కపిల్ దేవ్ కూడా బౌలరే కదా.. టెస్టు కెప్టెన్సీ ఆ బౌలర్ కు ఎందుకివ్వరు? నాకు సమాధానం చెప్పండి : భజ్జీ

Published : Jan 27, 2022, 11:48 AM IST

India Test Captain: విరాట్ కోహ్లి తర్వాత టీమిండియా టెస్టు సారథ్య బాధ్యతలు ఎవరికి అప్పజెప్పాలనేదానిపై భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ),  సెలెక్టర్లు మల్లగుల్లాలు పడుతున్నారు.  ఈ నేపథ్యంలో భారత మాజీ స్పిన్నర్  హర్భజన్ సింగ్  ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

PREV
19
కపిల్ దేవ్ కూడా బౌలరే కదా.. టెస్టు కెప్టెన్సీ ఆ బౌలర్ కు ఎందుకివ్వరు? నాకు సమాధానం చెప్పండి : భజ్జీ

టీమిండియా  మాజీ టెస్టు సారథి విరాట్ కోహ్లి అనూహ్యంగా టెస్టుల నుంచి వైదొలగడంతో అతడి స్థానాన్ని భర్తీ చేసేదెవరు..? అనే చర్చ నడుస్తున్నది. ఈ నేపథ్యంలో భారత మాజీ స్పిన్నర్ హర్బజన్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 

29

విరాట్ స్థానాన్ని రోహిత్ శర్మ భర్తీ చేస్తాడని వార్తలు వస్తున్నాయి.  రోహిత్ అందుకు సుముఖంగా లేకుంటే  కెఎల్ రాహుల్ గానీ, రిషభ్ పంత్ ను గానీ సారథిగా నియమించాలని కూడా వాదనలు వినిపిస్తున్నాయి. 

39

అయితే ప్రతిసారి భారత జట్టుకు కెప్టెన్ ఒక బ్యాటరే అవుతున్నాడని, ఈసారి కొంచెం ట్రెండ్ మార్చాలని.. అది భారత జట్టుకు కూడా ఉపయోగపడుతుందని  భజ్జీ వ్యాఖ్యానించాడు. భారత్ కు తొలివన్డే ప్రపంచకప్ అందించిన కపిల్ దేవ్ కూడా బౌలరే అని గుర్తు చేశాడు.

49

ఓ జాతీయ టెలివిజన్ ఛానెల్ తో హర్భజన్ మాట్లాడుతూ... ‘నా వరకైతే రోహిత్ శర్మ అన్ని ఫార్మాట్లకు ఫిట్ గా ఉంటే అతడినే సారథిగా చేసింది ఉత్తమం. కానీ ఒకవేళ రోహిత్..  తాను టెస్టులకు  కెప్టెన్ గా ఉండనని చెబితే మాత్రం ఆ అవకాశం బ్యాటర్ కు ఇవ్వకుండా టీమిండియా  బౌలర్ జస్ప్రీత్ బుమ్రాకు ఇవ్వాలి. 
 

59

బౌలర్ కెప్టెన్ ఎందుకు కాకూడదు..? నాకు దీనికి సమాధానం కావాలి. కపిల్ దేవ్ కూడా బౌలరే కదా.. ఒక బ్యాటర్ తో పోలిస్తే ఫాస్ట్ బౌలర్ ఎప్పటికీ ఉన్నతంగా ఆలోచిస్తాడు. టీమిండియాలో  ఉన్న మ్యాచ్ విన్నర్లతో పోలిస్తే బుమ్రా చాలా బెటర్. అతడు టీమిండియాను ఎన్నో మ్యాచులలో గెలిపించాడు.  

69

ఇంకా చెప్పాలంటే ఈ మధ్య కాలంలో భారత్ ను చాలా సందర్భాల్లో గెలిపించిన బౌలర్ బుమ్రానే అంటే అతిశయోక్తి కాదు. నా అభిప్రాయం ప్రకారమైతే రోహిత్ శర్మ గనుక టెస్టు బాధ్యతల నుంచి తప్పకుంటే రెడ్ బాల్ లో భారత జట్టును నడిపించడానికి జస్ప్రీత్ బుమ్రాకు పగ్గాలు అప్పగించాలి..’ అని తెలిపాడు. 
 

79

భజ్జీ చెప్పినట్టు.. భారత జట్టులో బ్యాటర్లదే ఆధిపత్యం. కపిల్ దేవ్, అనిల్ కుంబ్లే మినహా టీమిండియాకు బౌలర్లు సారథులుగా ఉన్నది చాలా అరుదు. కుంబ్లే కూడా  కేవలం 14 టెస్టులలో భారత్ కు కెప్టెన్ గా ఉన్నాడు.

89

గతంలో ఇదే అభిప్రాయాన్ని భారత  మాజీ బౌలర్, ప్రస్తుతం అహ్మదాబాద్ ఫ్రాంచైజీకి సారథిగా వ్యవహరిస్తున్న ఆశిష్ నెహ్రా కూడా వ్యక్తపరిచాడు. ఇదిలాఉండగా..  దక్షిణాఫ్రికాతో ముగిసిన వన్డే సిరీస్ లో బుమ్రా.. వన్డేలకు  వైస్ కెప్టెన్ గా వ్యవహరించాడు. 

99

అంతకుముందు రెండో టెస్టులో కోహ్లి గాయపడటంతో కెఎల్ రాహుల్ కు డిప్యూటీ గా ఉన్నాడు. ఆ సందర్బంగా అతడిని విలేకరులు.. ‘మీరు భారత జట్టుకు సారథిగా అవకాశం వస్తే  చేపడతారా..?’అని ప్రశ్నించారు. దానికి బుమ్రా స్పందిస్తూ.. ‘ఆ అవకాశాన్ని ఎవరు మాత్రం వదులుకుంటారు..?’ అని తనదైన శైలిలో బదులిచ్చాడు. 

Read more Photos on
click me!

Recommended Stories