రోహిత్ టీమ్‌లో ఉండగా రాహుల్‌కి కెప్టెన్సీ! టీ20 వరల్డ్ కప్ తర్వాత హిట్ మ్యాన్ రిటైర్ అవుతాడా?...

Published : Oct 13, 2022, 12:12 PM IST

టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీకి ముందు వెస్ట్రరన్ ఆస్ట్రేలియాతో రెండో వార్మప్ మ్యాచ్ ఆడుతోంది భారత జట్టు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. అయితే ఈ వార్మప్ మ్యాచ్‌ ఆడుతున్న టీమ్‌లో రోహిత్ శర్మ ఉన్నప్పటికీ కెఎల్ రాహుల్‌ని కెప్టెన్‌గా ఎంచుకోవడం హాట్ టాపిక్ అయ్యింది...

PREV
18
రోహిత్ టీమ్‌లో ఉండగా రాహుల్‌కి కెప్టెన్సీ! టీ20 వరల్డ్ కప్ తర్వాత హిట్ మ్యాన్ రిటైర్ అవుతాడా?...
Rohit-Rahul

వెస్ట్రరన్ ఆస్ట్రేలియాతో జరిగిన మొదటి వార్మప్ మ్యాచ్‌లో ఆడని విరాట్ కోహ్లీ, రెండో మ్యాచ్‌లోనూ ఆడడం లేదు. రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్ ఓపెనర్లుగా వ్యవహరించబోతుంటే దీపక్ హుడా, రిషబ్ పంత్, హార్ధిక్ పాండ్యా, దినేశ్ కార్తీక్, అక్షర్ పటేల్, హర్షల్, అశ్విన్, భువీ, అర్ష్‌దీప్‌లకు ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కింది...

28

సూర్యకుమార్ యాదవ్, విరాట్ కోహ్లీ, యజ్వేంద్ర చాహాల్ కూడా ఆడాలనుకుంటే ఆడొచ్చు. అయితే ఈ టీమ్‌కి కెప్టెన్‌గా కెఎల్ రాహుల్‌ని ప్రకటించింది టీమిండియా మేనేజ్‌మెంట్. అంటే కెప్టెన్ రోహిత్ శర్మ జట్టులో ఉన్నా కెఎల్ రాహుల్ టీమిండియాని నడిపించబోతున్నాడు...

38

ఇది పలు అనుమానాలకు తావిస్తోంది. కొందరు రోహిత్ శర్మ ఎక్కువసేపు క్రీజులో ఉండడం కష్టం కాబట్టి కెఎల్ రాహుల్‌ని కెప్టెన్‌గా నియమించి ఉండవచ్చని, కీలక మ్యాచులకు ముందు స్టెయిన్ అవ్వడం ఎందుకుని హిట్ మ్యాన్ భావించి ఉంటాడని అంటున్నారు...

48
rohit sharma

మరికొందరైతే టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీ తర్వాత రోహిత్ శర్మ టీమిండియా కెప్టెన్సీ నుంచి తప్పుకుంటాడేమోననే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 2021 టీ20 వరల్డ్ కప్ తర్వాత విరాట్ కోహ్లీ, టీమిండియా కెప్టెన్సీ నుంచి తప్పుకున్నారు. అయితే రోహిత్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన ఏడాదిలో భారత జట్టుకి 8 మంది కెప్టెన్లు మారారు...

58
Image credit: PTI

ఫిట్‌నెస్ సమస్యలు, బిజీ షెడ్యూల్... కారణం ఏదైనా రోహిత్ శర్మ టీమిండియా ఆడే అన్ని మ్యాచులకు అందుబాటులో ఉండలేకపోతున్నాడు. దీంతో ఏదో ఒక ఫార్మాట్‌లో కెప్టెన్‌గా కంటిన్యూ అవుతూ, మిగిలిన రెండు ఫార్మాట్ల కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని రోహిత్ శర్మ భావిస్తున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి...

68
Image credit: PTI

టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీ తర్వాత టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకుని, 2023 వన్డే వరల్డ్ కప్‌లో భారత జట్టుకి సారథిగా వ్యవహరించిన తర్వాత పూర్తిగా అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకోవాలని రోహిత్ శర్మ భావిస్తున్నాడని.. అందుకే కెఎల్ రాహుల్‌కి ప్రాక్టీస్ మ్యాచుల్లో కెప్టెన్సీ అవకాశం ఇస్తున్నాడని వార్తలు వైరల్ అవుతున్నాయి..

78
Rohit Sharma


36 ఏళ్ల రోహిత్ శర్మ, చాలా లేటు వయసులో టీమిండియా కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్నాడు. ద్వైపాక్షిక సిరీసుల్లో తిరుగులేని విజయాలు అందుకున్న రోహిత్, ఆసియా కప్ 2022 టోర్నీలో సారథిగా జట్టును ఫైనల్ చేర్చడంలో ఫెయిల్ అయ్యాడు. కెప్టెన్సీ తీసుకున్న తర్వాత రోహిత్ బ్యాటుతోనూ పెద్దగా రాణించలేక విమర్శలు ఎదుర్కొంటున్నాడు... 

88
Image credit: PTI

ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ సారథగా ఐదు టైటిల్స్ గెలిచిన రోహిత్ శర్మ, టీమిండియా సారథిగా మారిన తర్వాత కుర్రాళ్లపై ఆగ్రహాన్ని చూపిస్తున్నాడని, వాళ్ల అభిప్రాయాలను గౌరవించడం లేదని ట్రోల్స్ వచ్చాయి. ఈ ట్రోల్స్‌కి నొచ్చుకున్న రోహిత్, కెరీర్ చివర్లో ఇలాంటి విమర్శలు ఎదుర్కోవడం ఇష్టం లేక కెప్టెన్సీ నుంచి వైదొలగాలని భావిస్తున్నాడని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.

Read more Photos on
click me!

Recommended Stories