టీ20 వరల్డ్‌కప్ ఫైనల్ ముగిసిన 3 రోజులకే న్యూజిలాండ్‌తో మ్యాచ్... స్వదేశీ షెడ్యూల్ విడుదల చేసిన బీసీసీఐ...

First Published Sep 20, 2021, 5:12 PM IST

ఐపీఎల్ సెకండ్ ఫేజ్ కోసం యూఏఈ చేరిన భారత ఆటగాళ్లు, ఆ తర్వాత అక్కడే టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీ ఆడనున్నారు. ఆ తర్వాత న్యూజిలాండ్ సిరీస్, సౌతాఫ్రికా టూర్, వెస్టిండీస్, శ్రీలంకలతో వరుసగా సిరీస్‌లు ఆడనుంది భారత జట్టు...

నవంబర్ నుంచి వచ్చే ఏడాది జూన్ వరకూ స్వదేశంలో భారత జట్టు ఆడబోయే మ్యాచ్‌లకు సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను విడుదల చేసింది బీసీసీఐ...

నవంబర్ 14న టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీ ఫైనల్ మ్యాచ్ జరుగుతుంటే, ఆ తర్వాత మూడు రోజులకే న్యూజిలాండ్‌తో మొదటి టీ20 మ్యాచ్ ఆడనుంది టీమిండియా...

Latest Videos


నవంబర్ 14న జరిగే ఫైనల్‌కి భారత్, న్యూజిలాండ్‌లలో ఏ జట్టు అర్హత సాధించినా... ఆ మ్యాచ్ ఆడిన మూడు రోజులకే ఇండియాకి తిరిగి వచ్చి... మ్యాచ్ ఆడడమంటే మామూలు విషయం కాదు... ప్రయాణం, కరోనా టెస్టులు, మ్యాచ్ ప్రాక్టీస్... ఇలా సరైన విశ్రాంతి లేకుండా బిజీబిజీగా గడపాల్సి ఉంటుంది...

నవంబర్ 17న జైపూర్‌లో తొలి టీ20 మ్యాచ్ ఆడే ఇండియా, న్యూజిలాండ్ జట్లు, ఆ తర్వాత 19న రాంఛీ, 21న కోల్‌కత్తాలో రెండో, మూడో టీ20 మ్యాచులు ఆడతాయి...

ఆ తర్వాత నవంబర్ 25న కాన్పూర్‌లో భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య తొలి టెస్టు జరుగుతుంది. ఆ తర్వాత డిసెంబర్ 3న ముంబైలో రెండో టెస్టు జరుగుతుంది...

న్యూజిలాండ్‌తో సిరీస్ ముగిసిన తర్వాత సౌతాఫ్రికా టూర్‌కి బయలుదేరుతుంది టీమిండియా. ఈ టూర్‌లో టీమిండియా మూడు టెస్టులు, మూడు వన్డేలు, నాలుగు టీ20 మ్యాచులు ఆడుతుంది...

సౌతాఫ్రికా టూర్‌ ముగించుకుని స్వదేశానికి చేరుకునే భారత జట్టు... వెస్టిండీస్‌తో కలిసి మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచులు ఆడుతుంది...

ఫిబ్రవరి 6న అహ్మదాబాద్‌లో మొదటి వన్డే, 9న జైపూర్‌లో రెండో వన్డే, 12న కోల్‌కత్తాలో మూడో వన్డే జరుగుతాయి... ఆ తర్వాత ఫిబ్రవరి 15న కటక్‌లో మొదటి టీ20 జరుగుతుంది...

ఫిబ్రవరి 18న వైజాగ్‌లో ఇండియా, వెస్టిండీస్ మధ్య రెండో టీ20, ఆ తర్వాత 20న త్రివేండ్రంలో మూడో టీ20 మ్యాచ్ జరుగుతాయి..

వెస్టిండీస్‌తో సిరీస్ ముగిసిన ఐదు రోజుల తర్వాత శ్రీలంకతో రెండు టెస్టులు, మూడు టీ20 మ్యాచులు ఆడుతుంది భారత జట్టు. బెంగళూరు వేదికగా ఫిబ్రవరి 25న తొలి టెస్టు జరుగుతుంది...

మార్చి 5న మొహాలీ వేదికగా విండీస్, భారత్ మధ్య రెండో టెస్టు జరుగుతుంది. ఆ తర్వాత మార్చి 13న మొహాలీలో తొలి టీ20, 15న ధర్మశాలలో రెండో టీ20, లక్నోలో మార్చి 18న మూడో టీ20 జరుగుతాయి...

శ్రీలంక సిరీస్ ముగిసిన తర్వాత షెడ్యూల్ ప్రకారం ఐపీఎల్ 2022 సీజన్ ఆరంభమవుతుంది... ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022 సీజన్ ముగిసిన తర్వాత సౌతాఫ్రికాతో స్వదేశంలో ఐదు టీ20 మ్యాచులు ఆడుతుంది భారత జట్టు...

జూన్ 9న చెన్నైలో తొలి టీ20, 12న బెంగళూరులో రెండో టీ20, 14న నాగ్‌పూర్‌లో, 17న రాజ్‌కోట‌్‌లో, 19న ఢిల్లీలో వరుసగా టీ20 మ్యాచులు జరుగుతాయి...

సౌతాఫ్రికాతో సిరీస్ ముగిసిన తర్వాత ఇంగ్లాండ్ టూర్‌కి వెళ్తుంది భారత జట్టు. ఈ టూర్‌లో టీమిండియా మూడు టీ20 మ్యాచులు, మూడు వన్డేలు ఆడాల్సి ఉంది. అయితే ఐదో టెస్టు రద్దు కావడంతో ఓ టెస్టు, మరో రెండు టీ20 మ్యాచులు ఆడేందుకు అంగీకరించింది భారత జట్టు...

click me!