క్రీజులోకి ఫ్యాన్స్ వస్తుంటే ఏం చేశారు? నా బుక్ లాంఛింగ్ వల్లే కరోనా వచ్చిందా... రవిశాస్త్రి కామెంట్...

First Published Sep 12, 2021, 4:32 PM IST

ఇంగ్లాండ్ పర్యటనలో భారత బృందంలో కరోనా కేసులు వెలుగుచూడడంతో ఒక్కసారిగా ఇరుదేశాల క్రికెట్ ఫ్యాన్స్ అవాక్కయ్యారు. కరోనా కారణంగా ఐదో టెస్టు కూడా రద్దు చేయాల్సి వచ్చింది... 

Ravi Shastri

దీనంతటికీ పరోక్షంగా కారణమైన భారత హెడ్ కోచ్ రవిశాస్త్రి, ఇంగ్లాండ్‌ బోర్డుపై కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశాడు...

నాలుగో టెస్టు మూడో రోజు ఆట ముగిసిన తర్వాత భారత జట్టును తీసుకుని, ఓ ప్రైవేట్ హోటెల్‌లో ఏర్పాటు చేసిన తన బుక్ లాంఛింగ్ ప్రోగ్రామ్‌కి వెళ్లాడు హెడ్ కోచ్ రవిశాస్త్రి...

ఈ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమానికి దాదాపు 160 మంది దాకా అతిథులు వచ్చారు. ఆ మరుసటి రోజు నాలుగో రోజు ఆట ప్రారంభానికి ముందు రవిశాస్త్రికి కరోనా పాజిటివ్ వచ్చింది...

అతనితో క్లోజ్ కాంటాక్ట్ ఉన్న బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, ఫీల్డింగ్ ఆర్ శ్రీధర్‌లతో పాటు ఫిజియోథెరపిస్ట్ కూడా ఐసోలేషన్‌కి వచ్చారు...

ఐదో రోజును ఈ ముగ్గురికి నిర్వహించిన పరీక్షల్లో కూడా పాజిటివ్ వచ్చింది. దీంతో కోచ్, సహాయక సిబ్బంది లేకుండానే నాలుగో టెస్టును ముగించింది భారత జట్టు...

ఐదో టెస్టుకు సిద్ధమవుతున్న సమయంలో అసిస్టెంట్ ఫిజియో యోగేశ్‌కి కూడా పాజిటివ్ రావడంతో భారత ఆటగాళ్లల్లో భయం మొదలై, పాజిటివ్ వస్తే ఐపీఎల్ మిస్ అవుతామనే భయంతో ఏకంగా ఐదో టెస్టు రద్దు దాకా వెళ్లిందీ విషయం...

Ravi Shastri

అయితే రవిశాస్త్రి మాత్రం ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ఏర్పాట్లపైనే విమర్శలు చేయడం విశేషం... ‘ఇంగ్లాండ్ మొత్తంలో ఎలాంటి ఆంక్షలు లేవు, కచ్ఛితంగా మాస్క్ ధరించాలనే నిబంధనలు కూడా లేవు...

క్రీజులోకి ఫ్యాన్స్ దూసుకువస్తుంటే ఏం చేశారు... కేవలం నా బుక్ లాంఛింగ్ ప్రోగ్రామ్ వల్లే కరోనా వచ్చిందా... ఇంత స్వేచ్ఛ ఉన్నప్పుడు వైరస్ ఎలాగైనా సోకి ఉండొచ్చు...’ అంటూ కామెంట్ చేశాడు రవిశాస్త్రి...

ఇండియా, ఇంగ్లాండ్ సిరీస్‌లో జార్వో అనే ప్రేక్షకుడు, ఏకంగా మూడు సార్లు మైదానంలోకి దూసుకొచ్చిన విషయం తెలిసిందే. ఒకే వ్యక్తి, మూడు సార్లు సెక్యూరిటీని దాటుకుని, మైదానంలో అడుగుపెట్టడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది...

click me!