ఆర్‌సీబీ కెప్టెన్‌గా డేవిడ్ వార్నర్... విరాట్ కోహ్లీ నిర్ణయంతో కొత్త కెప్టెన్ వేటలో రాయల్ ఛాలెంజర్స్...

Published : Sep 20, 2021, 05:46 PM IST

టీ20 వరల్డ్‌కప్‌ 2021 తర్వాత టీ20 ఫార్మాట్‌ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించిన ఆర్‌సీబీ కెప్టెన్‌గా కూడా ఇదే ఆఖరి సీజన్ అంటూ సంచలన ప్రకటన చేశాడు... దీంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తర్వాతి కెప్టెన్ ఎవరంటూ చర్చ మొదలైంది...

PREV
111
ఆర్‌సీబీ కెప్టెన్‌గా డేవిడ్ వార్నర్... విరాట్ కోహ్లీ నిర్ణయంతో కొత్త కెప్టెన్ వేటలో రాయల్ ఛాలెంజర్స్...

విరాట్ కోహ్లీ లేకపోతే ఆర్‌సీబీ కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వహించేవాడు ‘మిస్టర్ 360’ ఏబీ డివిల్లియర్స్. అయితే అంతర్జాతీయ క్రికెట్‌కి ఇప్పటికే రిటైర్మెంట్ ప్రకటించిన ఏబీడీకి ఇదే ఆఖరి ఐపీఎల్ సీజన్...

211

ఇప్పటికే వచ్చే ఏడాది ఐపీఎల్‌లో పాల్గొనబోనని, అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించాడు ఏబీ డివిల్లియర్స్... దీంతో ఏబీడీ, ఆర్‌సీబీ కెప్టెన్సీ రేసులో లేడు...

311

ముంబై ఇండియన్స్‌, చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్ జట్లలో ఉన్నట్టుగా విరాట్ కోహ్లీ, ఏబీ డివిల్లియర్స్ తర్వాత జట్టు భారాన్ని మోయగల సత్తా ఉన్న బ్యాట్స్‌మెన్ ఎవ్వరూ లేరు... 

411

పంజాబ్ కింగ్స్ నుంచి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి వచ్చిన గ్లెన్ మ్యాక్స్‌వెల్‌ ఉన్నా... అతను ఎప్పుడు, ఎలా ఆడతాడో చెప్పడం చాలా కష్టం. నిలకడగా పర్ఫామెన్స్ ఇవ్వలేని ప్లేయర్‌కి కెప్టెన్సీ అప్పగించే సాహసం ఆర్‌సీబీ చేయకపోవచ్చు...

511

ప్రస్తుతం ఆర్‌సీబీ తర్వాతి కెప్టెన్‌గా వినిపిస్తున్న పేరు డేవిడ్ వార్నర్. సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్‌గా డేవిడ్ వార్నర్‌కి ఘనమైన రికార్డు ఉంది...

611

ఎస్‌ఆర్‌హెచ్‌లో సరైన మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ లేకపోయినా, అన్నీ తానై సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను 2016 సీజన్‌లో ఛాంపియన్‌గా నిలిపాడు డేవిడ్ వార్నర్...

711

ఐపీఎల్ 2021 సీజన్ ఫస్టాఫ్‌లో ఆరు మ్యాచుల్లో ఐదింట్లో ఓడింది సన్‌రైజర్స్. డేవిడ్ వార్నర్ బ్యాటింగ్‌తో రాణించినా, మిడిల్ ఆర్డర్ ఫెయిల్ అవ్వడంతో గెలవాల్సిన మ్యాచుల్లో కూడా చిత్తుగా ఓడింది...

811

ఈ పరాజయాలతో డేవిడ్ వార్నర్‌ను కెప్టెన్సీ నుంచి తొలగించిన సన్‌రైజర్స్ హైదరాబాద్, ఆ తర్వాతి మ్యాచ్‌లో అతనికి తుదిజట్టులో కూడా చోటు ఇవ్వలేదు...

911

ఐపీఎల్ 2022 వేలానికి డేవిడ్ వార్నర్‌ను విడుదల చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని క్రికెట్ విశ్లేషకుల అంచనా. దీంతో అతన్ని ఎంత ఖర్చు చేసి, అయినా కొనుగోలు చేయాలని చూస్తోంది ఆర్‌సీబీ...

1011

డేవిడ్ వార్నర్ ఓ బ్యాట్స్‌మెన్‌గా, ఓ కెప్టెన్‌గా ఎంత విలువైన ఆటగాడో సన్‌రైజర్స్ గుర్తించకపోయినా... ఆరెంజ్ ఆర్మీ ఆటతీరు చూసినవారికి క్లియర్‌గా అర్థమవుతుంది...

1111

డెడికేషన్ విషయంలో డేవిడ్ వార్నర్‌కి ఏ క్రికెటర్ కూడా సాటిరాడు... అందుకే వార్నర్ భాయ్‌కి రాయల్ ఛాలెంజర్స్‌లోకి తీసుకురావాలని విరాట్ కోహ్లీ కూడా భావిస్తున్నారట. కోహ్లీతో, గ్లెన్ మ్యాక్స్‌వెల్‌తో డేవిడ్ వార్నర్‌కి ఉన్న అనుబంధం కూడా ఆర్‌సీబీని నడిపించడానికి ఉపయోగపడుతుందని అంచనా వేస్తున్నారు క్రికెట్ ఫ్యాన్స్..

click me!

Recommended Stories