ఒకే టూర్‌లో వన్డే, టీ20, టెస్టుల్లో ఎంట్రీ ఇచ్చిన మొట్టమొదటి క్రికెటర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు నటరాజన్... 50 రోజుల్లోనే అన్ని ఫార్మాట్లలోనూ ఎంట్రీ ఇచ్చాడు నట్టూ...

ఆస్ట్రేలియాతో ఆఖరి వన్డే ఆడిన నటరాజన్, టీ20 సిరీస్‌లో అద్భుతంగా రాణించాడు... ఆఖరి టెస్టులోనూ మూడు వికెట్లు పడగొట్టాడు...

వరుణ్ చక్రవర్తికి గాయం కారణంగా అతని స్థానంలో టీ20 సిరీస్‌కి ఎంపికైన నటరాజన్... టీ20ల కంటే ముందు వన్డేల్లో ఆరంగ్రేటం చేశాడు. అయితే ఇదంతా ఊహించనే లేదంటున్నాడు నట్టూ...

‘మూడో వన్డేలో ఉన్నానని విరాట్ భయ్యా చెప్పినప్పుడు షాక్ అయ్యాను... చాలా ఒత్తిడితోనే బరిలో దిగాను. కానీ టీమిండియా తరుపున ఆడాలనే నా కల నెరివేరింది... దాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకున్నా...

అందుకే కొద్దిసేపటి తర్వాత కోలుకుని నా స్టైల్‌లో బౌలింగ్ చేశాను. వన్డేల్లో అవకాశం వస్తుందని మాత్రం అస్సలు ఊహించలేదు... ఇప్పటికీ ఆస్ట్రేలియా మొత్తం ఓ కలలా అనిపిస్తోంది...

విరాట్ కోహ్లీ, అజింకా రహానే ఇద్దరూ నన్ను ఎంతగానో ప్రోత్సాహించారు... వారి కెప్టెన్సీలో ఆడడం నిజంగా నా అదృష్టం... టీ20 సిరీస్‌ను అస్సలు మరిచిపోలేను...

టీ20 సిరీస్ ముగిసిన తర్వాత విరాట్ భయ్యా నాకు ట్రోఫీ అందించాడు. అప్పుడు నా కళ్లల్లో నీళ్లు తిరిగాయి... రవీంద్ర జడేజా కూడా తన మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డు నా చేతుల్లో పెట్టడం మరిచిపోలేను.

భారత జట్టు తరుపున రాణించడానికి ఐపీఎల్ నాకు ఎంతగానో సాయపడింది. సీనియర్లతో మాట్లాడుతూ, వారితో ఆడుతూ ఎన్నో విషయాలు నేర్చుకున్నాను...

సన్‌రైజర్స్ హైదరాబాద్ డేవిడ్ వార్నర్ నన్ను ఎంతగానో ప్రోత్సాహించారు. నా ఆట చూసి గర్వంగా ఉందని డేవిడ్ భాయ్ చెప్పడం చాలా సంతోషంగా అనిపించింది...

ఐపీఎల్ సమయంలో నాకు కూతురు పుట్టినప్పుడు నువ్వు చాలా లక్కీ ప్లేయర్‌వి అని, టీమిండియా తరుపున మరింత బాగా రాణిస్తావని చెప్పాడు డేవిడ్ వార్నర్’ అంటూ చెప్పుకొచ్చాడు నటరాజన్..

ఇంగ్లాండ్‌తో వచ్చే నెలలో ప్రారంభం కాబోతున్న మొదటి రెండు టెస్టులకి నటరాజన్‌ని ఎంపిక చేయలేదు బీసీసీఐ... వన్డే, టీ20 జట్టులో అతనికి చోటు దక్కే అవకాశం ఉంది.