బంగ్లాదేశ్ కు సూపర్ ఆరంభం-కాసేపు అడ్డుపడ్డ జైస్వాల్-పంత్
తొలిరోజు మొదటి సెషన్‌లో ఆతిథ్య జట్టు అద్భుతమైన ఆరంభంతో అదరగొట్టింది. స్టార్ ప్లేయర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, శుభ్ మన్ గిల్, రిషబ్ పంత్ లను పెద్ద పరుగులు చేయకుండా అడ్డుకుంది. గిల్ 0, రోహిత్ శర్మ 6, విరాట్ కోహ్లీ 6 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ కు చేరారు. ఆ తర్వాత యంగ్ ప్లేయర్ యశస్వి జైస్వాల్-రిషబ్ పంత్ లు భారత ఇన్నింగ్స్ ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు.
ఈ క్రమంలోనే జైస్వాల్ 56 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. రిషబ్ పంత్ 39 పరుగులకు ఔట్ అయ్యాడు. ఆ తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన కేఎల్ రాహుల్ 16 పరుగులకే పెవిలియన్ చేరాడు. దీంతో భారత్ కష్టాలు మరింత పెరిగాయి. ఈ సమయంలో భారత స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్-రవీంద్ర జడేజాలు అద్భుత బ్యాటింగ్ తో భారత్ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు.