ఇండియాని ఎవరు ఓడిస్తే, వారిదే వరల్డ్ కప్... పాక్ మాజీ కెప్టెన్ కామెంట్స్...

First Published | Sep 28, 2023, 1:30 PM IST

వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో హాట్ ఫెవరెట్‌గా బరిలో దిగుతోంది భారత జట్టు. ఆసియా కప్ 2023 టైటిల్ విజేతగా నిలిచిన టీమిండియా, ఆస్ట్రేలియాపై వన్డే సిరీస్ కూడా గెలిచింది. దీంతో టీమిండియాని ఎవరు ఓడిస్తే, వారిదే వరల్డ్ కప్ అంటున్నారు ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాగన్, పాక్ మాజీ కెప్టెన్ సల్మాన్ భట్..
 

‘ఓ ఘోర పరాజయం తర్వాత ఊహించిన విధంగా కమ్‌బ్యాక్ ఇవ్వగల టీమ్ భారత్ మాత్రమే. వారి కసి ముందు ఏ టాప్ క్లాస్ టీమ్ కూడా నిలవలేదు.. ఈ వరల్డ్ కప్‌లో సెమీస్ చేరే నాలుగు జట్ల గురించి చర్చ జరుగుతోంది.

నా దృష్టిలో ఇండియాని ఏ టీమ్ అయితే ఓడిస్తుందో, అదే జట్టు వరల్డ్ కప్ విజేతగా నిలుస్తుంది. ఇండియా బెస్ట్ టీమ్‌. వాళ్ల బ్యాటింగ్, బౌలింగ్ అన్నీ పక్కగా కుదిరాయి. ఇప్పుడు ఇండియా స్వతహాగా తప్పులు చేస్తే తప్ప, ఓడిపోవడం చాలా కష్టం..
 


ప్రస్తుతం ఏ టీమ్ కూడా భారత్‌కి పోటీ రాలేదు. ఎందుకంటే స్వదేశంలో ఎలా గెలవాలో వారికి బాగా తెలుసు. వేల మంది సపోర్టర్ల మధ్య మ్యాచులు ఆడబోతుండడం వారికి అదనపు అడ్వాంటేజ్..
 


టీమిండియా ప్లేయర్ల ఫిట్‌నెస్ లెవెల్స్ కూడా చాలా పెరిగాయి. 15 ఏళ్ల క్రితం వాళ్ల ఫిట్‌నెస్ కానీ, ఫీల్డింగ్ కానీ ఈ విధంగా లేదు.ఇప్పుడు టాప్ టీమ్‌గా ఉండేందుకు ఏమేం కావాలో అన్నీ ఇండియా దగ్గర ఉన్నాయి..’ అంటూ కామెంట్ చేశాడు పాక్ మాజీ కెప్టెన్ సల్మాన్ భట్..

వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో భాగంగా భారత జట్టు, ఇంగ్లాండ్, నెదర్లాండ్స్‌తో వార్మప్ మ్యాచులు ఆడుతుంది. ఆ తర్వాత అక్టోబర్ 8న ఆస్ట్రేలియాతో, అక్టోబర్ 11న ఆఫ్ఘాన్‌తో, అక్టోబర్ 14న పాకిస్తాన్‌తో మ్యాచులు ఆడుతుంది టీమిండియా..

ఆ తర్వాత న్యూజిలాండ్‌తో అక్టోబర్ 22న మ్యాచ్ జరుగుతుంది. 20 ఏళ్లలో న్యూజిలాండ్ చేతుల్లో ఒక్క ఐసీసీ మ్యాచ్ కూడా గెలవలేకపోయింది భారత జట్టు. అక్టోబర్ 29న ఇంగ్లాండ్, నవంబర్ 2న శ్రీలంక, నవంబర్ 5న సౌతాఫ్రికా, నవంబర్ 12న నెదర్లాండ్స్‌తో మ్యాచులు ఆడుతుంది భారత జట్టు. 

Latest Videos

click me!