యార్కర్ల నట్టూ ఏమయ్యాడు... ఆసీస్ టూర్‌ తర్వాత టీమిండియాలో కనిపించని నటరాజన్...

First Published Aug 10, 2022, 2:01 PM IST

ఐపీఎల్ 2020 సీజన్ పర్ఫామెన్స్ కారణంగా టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చాడు టీ నటరాజన్. ఓవర్‌లో ఆరుకి ఆరు బంతులను యార్కర్లుగా వేసి సచిన్ టెండూల్కర్ వంటి క్రికెట్ లెజెండ్స్ మన్ననలు అందుకున్నాడు నట్టూ..  ఆస్ట్రేలియా టూర్‌కి ప్రకటించిన జట్టులో స్థానం దక్కించుకున్న వరుణ్ చక్రవర్తి గాయం కారణంగా తప్పుకోవడంతో అతని ప్లేస్‌లో నట్టూకి అవకాశం దక్కింది...

ఆస్ట్రేలియా టూర్‌లో టీ20 సిరీస్‌కి మాత్రమే ఎంపికైన టీ నటరాజన్, నవ్‌దీప్ సైనీ గాయం కారణంగా మూడో వన్డేలో ఆడి వన్డే ఆరంగ్రేటం చేయడమే కాకుండా రెండు కీలక వికెట్లు తీసి భారత జట్టుకి విజయం అందించాడు... 

ఆ తర్వాత టీ20 సిరీస్‌లోనూ పాల్గొని అదరగొట్టిన నటరాజన్, ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్’ అవార్డుకి అర్హుడిగా భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ మన్ననలు అందుకున్నాడు...

ఐపీఎల్ 2020లో గాయపడిన ఇషాంత్ శర్మ కోలుకోకపోవడంతో టెస్టు సిరీస్‌కి నటరాజన్‌ని స్టాండ్ బై ప్లేయర్‌గా అట్టిపెట్టుకుంది భారత జట్టు. ఉమేశ్ యాదవ్, మహ్మద్ షమీ, జస్ప్రిత్ బుమ్రా, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, హనుమ విహారి, కెఎల్ రాహుల్ వంటి కీ ప్లేయర్లు గాయపడడంతో నట్టూకి నాలుగో టెస్టులో అవకాశం దక్కింది..

natarajan

తొలి ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లు తీసి అదరగొట్టిన నట్టూ, ఒకే సిరీస్‌లో మూడు ఫార్మాట్లలోనూ అంతర్జాతీయ ఆరంగ్రేటం చేసిన ఆటగాడిగా సరికొత్త చరిత్ర క్రియేట్ చేశాడు. అయితే ఆ పర్ఫామెన్స్ తర్వాత నట్టూకి భారత జట్టులో స్థానమై కరువైంది...

గాయం కారణంగా జట్టుకి దూరమైన నటరాజన్, ఇంగ్లాండ్‌తో స్వదేశంలో జరిగిన వన్డే, టీ20 సిరీస్‌లో పాల్గొన్నాడు. అయితే గాయం కారణంగా ఈ సిరీస్ మధ్యలోనే తప్పుకున్న నట్టూ... గాయం, కరోనా కారణంగా ఐపీఎల్ 2021 సీజన్‌లో రెండే మ్యాచులు ఆడగలిగాడు...

ఐపీఎల్ 2022 సీజన్‌లో నటరాజన్‌ని తిరిగి కొనుగోలు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్. ఐపీఎల్ 2022లో 11 మ్యాచులు ఆడి 18 వికెట్లు తీసి మంచి పర్ఫామెన్సే ఇచ్చాడు నట్టూ. సన్‌రైజర్స్‌ తరుపున ఉమ్రాన్ మాలిక్ తర్వాత అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ నట్టూయే. అయితే మునుపటితో పోలిస్తే నట్టూ ఎక్కువ పరుగులు ఇస్తుండడంతో అతన్ని ఎంపిక చేసేందుకు సుముఖంగా లేరు సెలక్టర్లు...

ఆసియా కప్ 2022 టోర్నీకి ముందు జస్ప్రిత్ బుమ్రా, హర్షల్ పటేల్ గాయపడడంతో టి నటరాజన్, అందుబాటులో ఉంటే వాళ్లిద్దరూ లేని లోటు తీర్చేవాడనేది క్రికెట్ విశ్లేషకుల అంచనా. అయితే 31 ఏళ్ల లేటు వయసులో టీమిండియాలోకి సంచలన ఎంట్రీ ఇచ్చిన నట్టూ, గాయాల కారణంగా అంతే వేగంగా జట్టు నుంచి దూరమయ్యాడు... 

టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీకి నటరాజన్ అందుబాటులో ఉండి ఉంటే, కచ్ఛితంగా టైటిల్ గెలిచేవాళ్లమని స్వయంగా అప్పటి భారత హెడ్ కోచ్ రవి శాస్త్రి కామెంట్ చేశాడు... 

లైన్ అండ్ లెంగ్త్ పక్కాగా ఫాలో అవుతూ రెండు వైపుల బంతిని స్వింగ్ చేస్తూ యార్కర్లు వేయగల నట్టూ... తన ఫిట్‌నెస్ విషయంలో మాత్రం సరైన జాగ్రత్తలు తీసుకోవడంలో ఫెయిల్ అయ్యాడు...

click me!