ఐదో టెస్టు ఫలితం తేల్చండి... ఐసీసీకి ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు లేఖ, సిరీస్ డ్రా చేయాలంటూ...

First Published Sep 12, 2021, 2:29 PM IST

కరోనా భయంతో రద్దైన ఐదో టెస్టుపై ఫలితం తేల్చి, సిరీస్‌ ఫలితాన్ని ప్రకటించాల్సిందిగా ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు, ఐసీసీకి లేఖ రాసింది. అయితే ఈ లేఖలో టెస్టు సిరీస్‌ను డ్రాగా ముగిసినట్టు ప్రకటించాల్సిందిగా ఇంగ్లాండ్ డిమాండ్ చేసినట్టు సమాచారం...

మాంచెస్టర్ వేదికగా సెప్టెంబర్ 10న ప్రారంభం కావాల్సిన ఇండియా, ఇంగ్లాండ్ ఐదో టెస్టును రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నాయి ఇరు జట్లు...

మ్యాచ్ ప్రారంభానికి ముందు భారత అసిస్టెంట్ ఫిజియో యోగేశ్ పర్మర్ కరోనా బారిన పడడంతో, కరోనా భయంతో కొందరు టీమిండియా ఆటగాళ్లు మ్యాచ్ ఆడడానికి ఇష్టపడలేదు.

దీంతో భారత క్రికెట్ బోర్డు, ఆటగాళ్ల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని, మ్యాచ్‌ను రద్దు చేయాల్సిందిగా కోరింది. అయితే ఇంగ్లాండ్ ప్లేయర్లు మాత్రం ఐదో టెస్టు ఆడడానికి సిద్ధంగా ఉన్నారు...

కరోనా పరీక్షల్లో నెగిటివ్ వచ్చిన తర్వాత కూడా భారత ఆటగాళ్లు, మ్యాచ్ ఆడడానికి ఇష్టపడకపోవడంతో ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ గెలిచినసిట్టు... భారత్ ‘ఆడలేమంటూ తప్పుకున్నట్టు’ గుర్తించాలని ఐసీసీని లేఖలో కోరింది ఇంగ్లాండ్ బోర్డు...

బీసీసీఐ మాత్రం దీనికి అంగీకరించడం లేదు. సిరీస్‌లో రద్దైన ఆఖరి టెస్టును షెడ్యూల్ చేసి, వచ్చే ఏడాది నిర్వహించాలని... ఆ మ్యాచ్ ఫలితాన్ని బట్టి టెస్టు సిరీస్‌ ఫలితం డిసైడ్ అవుతుందని వాదిస్తోంది...

ఐసీసీ మాత్రం ఇంకా ఈ టెస్టు మ్యాచ్‌పై ఎలాంటి నిర్ణయం ప్రకటించలేదు. ఒకవేళ ఐసీసీ, ఈసీబీ డిమాండ్‌కి తలొగ్గితే... భారత ఆటగాళ్లు ఆడడానికి ఇష్టపడని కారణంగా టెస్టు సిరీస్‌ 2-2 తేడాతో డ్రాగా ముగిసినట్టు ప్రకటించే అవకాశం ఉంది...

భారత ఆటగాళ్లు అర్ధాంతరంగా ఐదో టెస్టు రద్దు చేసుకుని, వెళ్లడంతో... ముగ్గురు ఇంగ్లాండ్ ఆటగాళ్లు జానీ బెయిర్ స్టో, డేవిడ్ మలాన్, క్రిస్ వోక్స్... ఐపీఎల్ 2021 ఫేజ్ 2 నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే...

click me!