ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ కెప్టెన్ నజ్ముల్ శాంటో టాస్ గెలిచి టీమిండియాను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ఇంగ్లండ్ సిరీస్ తర్వాత తొలిసారి టెస్టు మ్యాచ్ ఆడుతున్న భారత జట్టు టాప్ ఆర్డర్ నుంచి అభిమానులు ఆశించిన ప్రదర్శన రాలేదు. అద్భుతంగా బ్యాటింగ్ చేసే సత్తా ఉన్న రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శుభ్‌మన్ గిల్‌లు అభిమానులను తీవ్రంగా నిరాశపరిచి చెత్తగా షాట్స్ తో పెవిలియన్‌కు చేరారు. బంగ్లాదేశ్‌కు చెందిన 24 ఏళ్ల బౌలర్ భారత టాప్ ఆర్డర్‌ను దెబ్బకొట్టి భారత్ కు బిగ్ షాకిచ్చాడు.
తొలుత బ్యాటింగ్‌కు వచ్చిన భారత ఓపెనర్లు యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మల నుంచి ఆశించిన భాగస్వామ్యం రాలేదు. 24 ఏళ్ల ఫాస్ట్ బౌలర్ హసన్ మహమూద్ ఇన్నింగ్స్ ఆరో ఓవర్లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ (6 పరుగులు)ను అవుట్ చేసి భారత జట్టుకు తొలి షాక్ ఇచ్చాడు.
ఇక్కడితో ఆగలేదు ఈ యంగ్ బౌలర్. ఒక్క పరుగు కూడా చేయకముందే శుభమన్ గిల్‌ను అద్భుతమైన బౌలింగ్ తో పెవిలియన్ కు పంపాడు హసన్ మహమూద్. దీని తర్వాత రన్ మిషన్ విరాట్ కోహ్లీ (6 పరుగులు) కూడా అతని వలలోనే చిక్కుకుని ఔటయ్యాడు. ఈ విధంగా హసన్ మహమూద్ భారత టాప్ ఆర్డర్ త్రయాన్ని కుప్పకూల్చాడు.