డెసిషన్ కరెక్టే, కానీ టైమింగ్ కరెక్టు కాదు... విరాట్ కోహ్లీ కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంపై గౌతమ్ గంభీర్...

First Published Sep 20, 2021, 4:41 PM IST

టీ20 ఫార్మాట్‌లో కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్టు సంచలన ప్రకటన చేసిన విరాట్ కోహ్లీ, ఆ తర్వాత మూడు రోజులకే ఆర్‌సీబీ కెప్టెన్సీ బాధ్యతల నుంచి వైదొలుతున్నట్టు చెప్పి, ఫ్యాన్స్‌ని ఆశ్చర్యానికి గురి చేశాడు... విరాట్ కెప్టెన్సీని ఎన్నో ఏళ్లుగా ప్రశ్నిస్తున్న గౌతమ్ గంభీర్, తాజాగా కోహ్లీ నిర్ణయంపై స్పందించాడు...

‘విరాట్ కోహ్లీ తీసుకున్న నిర్ణయం సరైనదే, కానీ ప్రకటించిన సమయం ఏ మాత్రం కరెక్ట్ కాదు. ఐపీఎల్ ఫేజ్ 2 ఆరంభానికి ముందు ఈ నిర్ణయం ప్రకటించడం జట్టు పర్ఫామెన్స్‌పై ప్రభావం చూపుతుంది...

విరాట్ కోహ్లీకి కెప్టెన్‌గా ఆఖరి సీజన్ అనే భావన, మిగిలిన ప్లేయర్లలో ఉంటుంది. ఎలాగైనా బెటర్ పర్ఫామెన్స్ ఇచ్చి, టైటిల్ గెలవాలనే ఒత్తిడి పెరుగుతుంది. ఇది వారి నేచురల్ ఆటతీరుని దెబ్బతీస్తుంది...

విరాట్ కోహ్లీకి కెప్టెన్‌గా ఆఖరి సీజన్ అనే భావన, మిగిలిన ప్లేయర్లలో ఉంటుంది. ఎలాగైనా బెటర్ పర్ఫామెన్స్ ఇచ్చి, టైటిల్ గెలవాలనే ఒత్తిడి పెరుగుతుంది. ఇది వారి నేచురల్ ఆటతీరుని దెబ్బతీస్తుంది...

నిజంగా కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని నిర్ణయం తీసుకున్నాక, దాన్ని ఈ సీజన్ అయిపోయిన తర్వాత చెప్పొచ్చు కదా.. ముందే చెప్పడం ఎందుకు. కెప్టెన్సీ నుంచి తప్పుకోవడం అతని వ్యక్తిగత విషయం...’ అంటూ కామెంట్ చేశాడు గౌతమ్ గంభీర్...

ఐపీఎల్ 2020 సీజన్‌లో మొదటి 9 మ్యాచుల్లో ఏడు విజయాలు అందుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ప్లేఆఫ్స్‌కి అర్హత సాధించింది... అయితే మొదటి ఎలిమినేటర్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ చేతుల్లో చిత్తుగా ఓడింది ఆర్‌సీబీ...

ఆ సమయంలో విరాట్ కోహ్లీపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశాడు గౌతమ్ గంభీర్... ‘8 ఏళ్లుగా ఒక్క టైటిల్ గెలవలేదంటే... అతని కెప్టెన్సీలో ఏదో లోపాలున్నట్టే...

టైటిల్ గెలవడానికి విరాట్ కోహ్లీకి ఇంకెన్ని సీజన్లు కావాలి? వేరే ఫ్రాంఛైజీ అయితే ఇప్పటికే కెప్టెన్‌ని మార్చేసి ఉండేది. విరాట్ కోహ్లీ వంటి స్టార్ ప్లేయర్ కాబట్టి ఆర్‌సీబీ అలా చేయడం లేదు...’ అంటూ కామెంట్ చేశాడు గంభీర్..

2013లో కేకేఆర్, రాయల్ ఛాలెంజర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ, గంభీర్ మధ్య గొడవైంది. విరాట్ కోహ్లీ అవుటైన తర్వాత గంభీర్ ఏదో అనడం, ఇద్దరి మధ్య మాటామాటి పెరిగి మైదానంలోనే కొట్టుకోవడానికి ముందుకు రావడం తీవ్ర దుమారం రేగింది. అప్పటినుంచి ఈ ఇద్దరి మధ్య వైరం పెరుగుతూ వచ్చింది

click me!