ఐపీఎల్ 2021: జానీ బెయిర్ స్టో స్థానంలో విండీస్ ప్లేయర్‌కి ఛాన్స్... ఫేజ్2లో సన్‌రైజ్ అయ్యేనా...

Published : Sep 12, 2021, 11:16 AM IST

ఐపీఎల్ 2021 సీజన్ ఫేజ్ 2 మరో వారం రోజుల్లో ప్రారంభం కానుంది. ఇప్పటికే దాదాపు ప్లేయర్లందరూ యూఏఈ చేరుకున్నారు... ఇండియా, ఇంగ్లాండ్ మధ్య ఐదో టెస్టును అర్ధాంతరంగా రద్దు చేయడంతో అలిగిన ముగ్గురు ఇంగ్లాండ్ క్రికెటర్లు, ఆఖరి నిమిషంలో ఫేజ్ 2 సీజన్‌ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే...

PREV
110
ఐపీఎల్ 2021: జానీ బెయిర్ స్టో స్థానంలో విండీస్ ప్లేయర్‌కి ఛాన్స్... ఫేజ్2లో సన్‌రైజ్ అయ్యేనా...

సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ జానీ బెయిర్ స్టోతో పాటు ఢిల్లీ క్యాపిటల్స్ ఆల్‌రౌండర్ క్రిస్ వోక్స్, పంజాబ్ కింగ్స్ ప్లేయర్ డేవిడ్ మలాన్... ఐపీఎల్ ఫేజ్ 2 నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు...

210

డేవిడ్ మలాన్, ఫేజ్ 2 నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించిన నిమిషాల వ్యవధిలోనే అతని స్థానంలో సౌతాఫ్రికా ప్లేయర్ ఆడిన్ మార్‌కమ్‌కి అవకాశం కల్పించింది పంజాబ్ కింగ్స్...

310

markram

తాజాగా సన్‌రైజర్స్ హైదరాబాద్ కూడా బెయిర్ స్టోకి రిప్లేస్‌మెంట్‌ను ప్రకటించింది. వెస్టిండీస్ హిట్టర్ షేఫ్రాన్ రూథర్‌ఫర్ట్‌ను బెయిర్ స్టోకి బెయిర్ స్టో స్థానంలో తీసుకొచ్చింది ఆరెంజ్ ఆర్మీ...

410

ఫేజ్ 1లో ఏడు మ్యాచులు ఆడితే, ఆరు మ్యాచుల్లో చిత్తుగా ఓడింది సన్‌రైజర్స్ హైదరాబాద్... ఆరు మ్యాచుల తర్వాత కెప్టెన్‌ని మారిస్తే, ఆ తర్వాతి మ్యాచ్‌లో మరింత ఘోరంగా పరాజయం పాలైంది...

510

David Warner

గత ఆరు సీజన్లుగా సన్‌రైజర్స్ హైదరాబాద్ తరుపున హైయెస్ట్ రన్ గెట్టర్‌గా ఉంటున్న డేవిడ్ వార్నర్‌ను కెప్టెన్సీ నుంచి తొలగించిన ఆరెంజ్ ఆర్మీ, రాజస్థాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అతనికి తుది జట్టులో చోటు కూడా ఇవ్వలేదు...

610

David Warner

కేన్ విలియంసన్ కెప్టెన్సీలో ఆడిన ఆ మ్యాచ్‌లో 60 పరుగుల భారీ తేడాతో ఓడింది సన్‌రైజర్స్. బెయిర్ స్టో, ఫేజ్ 2 నుంచి తప్పుకోవడంతో డేవిడ్ వార్నర్‌కి తుదిజట్టులో చోటు దక్కడం ఖాయంగా మారింది...

710

Jason Roy

అయితే అడ్డదిడ్డంగా ఆలోచించే సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ మేనేజ్‌మెంట్... వార్నర్‌కి కాకుండా, ఇంగ్లాండ్ ఓపెనర్ జాసన్ రాయ్‌కి అవకాశం ఇచ్చినా ఇవ్వొచ్చు...

810

రూథర్‌ఫర్ట్ ఎంపికైనా, అతనికి మిగిలిన ఏడు మ్యాచుల్లో ఓ ఒకటో, రెండో మ్యాచుల్లో మాత్రమే అవకాశం వస్తుందని అంచనా వేస్తున్నారు క్రికెట్ విశ్లేషకులు...

910

ఇప్పటికే ప్లేఆఫ్ రేసు నుంచి తప్పుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్... మిగిలిన ఏడు మ్యాచుల్లో ఏడింట్లో విజయం సాధిస్తేనే, మిగిలిన జట్లతో సంబంధం లేకుండా నాకౌట్ స్టేజ్‌కి చేరుతుంది...

1010

ఈసారి ప్లేఆఫ్ చేరకపోయినా పర్లేదు కానీ మరి ఫేజ్ 1లో చూపించిన ఆటతీరు కంటే బెటర్ పర్ఫామెన్స్ ఇస్తే చాలని కోరుకుంటున్నారు అభిమానులు...

click me!

Recommended Stories