దులీప్ ట్రోఫీతో కొత్త బౌలర్ల ఎంట్రీ
ఈ క్రమంలోనే బీసీసీఐ ఏకంగా దులీప్ ట్రోఫీలో 20 మందికి పైగా ఫాస్ట్ బౌలర్లను ఎంపిక చేసింది. వీరిలో అవేశ్ ఖాన్, ఆకాశ్ దీప్, యశ్ దయాల్, తుషార్ దేశ్‌పాండే, ఆదిత్య థాకరే, ఆకాష్ సేన్‌గుప్తా, నవదీప్ సైనీ, మోతీ అవస్తీ, సందీప్ వారియర్, గౌరవ్ యాదవ్ వంటి పలువురు యంగ్ ప్లేయర్లు ఉన్నారు.
ఈ దులీప్ ట్రోఫీలో మంచి ప్రదర్శన కనబరిచే ఫాస్ట్ బౌలర్లు బంగ్లాదేశ్, న్యూజిలాండ్‌లతో జరిగే టెస్టు సిరీస్‌లలో ఆడే అవకాశం ఉందని భావిస్తున్నారు. ప్లేయింగ్ ఎలెవన్‌లో లేనప్పటికీ, భారత జట్టుతో ప్రయాణం కొనసాగించే అవకాశం పొందవచ్చు. ప్రస్తుతం షమీ ఫిట్ నెస్, వయస్సు వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని బీసీసీఐ మరో కొత్త ప్రయోగం దులీప్ ట్రోఫీతో మొదలు పెట్టిందని క్రికెట్ వర్గాలు పేర్కొంటున్నాయి.