వెంకటేశ్ అయ్యర్ ఎక్కడ? ప్రియాంక జువాల్కర్ పోస్టుకీ, ఆ క్రికెటర్ పోస్టుకీ ముడిపెడుతూ...

Published : Jun 25, 2022, 11:50 AM IST

వెంకటేశ్ అయ్యర్... ఐపీఎల్‌లో అర సీజన్ ఆడి, టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చిన క్రికెటర్. రాహుల్ త్రిపాఠి వంటి క్రికెటర్లు సీజన్లకు సీజన్లు ఆడుతున్నా టీమిండియాలోకి దక్కని చోటు, 8 మ్యాచులాడి దక్కించుకున్నాడు వెంకటేశ్ అయ్యర్... అయితే ఇప్పుడు అయ్యర్, మరోసారి వార్తల్లో నిలిచాడు...

PREV
18
వెంకటేశ్ అయ్యర్ ఎక్కడ? ప్రియాంక జువాల్కర్ పోస్టుకీ, ఆ క్రికెటర్ పోస్టుకీ ముడిపెడుతూ...

విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన ‘ట్యాక్సీవాలా’ సినిమాతో గుర్తింపు తెచ్చుకుని, ఆ తర్వాత ‘తిమ్మరసు’, ‘ఎస్‌ఆర్ కళ్యాణమండపం’, ‘గమనం’ వంటి సినిమాల్లో నటించిన తెలుగు హీరోయిన్ ప్రియాంక జువాల్కర్... ఆ తర్వాత పెద్దగా అవకాశాలు దక్కించుకోలేకపోయింది...

28

అవకాశాల కోసం హాట్ హాట్ ఫోటోషూట్లతో బిజీగా ఉన్న ప్రియాంక జువాల్కర్, తాజాగా సోషల్ మీడియాలో చేసిన ఓ పోస్ట్ హాట్ టాపిక్ అయ్యింది. ఎవరో ఓ వ్యక్తితో డేట్‌కి వెళ్లిన ఫోటోలను షేర్ చేసిన ప్రియాంక జువాల్కర్.. ‘ఇతను... ’ అంటూ, లవ్ సింబల్ జోడించి, అతన్ని కొంటెగా చూస్తున్న ఫోటోలను జోడించింది...

38
venkatesh Iyer

తన ముందున్న వ్యక్తితో ప్రేమలో ఉన్నానంటూ ప్రియాంక ఇన్‌డైరెక్ట్‌గా హింట్ ఇస్తోందంటున్న అభిమానులు, అతను మరెవ్వరో కాదు భారత యంగ్ ఆల్‌రౌండర్ వెంకటేశ్ అయ్యరేనంటూ కామెంట్లు చేస్తున్నారు...

48

దీనికి కారణం ప్రియాంక జువాల్కర్ ఫోటోపై కొన్నాళ్ల కిందట క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ కామెంట్ చేయడం... పొట్టి గౌనులో కూర్చొన్న ప్రియాంక జువాల్కర్ ఫోటోలపై ‘క్యూట్’ అంటూ కామెంట్ చేశాడు వెంకటేశ్ అయ్యర్... అయ్యర్ కామెంట్‌పై రియాక్ట్ అయిన జువాల్కర్... ‘ఎవరు? నువ్వా..’ అంటూ రిప్లై ఇచ్చింది...

58

ఈ ఒక్క కామెంట్‌తో ప్రియాంక జువాల్కర్, వెంకటేశ్ అయ్యర్ మధ్య ఏదో నడుస్తోందని ఫిక్స్ అయిపోయారు నెటిజన్లు... అప్పటి నుంచి ప్రియాంక జువాల్కర్, వెంకటేశ్ అయ్యర్ ఏం పోస్టు చేసినా వాటి కింద ఈ ప్రేమాయణం గురించే కామెంట్లు ప్రత్యేక్షమవుతున్నాయి..

68

 ఇదే సమయంలో  భారత క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్, వెంకటేశ్ అయ్యర్‌తో కాఫీ తాగుతున్న ఫోటోలను షేర్ చేసి, ‘క్యూటీ...’ అంటూ కాప్షన్ జోడించాడు. దీంతో యాదవ్ కూడా అయ్యర్ లవ్ స్టోరీని ఇన్‌డైరెక్ట్‌గా రివీల్ చేస్తున్నాడని అంటున్నారు నెటిజన్లు...

78

ప్రియాంక జువాల్కర్ పోస్టులో వెనక నుంచి కనిపిస్తున్న కటౌట్ చూస్తుంటే వెంకటేశ్ అయ్యర్‌లా కాకుండా ‘ఎస్‌ఆర్ కళ్యాణమండపం’ హీరో కిరణ్ అబ్బవరంలా ఉన్నాడంటూ కామెంట్లు చేస్తున్నారు మరికొందరు... 

88

సౌతాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్‌లో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేకపోయిన వెంకటేశ్ అయ్యర్ ప్రస్తుతం ఐర్లాండ్ టూర్‌లో ఉన్నాడు. ఐపీఎల్ 2022 సీజన్‌లో అయ్యర్ ఫ్లాప్ అవ్వడం, హార్ధిక్ పాండ్యా సూపర్ సక్సెస్ కావడంతో... ఈ కేకేఆర్ ప్లేయర్‌కి తుదిజట్టులో చోటు దక్కడం లేదు... 

click me!

Recommended Stories