యార్కర్ల నట్టూ.. నటరాజన్ ఏమయ్యాడు... ఐపీఎల్‌లో మెరిసి, టీమిండియాలో మురిసి...

First Published Jan 27, 2022, 12:09 PM IST

ఐపీఎల్ 2020 సీజన్‌లో అందరి దృష్టినీ ఆకర్షించిన బౌలర్ నటరాజన్. ఆ తర్వాత ఆస్ట్రేలియా టూర్‌లో లక్కీగా చోటు దక్కించుకున్న నటరాజన్, నాలుగైదు నెలలకే టీమిండియాకి దూరమయ్యాడు... నట్టూ ఏమయ్యాడు? ఎక్కడున్నాడు?

ఐపీఎల్ 2020 సీజన్‌లో ఒకే ఓవర్‌లో ఆరుకి ఆరు యార్కర్లు వేసి... క్రికెట్ ప్రపంచం దృష్టిని తనవైపు తిప్పుకున్నాడు సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్ నటరాజన్... 

ఆస్ట్రేలియా టూర్‌కి ఎంపికైన స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి గాయం కారణంగా తప్పుకోవడంతో ఆ స్థానంలో టీ20 సిరీస్‌లో నటరాజన్‌కి చోటు దక్కింది...

ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో నవ్‌దీప్ సైనీ, మహ్మద్ షమీ భారీగా పరుగులు సమర్పించడంతో మూడో వన్డేలో సైనీ స్థానంలో జట్టులోకి వచ్చాడు నటరాజన్...

మూడో వన్డేలో మార్నస్ లబుషేన్‌ని అవుట్ చేసి టీమిండియాకి తొలి వికెట్ అందించిన నట్టూ, తన అంతర్జాతీయ కెరీర్‌ను కూడా ఘనంగా ఆరంభించాడు. ఆ మ్యాచ్‌లో అస్గన్ అగర్ రూపంలో మరో వికెట్ నట్టూకి దక్కింది...

ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్‌లో 3 మ్యాచుల్లో 6 వికెట్లు తీసిన నటరాజన్, అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచి... భారత జట్టుకి సిరీస్ విజయాన్ని అందించాడు...

నట్టూ పర్ఫామెన్స్ కారణంగా టీ20 సిరీస్‌లో ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డు దక్కించుకున్న హార్ధిక్ పాండ్యా కూడా ఈ అవార్డుకే నటరాజన్ సరైన అర్హుడు అంటూ కామెంట్ చేశాడు...

టీ20 సిరీస్ ముగిసిన తర్వాత జరిగిన టెస్టు సిరీస్‌లో ఉమేశ్ యాదవ్, మహ్మద్ షమీ, రవీంద్ర జడేజా, జస్ప్రిత్ బుమ్రా, రవిచంద్రన్ అశ్విన్, హనుమ విహారి వంటి ప్లేయర్లు గాయపడ్డారు...

కీలక ప్లేయర్లు గాయాల పాలు కావడంతో గబ్బాలో జరిగిన నాలుగో టెస్టులో టి నటరాజన్ అనుకోకుండా జట్టులోకి వచ్చాడు...

తొలి ఇన్నింగ్స్‌లో 3 వికెట్లు తీసిన నటరాజన్, రెండో ఇన్నింగ్స్‌లో వికెట్లు తీయకపోయినా కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ఆసీస్‌ బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెట్టాడు... 

ఒకే పర్యటనలో టెస్టు, వన్డే,టీ20 ఫార్మాట్లలో ఎంట్రీ ఇచ్చిన క్రికెటర్‌గా నిలిచిన నటరాజన్, ఆ తర్వాత గాయాలతో సతమతమవుతున్నాడు...

ఇంగ్లాండ్‌తో జరిగిన వన్డే, టీ20 సిరీస్‌లలో ఒక్కో మ్యాచ్ ఆడిన నటరాజన్, ఆ తర్వాత గాయం కారణంగా ఐపీఎల్ 2021 సీజన్ ఫస్టాఫ్‌కి దూరమయ్యాడు...

ఐపీఎల్ 2021 సీజన్ సెకండాఫ్ సమయానికి నట్టూ గాయం నుంచి కోలుకున్నా, కరోనా పాజిటివ్‌గా తేలడంతో జట్టుకి మరోసారి దూరమయ్యాడు..

ఐపీఎల్ సీజన్ మొత్తానికి దూరమైన నటరాజన్, విజయ్ హాజారే ట్రోఫీ 2021 టోర్నీలో పాల్గొన్నా ఇంతకుముందులా మెరవలేకపోయాడు. దీంతో అతనికి టీమిండియా నుంచి పిలుపు రాలేదు...

ఓ నిరుపేద కుటుంబం నుంచి టీమిండియాలోకి దూసుకొచ్చిన నటరాజన్, మళ్లీ రీఎంట్రీ ఇవ్వాలంటే ఐపీఎల్ 2022 సీజన్‌ దాకా వేచి చూడాల్సిందే. ఈసారి నట్టూ ఏ జట్టుకి ఆడతాడో? ఏ విధంగా రాణిస్తాడనేదానిపైనే అతని కెరీర్ ఆధారపడి ఉంది... 

click me!