యువరాజ్ ఐదో సిక్స్ కొట్టినప్పుడే ఫిక్స్ అయ్యా.. రవిశాస్త్రి ఆసక్తికర వ్యాఖ్యలు

Published : Jun 25, 2022, 10:38 AM IST

Yuvraj Singh 6 Sixes: తొలి టీ20 ప్రపంచకప్ లో భాగంగా ఇంగ్లాండ్ తో జరిగిన లీగ్ మ్యాచ్ లో యువరాజ్ సింగ్ స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్ లో ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు బాదిన తీరును ఇంకా క్రికెట్ అభిమానులు మరిచిపోలేదు. 

PREV
17
యువరాజ్ ఐదో సిక్స్ కొట్టినప్పుడే ఫిక్స్ అయ్యా.. రవిశాస్త్రి ఆసక్తికర వ్యాఖ్యలు

టీమిండియాకు చిరస్మరణీయ విజయాలలో ఒకటిగా గుర్తు పెట్టుకోదగిన మ్యాచ్ 2007 టీ20 ప్రపంచకప్ లో సందర్భంగా ఇండియా-ఇంగ్లాండ్ మధ్య జరిగిన మ్యాచ్. ఆ మ్యాచ్ లో యువరాజ్ సింగ్ ఒకే ఓవర్లో ఆరు బంతులను సిక్సర్లుగా బాదడం టీమిండియా అభిమానులు ఎప్పటికీ మరిచిపోలేరు. ఆండ్రూ ఫ్లింటాఫ్.. యువీతో గొడవకు దిగిన పాపానికి స్టువర్ట్ బ్రాడ్ బలయ్యాడు.

27

అంతకుముందు ఓవర్లో అతడి బౌలింగ్ లో యువీ సిక్సర్ కొట్టడంతో చిర్రెత్తుకొచ్చిన ఫ్లింటాఫ్.. యువీని కవ్విండచంతో ఈ విధ్వంసానికి పునాధి పడింది. అయితే యువీ 6 సిక్సర్లతో పాటు ఈ మ్యాచ్ కు కామెంటేటర్ గా వ్యవహరించిన టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి కామెంట్రీని కూడా ఎవరూ మరిచిపోలేదు. యువీ.. వరుసగా ఐదు, ఆరో సిక్సర్ కొట్టగానే శాస్త్రి చెప్పిన కామెంట్రీ ఇప్పటికీ యూట్యూబ్ లో టాప్ లోనే ఉంటుంది. 

37

నాటి ఘటనను రవిశాస్త్రి తాజాగా గుర్తు చేసుకున్నాడు.యువీ 5వ సిక్సర్ కొట్టగానే అతడు తర్వాత బంతిని కూడా సిక్సర్ గా మలుస్తాడని తాను ఫిక్స్ అయ్యానని చెప్పాడు. 1985లో  రంజీ ట్రోఫీలో భాగంగా బరోడా తో మ్యాచ్ లో శాస్త్రి కూడా ఆరు బంతుల్లో వరుసగా ఆరు సిక్సర్లు కొట్టినప్పుడు తన మనస్తత్వమేంటో తెలుసునని, అందుకే యువీ ఆరో సిక్సర్ కొట్టగలడని ఊహించానని శాస్త్రి అన్నాడు. 

47

శాస్త్రి తాజాగా క్రెడ్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘‘నాకు ఇప్పటికీ 2007 టీ20 ప్రపంచకప్ లో ఇండియా-ఇంగ్లాండ్ మ్యాచ్ గుర్తుంది. అంతకుముందు యువీ-ఫ్లింటాఫ్ కు మధ్య కాస్త వాగ్వాదం జరిగింది. అదే యువీ ఆగ్రహానికి కారణమైంది.  ఆరు సిక్సర్ల విధ్వంసానికి బీజం పడింది కూడా అక్కడే.. 

57

ఇక బ్రాడ్ వేసిన తొలి బంతిని సిక్సర్ గా బాదిన యువీ తర్వాత వరుస బంతుల్లో   బాల్ ను స్టాండ్స్ కు పంపాడు. మూడో సిక్స్ కొట్టగానే నా పక్కన కూర్చున్న డేవిడ్ లాయిడ్ సీట్లోంచి లేచాడు. అదే క్రమంలో యువీ.. నాలుగు, ఐదో సిక్సర్ కూడా బాదాడు.

67

యువీ ఐదో సిక్సర్ కొట్టగానే అందరూ అతడు ఆరో సిక్సర్ కొడతాడా..? అని ఆలోచనలో పడ్డారు. నేను మాత్రం 1985 లో బరోడా మీద నేను 6 సిక్సర్లు కొట్టిన ఇన్సిడెంట్ గుర్తొచ్చింది. బౌలర్, బ్యాటర్ల మనస్తత్వం చదవడానికి నేను ప్రయత్నించా.

77

చివరి బంతిని సిక్సర్ గా మలచడానికి చాలా ఏకాగ్రత కావాలి. నేను యువీ ఐదో సిక్సర్ కొట్టగానే అదే చెప్పా.ఆరో బాల్ కూడా సిక్సర్ అవుతుందని నేను లాయిడ్ తో చెప్పా. అదే జరిగింది..’ అని తెలిపాడు. 

click me!

Recommended Stories