్‌ని మారిస్తే టీమ్ రాత మారిపోతుందనే సిద్ధాంతం టీమిండియా విషయంలో పెద్దగా వర్కవుట్ కాలేదు. అయితే ఇంగ్లాండ్ విషయంలో మాత్రం ఇది సూపర్‌గా వర్కవుట్ అయ్యింది. జో రూట్ కెప్టెన్‌గా ఉన్న సమయంలో 12 టెస్టులు ఆడి రెండే రెండు విజయాలతో ఉన్న ఇంగ్లాండ్.. ఇప్పుడు అన్యూహ్యంగా ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ 2021-23 ఫైనల్ రేసులోకి దూసుకొచ్చింది...

PREV
19
జో రూట్ పడేశాడు! బెన్ స్టోక్స్ పైకి తెస్తున్నాడు... వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ రేసులోకి ఇంగ్లాండ్...
england

యాషెస్ సిరీస్‌లో 4-0 తేడాతో ఘోర పరాజయం తర్వాత హెడ్ కోచ్ క్రిస్ సిల్వర్‌వుడ్‌పై వేటు వేసింది ఇంగ్లాండ్. ఆ తర్వాత వెస్టిండీస్ పర్యటనలోనూ టెస్టులు గెలవలేకపోయింది ఇంగ్లాండ్. దీంతో కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు జో రూట్...

29
Image credit: Getty

జో రూట్ స్థానంలో ఇంగ్లాండ్ టెస్టు కెప్టెన్‌గా బాధ్యతలు అందుకున్నాడు ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్. అలాగే సిల్వర్‌వుడ్ స్థానంలో న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ బ్రెండన్ మెక్‌కల్లమ్‌ని హెడ్ కోచ్‌గా నియమించింది ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు. ఈ మార్పు తర్వాత ఇంగ్లాండ్ ఆటతీరు, యాటిట్యూడ్ అన్నీ మారిపోయాయి...

39

జో రూట్ కెప్టెన్సీలో 12 టెస్టులు ఆడి రెండే రెండు విజయాలు అందుకుని, వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ రేసులో కింద నుంచి రెండో స్థానంలో నిలిచిన ఇంగ్లాండ్... బెన్ స్టోక్స్ కెప్టెన్సీలో 9 టెస్టుల్లో 7 విజయాలు అందుకుని ఊహించని విధంగా జైత్ర యాత్ర కొనసాగిస్తోంది...

49
England Win

న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్ గెలిచిన తర్వాత టీమిండియాతో నిర్ణయాత్మక ఆఖరి టెస్టు మ్యాచ్ గెలిసి సిరీస్‌ని 2-2 తేడాతో సమం చేసుకుంది ఇంగ్లాండ్. గత ఏడాది విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో ఇంగ్లాండ్‌కి వెళ్లిన భారత జట్టు నాలుగు టెస్టుల్లో రెండు గెలిచి, ఓ టెస్టులో ఓడింది...

59

వర్షం కారణంగా తొలి టెస్టు మ్యాచ్ ఫలితం తేలకుండానే రద్దయ్యింది కానీ లేదంటే టీమిండియా 3-1 తేడాతో సిరీస్ అప్పుడే సొంతం చేసుకుని ఉండేది. కరోనా కారణంగా ఏడాది వాయిదా పడిన టెస్టులో బెన్ స్టోక్స్ టీమ్, టీమిండియాకి స్టోక్ ఇచ్చింది...
 

69
Ben Stokes Test

సౌతాఫ్రికాలో ‘బజ్ బాల్’ ఫార్ములా పెద్దగా వర్కవుట్ కాలేదు. మూడు టెస్టుల్లో ఒకే విజయంతో సరిపెట్టుకుంది ఇంగ్లాండ్. అయితే తాజాగా పాకిస్తాన్ పర్యటనలో వరుసగా రెండు టెస్టుల్లో ఘన విజయాలు అందుకున్న ఇంగ్లాండ్... పాకిస్తాన్‌ని వెనక్కి నెట్టి టాప్ 5లోకి ఎంట్రీ ఇచ్చింది...

79
Image credit: Getty

అయితే ఇంగ్లాండ్ ఫైనల్ చేరాలంటే అది సులువైన విషయం కాదు. టాప్‌లో ఉన్న ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా వచ్చే నెలలో 3 టెస్టుల సిరీస్ ఆడబోతున్నాయి. టాప్ 3లో ఉన్న శ్రీలంక, న్యూజిలాండ్‌తో రెండు టెస్టుల సిరీస్ ఆడాల్సి ఉంది. 

89

మొట్టమొదటి వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ గెలిచిన న్యూజిలాండ్.. 9 మ్యాచుల్లో రెండే విజయాలు అందుకుంది...  ఫైనల్ రేసులో ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, శ్రీలంక, టీమిండియా నిలిచాయి. 44 శాతం విజయాలతో ఉన్న ఇంగ్లాండ్... టాప్ 4లో ఉన్న జట్లను వెనక్కి నెట్టి పైకి చేరడం అంత తేలిక కాదు...

99

టాప్ 4లో ఉన్న భారత జట్టు... బంగ్లాతో రెండు టెస్టులు, ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టులు గెలిస్తే 68 శాతం విజయాలతో ఉంటుంది. సౌతాఫ్రికా, వెస్టిండీస్‌తో రెండు... ఆస్ట్రేలియాతో మూడు టెస్టులు ఆడనుంది. ఈ మ్యాచుల్లో గెలిస్తే సఫారీ టీమ్... టేబుల్ టాపర్‌గా ఫైనల్ చేరుతుంది. 

click me!

Recommended Stories