అండర్-19 వరల్డ్‌కప్ నుంచి టీమిండియాలోకి... రవిభిష్ణోయ్ సక్సెస్ వెనక ఆ మాజీ కోచ్...

First Published Jan 27, 2022, 11:26 AM IST

వెస్టిండీస్‌తో జరిగే టీ20, వన్డే సిరీస్‌కి ఎంపిక చేసిన జట్టులో ఓ యంగ్ స్పిన్నర్ పేరు అందరి దృష్టినీ ఆకర్షించింది. అండర్-19 వరల్డ్‌కప్ టోర్నీలో అదరగొట్టి, భారత జట్టులోకి ఎంట్రీ ఇవ్వబోతున్న ఆ కుర్రాడి పేరు రవి భిష్ణోయ్...

అండర్-19 వరల్డ్‌ కప్ 2020 టోర్నీలో 17 వికెట్లు తీసిన రవిభిష్ణోయ్, ఆ టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు...

అండర్-19 వరల్డ్‌ కప్ 2020 టోర్నీ తర్వాత ఐపీఎల్ 2020 వేలంలో రూ.2 కోట్లకు పంజాబ్ కింగ్స్ జట్టు రవిభిష్ణోయ్‌ని కొనుగోలు చేసింది...

ఐపీఎల్ 2020 సీజన్‌లో 14 మ్యాచులు ఆడిన రవి భిష్ణోయ్, 12 వికెట్లు పడగొట్టి, అందర్నీ ఆకర్షించాడు. ఐపీఎల్ 2021 సీజన్‌లో 9 మ్యాచులు ఆడి 12 వికెట్లు తీశాడు...

ఐపీఎల్‌తో పాటు సయ్యద్ ముస్తాక్ ఆలీ, విజయ్ హాజారే ట్రోఫీ టోర్నీల్లోనూ మంచి పర్ఫామెన్స్ ఇచ్చిన రవి భిష్ణోయ్‌కి వెస్టిండీస్‌తో జరిగే టీ20, వన్డే సిరీస్‌కి ఎంపిక చేశారు సెలక్టర్లు...

సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్... సౌతాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌లో పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. వన్డేలతో పాటు టెస్టుల్లోనూ చెప్పుకోదగ్గ పర్ఫామెన్స్ ఇవ్వలేకపోయాడు...

అందుకే పరిమిత ఓవర్ల క్రికెట్‌లో సరైన స్పిన్నర్‌ కోసం వెతుకున్న టీమిండియాకి రవిభిష్ణోయ్ రూపంలో ఓ యంగ్ స్పిన్నర్ ఆశాకిరణంలా కనిపిస్తున్నాడు...

ఐపీఎల్ 2022 సీజన్‌ కోసం లక్నో సూపర్ జెయింట్ జట్టు, రవిభిష్ణోయ్‌ని అన్‌క్యాప్డ్ ప్లేయర్ కోటా కింద రూ.4 కోట్లకు డ్రాఫ్ట్‌గా కొనుగోలు చేసింది...

‘నేను అనిల్ సార్ (అనిల్ కుంబ్లే) నుంచి ఎంతో నేర్చుకున్నా. నన్ను బెటర్ క్రికెటర్‌గా చేయడానికి ఆయన ఎంతో కష్టపడ్డారు...

నన్ను ఎప్పుడూ ప్రోత్సహిస్తూ, గైడ్ చేస్తారు. ఎలాంటి సందర్భంలోనైనా నమ్మకం కోల్పోకుండా నాలో ఆత్మవిశ్వాసాన్ని నింపారు...

నా బలంపై నమ్మకం పెట్టి, ఆడాలని చెబుతుంటారు అనిల్ సార్... నేనెప్పుడూ ప్రయోగాలు చేయలేదు. నా బేసిక్స్‌తో ప్లాన్స్‌ను అమలు చేసేవాడిని...

స్వేచ్ఛగా ఆడేందుకు అనిల్ కుంబ్లే ఇచ్చిన ప్రోత్సహమే కారణం. దేశం తరుపున ఆడే అవకాశం రావడం ఎవ్వరికైనా అదృష్టమే..

నేను కూడా నా నూరు శాతం ఇవ్వడానికి రెఢీగా ఉన్నాను... నాకు ఈ అవకాశం రావడానికి అనిల్ సర్ కారణం... ’ అంటూ ఆనందం వ్యక్తం చేశాడు రవి భిష్ణోయ్...

రవి భిష్ణోయ్‌తో పాటు యజ్వేంద్ర చాహాల్, వాషింగ్టన్ సుందర్ కూడా వెస్టిండీస్‌తో వన్డే, టీ20 సిరీస్‌లకు ఎంపికయ్యారు... కుల్దీప్ యాదవ్‌కి వన్డే జట్టులో చోటు దక్కింది...

click me!