అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లీష్ జట్టుకు ట్రెంట్ బౌల్ట్, నీల్ వాగ్నర్ షాకులిచ్చారు. ఓపెనర్లు అలెక్స్ లీస్ (4), జాక్ క్రాలే (6) లతో పాటు ఓలీ పోప్ (5) లను బౌల్ట్ పెవిలియన్ కు పంపాడు. జో రూట్ (5) ను సౌథీ ఔట్ చేయగా.. కెప్టెన్ బెన్ స్టోక్స్ (18), వికెట్ కీపర్ బెన్ పోక్స్ (0) లను వాగ్నర్ ఔట్ చేశాడు.