మేం ఫైనల్‌దాకా రావడమే చాలా పెద్ద విషయం! మాకంత సీన్ లేదు... - పాక్ మాజీ క్రికెటర్ మహ్మద్ ఆమీర్...

First Published | Nov 14, 2022, 1:09 PM IST

టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో అనుకోకుండా ఫైనల్ చేరిన పాకిస్తాన్, ఇంగ్లాండ్‌ చేతుల్లో 5 వికెట్ల తేడాతో ఓడి రన్నరప్‌తో సరిపెట్టుకుంది. గ్రూప్ స్టేజీలో మొదటి రెండు మ్యాచుల్లో ఓడిన తర్వాత... నెదర్లాండ్స్‌ అందించిన లక్‌తో సెమీస్ బుట్టలో పడిన పాక్... న్యూజిలాండ్‌ని ఓడించి ఫైనల్ చేరింది...

pakistan

పాకిస్తాన్ క్రికెట్ టీమ్‌ను ఎవ్వరూ ట్రోల్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆ టీమ్ మాజీ క్రికెటర్లు ఈ ఛాన్స్ ఎవ్వరికీ ఇవ్వరు. తాజాగా పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ ఆమీర్, పాక్ టీమ్‌ని తీవ్రంగా ట్రోల్ చేశాడు. తమ టీమ్ ఫైనల్ చేరడమే చాలా పెద్ద జోక్ అంటూ అభివర్ణించాడు...

Pakistan Win

‘మనం ఫైనల్ ఆడడమే చాలా పెద్ద విషయం. ఫైనల్ ఆడేందుకు కావాల్సిన అర్హత మనం సాధించామా? మనం ఫైనల్‌కి ఎలా వచ్చామో ప్రపంచం మొత్తానికి తెలుసు. ఏదో దేవుడు కరుణించి, అదృష్టం ఈడ్చి పెట్టి తన్నడంతో ఫైనల్‌కి వచ్చేశాం...


Image credit: Getty

పాకిస్తాన్ బ్యాటింగ్ చూసినప్పుడు ఫైనల్ రిజల్ట్ ఎలా ఉండబోతుందో అందరికీ అర్థమైంది. గ్రూప్ మ్యాచులు ముగిసిన తర్వాత సిడ్నీ నుంచి టీమ్ వచ్చినప్పుడే ఇలా జరుగుతుందని ఊహించా... ఏదో లక్కీగా సెమీ ఫైనల్ గెలిచేశారు...

pakistan

మెల్‌బోర్న్‌లో పిచ్‌పై పాక్ బ్యాటర్లు ఇబ్బందిపడతారని నాకు తెలుసు. మహ్మద్ హారీస్ మంచి ఇంటెంట్ చూపించాడు. అయితే ఇంటెంట్‌తో పాటు కాస్త కామన్ సెన్స్ కూడా ఉండాలి. అదిల్ రషీద్ బౌలింగ్‌లో మొదటి బాల్ ఫేస్ చేస్తున్నప్పుడే షాట్ ఆడాల్సిన అవసరం ఏముంది...

pakistan

పిచ్ గురించి తెలీదు, బౌలర్ల గురించి తెలీదు, వారి బౌలింగ్ స్టైల్ గురించి తెలీదు... తెలిసిందల్లా వచ్చిన బంతిని వచ్చినట్టు గాల్లోకి లేపడమే. ఇలాంటి పిచ్‌లపై ఆడాలంటే గేమ్‌ని రీడ్ చేయడం తెలియాలి. అందుకే బెన్ స్టోక్స్ మ్యాచ్ విన్నర్ అయ్యాడు... ’ అంటూ కామెంట్ చేశాడు పాక్ మాజీ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ ఆమీర్...

టీమిండియాతో మ్యాచ్‌లో ఆఖరి బంతికి ఓడిన పాకిస్తాన్, జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో 130 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించలేక 1 పరుగు తేడాతో ఓడింది. అయితే ఆ తర్వాత నెదర్లాండ్స్, సౌతాఫ్రికా, బంగ్లాదేశ్‌లపై గెలిచిన పాక్... నెదర్లాండ్స్ చేతుల్లో సౌతాఫ్రికా ఓడిపోవడంతో నెట్ రన్ రేట్ కారణంగా లక్కీగా సెమీస్ చేరింది... 

Latest Videos

click me!