సూర్యకుమార్ యాదవ్ ఆడాల్సిన మ్యాచుల్లో ఆడట్లేదు... చిన్న జట్లపైనే అతని ప్రతాపం! - వసీం జాఫర్...

First Published | Nov 14, 2022, 12:15 PM IST

టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో 185+ స్ట్రైయిక్ రేటుతో పరుగులు చేసి, టీమిండియా నుంచి ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ రేసులో నిలిచాడు సూర్యకుమార్ యాదవ్. టోర్నీలో మూడు హాఫ్ సెంచరీలు చేసిన సూర్యకుమార్ యదవ్, విరాట్ కోహ్లీ తర్వాత వరల్డ్ కప్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాట్స్‌మెన్‌గానూ నిలిచాడు...

Suryakumar Yadav

పాకిస్తాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో 10 బంతుల్లో 2 ఫోర్లతో 15 పరుగులు చేశాడు సూర్యకుమార్ యాదవ్. అంతకుముందు టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీలో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌తో పాటు ఆసియా కప్‌లో ఇండియా- పాక్ మధ్య మ్యాచుల్లోనూ సూర్యకుమార్ యాదవ్ పెద్దగా రాణించలేకపోయాడు...

Suryakumar Yadav

నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 25 బంతుల్లో 7 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 51 పరుగులు చేసిన సూర్యకుమార్ యాదవ్, సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో 40 బంతుల్లో 6 ఫోర్లు,3  సిక్సర్లతో 68 పరుగులు చేసి ఒంటరి పోరాటం చేశాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 16 బంతుల్లో 4 ఫోర్లతో 30 పరుగులు చేసి అవుట్ అయ్యాడు సూర్య...

Latest Videos


Suryakumar Yadav

జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో 25 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లతో 61 పరుగులు చేసిన సూర్యకుమార్ యాదవ్, ఇంగ్లాండ్‌తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో 10 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్‌తో 14 పరుగులు చేసి నిరాశపరిచాడు. సూర్య మరికొంత సేపు క్రీజులో ఉండి ఉంటే టీమిండియా స్కోరు, మ్యాచ్ రిజల్ట్ వేరేగా ఉండేది...

Suryakumar Yadav

‘సూర్యకుమార్ యాదవ్ టీమిండియాకి కీ ప్లేయర్. అందులో ఎలాంటి సందేహం లేదు. అయితే కీలక మ్యాచుల్లో అతను సరిగ్గా పర్ఫామెన్స్ ఇవ్వలేకపోతున్నాడు. సౌతాఫ్రికాతో మ్యాచ్‌‌లో బాగా ఆడాడు... కాదనలేం... కానీ పాకిస్తాన్‌తో, ఇంగ్లాండ్‌తో మ్యాచుల్లో సూర్య ఫెయిల్ అయ్యాడు...

Suryakumar Yadav

అతని అవసరం టీమిండియా ఎక్కువగా ఎప్పుడుందో ఆ మ్యాచుల్లోనే పర్ఫామ్ చేయలేకపోయాడు... టీమిండియా, టీ20 వరల్డ్ కప్‌లో సూర్యకుమార్ యాదవ్, విరాట్ కోహ్లీలపైనే ఎక్కువ ఆధారపడింది. రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్, రిషబ్ పంత్ పర్ఫామ్ చేసి ఉంటే రిజల్ట్ వేరేగా ఉండేది...’ అంటూ చెప్పుకొచ్చాడు సూర్యకుమార్ యాదవ్...

Suryakumar Yadav

టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో 6 మ్యాచుల్లో 239 పరుగులు చేసిన సూర్యకుమార్ యాదవ్, 189.68 స్ట్రైయిక్ రేటుతో పరుగులు చేసి... అత్యధిక స్ట్రైయిక్ రేటు కలిగిన బ్యాటర్‌గా నిలిచాడు.

click me!