భారత క్రికెట్ బోర్డు (బీసీసీఐ)లో జరుగుతున్న పరిణామాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. బీసీసీఐ నుంచి ఐసీసీకి వెళ్లి అక్కడ చక్రం తిప్పుదామనుకున్న సౌరవ్ గంగూలీకి ఊహించని విధంగా చెక్ పడింది. ప్రపంచమంతా కరోనా విలయతాండవం చేస్తున్న సమయంలోనూ ఐపీఎల్ 2020 నిర్వహించి, ‘శభాష్’ అనిపించుకున్న దాదాకి రాజకీయ దురంధరులు చెక్ మేట్ పెట్టేశారని టాక్ వినబడుతోంది. బీసీసీఐ తర్వాత బాస్‌గా భారత మాజీ క్రికెటర్ రోజర్ బిన్నీ బాధ్యతలు తీసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఇంతకీ ఎవరీ రోజర్ బిన్నీ...
67 ఏళ్ల భారత మాజీ క్రికెటర్ రోజర్ బిన్నీ, బీసీసీఐ అధ్యక్ష పదవి కోసం నామినేషన్ దాఖలు చేశాడు. ఇంతవరకూ మరో అభ్యర్థి ఎవరూ నామినేషన్ వేయకపోవడంతో ఎలాంటి హై డ్రామా జరగకపోతే అక్టోబర్ 18న రోజర్ బిన్నీని ఏకగ్రీవంగా బీసీసీఐ బాస్‌గా ప్రకటించడం ఖాయంగా కనబడుతోంది...
27
1983 World Cup: Roger Binny (India) — 18 wickets (8 matches)
టీమిండియా మాజీ ఫాస్ట్ బౌలింగ్ ఆల్‌రౌండర్ రోజర్ బిన్నీ పూర్తి పేరు రోజర్ మైఖేల్ హంపెరీ బిన్నీ. కపిల్ దేవ్ కెప్టెన్సీలో 1983 వన్డే వరల్డ్ కప్ గెలిచిన జట్టులో కీలక సభ్యుడిగా ఉన్నాడు రోజర్ బిన్నీ. 1979లో పాకిస్తాన్‌పై అంతర్జాతీయ ఆరంగ్రేటం చేసిన రోజర్ బిన్నీ, 1987లో ఆస్ట్రేలియాపై ఆఖరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు...
37
Roger Binny
తన కెరీర్‌లో 27 టెస్టులు ఆడిన రోజర్ బిన్నీ, 23.06 సగటులో 830 పరుగులు చేశాడు. ఇందులో 5 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అలాగే 47 వికెట్లు పడగొట్టాడు. 72 వన్డేల్లో 629 పరుగులు చేసిన రోజర్ బిన్నీ, 77 వికెట్లు తీశాడు.
47
1983 వన్డే వరల్డ్ కప్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో 32 బంతుల్లో 2 ఫోర్లతో 21 పరుగులు చేసి రనౌట్ అయిన రోజర్ బిన్నీ, బౌలింగ్‌లో 8 ఓవర్లలో 2 మెయిడిన్లతో 29 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు తీసి టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. రోజర్ బిన్నీ సెన్సేషనల్ స్పెల్ కారణంగా 248 పరుగుల లక్ష్యఛేదనతో బరిలో దిగిన ఆస్ట్రేలియా 129 పరుగులకి ఆలౌట్ అయ్యింది...
57
Roger Binny
1983 వన్డే వరల్డ్ కప్‌లో 8 మ్యాచులు ఆడి 18 వికెట్లు తీసిన రోజర్ బిన్నీ, ఆ టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. అలాగే 1985లో ఆస్ట్రేలియాలో జరిగిన వరల్డ్ సిరీస్ క్రికెట్ ఛాంపియన్‌లో 17 వికెట్లు తీసిన రోజర్ బిన్నీ, ఇంతకుముందు సీనియర్ సెలక్షన్ కమిటీలో సభ్యుడిగా పని చేశాడు...
67
రోజర్ బిన్నీ కొడుకు స్టువర్ట్ బిన్నీ కూడా టీమిండియాకి ఆడాడు. అయితే సెలక్షన్ కమిటీలో సభ్యుడిగా ఉన్న సమయంలో స్టువర్ట్ బిన్నీ సెలక్షన్ గురించి చర్చ వస్తే, దానికి రోజర్ బిన్నీ దూరంగా ఉండేవాడు. తన కొడుకు కావడం వల్ల స్టువర్ట్ బిన్నీకి అవకాశం రాకూడదని రోజర్ బిన్నీ భావించేవాడు...
77
Roger Binny
ఇప్పటిదాకా వివాదాలకు దూరంగా ఉంటూ క్లీన్ ఇమేజ్ తెచ్చుకున్న రోజర్ బిన్నీ, కర్ణాటక నుంచి టీమిండియాకి ప్రాతినిధ్యం వహించాడు. 2004లో సౌరవ్ గంగూలీని టీమిండియా కెప్టెన్సీ నుంచి తప్పించిన సమయంలో కర్ణాటకకి చెందిన రాహుల్ ద్రావిడ్ ఆ బాధ్యతలు తీసుకున్నాడు. ఇప్పుడు బీసీసీఐ బాస్ దాదా ప్లేస్‌లో, మరోసారి కర్ణాటకకి చెందిన క్రికెటర్‌కి (మాజీ) ఆ బాధ్యతలు తీసుకోబోతుండడం విశేషం...