కుర్రాళ్లు కష్టపడ్డారు... ఈ విజయం పూర్తిగా వారిదే... నాదేం లేదు... రాహుల్ ద్రావిడ్...

First Published Jan 24, 2021, 4:10 PM IST

ఆస్ట్రేలియాలో అదరగొట్టిన కుర్రాళ్ల వెనక ‘మిస్టర్ డిపెండబుల్’ రాహుల్ ద్రావిడ్ ఉన్నారనే విషయం తెలిసిందే. ఆస్ట్రేలియాలో టెస్టు సిరీస్ విజయం తర్వాత రాహుల్ ద్రావిడ్‌ను ప్రశంసిస్తూ సోషల్ మీడియా జేజేలు పలికింది. టీమిండియా విజయం తర్వాత భారత హెడ్ కోచ్ రవిశాస్త్రి కంటే రాహుల్ ద్రావిడ్‌కే ఎక్కువ క్రెడిట్ దక్కడం విశేషం.

ఆసీస్‌ టూర్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్, శుబ్‌మన్ గిల్‌‌తో పాటు అత్యధిక వికెట్లు తీసిన సిరాజ్...
undefined
ఆఖరి టెస్టులో ఆల్‌రౌండ్ పర్ఫామెన్స్ ఇచ్చిన శార్దూల్ ఠాకూర్, వాషింగ్టన్ సుందర్.. రాహుల్ ద్రావిడ్ శిక్షణలో భారత్ ఏ జట్టుకి ఆడి రాటుతేలారు.
undefined
తెలుగు కుర్రాడు హనుమ విహారితో పాటు రిషబ్ పంత్, శుబ్‌మన్ గిల్ కూడా ‘గబ్బా’ విజయం తర్వాత రాహుల్ ద్రావిడ్ గురించి ప్రస్తావించారు.
undefined
‘రాహుల్ ద్రావిడ్ చాలా గొప్ప వ్యక్తి... రాహుల్ ద్రావిడ్‌ను క్రికెటర్‌గా, ఉన్నతమైన వ్యక్తత్వం ఉన్న వ్యక్తిగా నేను ఎంతగానో ఆరాధిస్తాను... ఆయన వల్లే నాలాంటి ఎందరో కుర్రాళ్లు జట్టులోకి వచ్చారు... నా విజయంలో ఆయనకి పాత్ర ఉంది’ అంటూ చెప్పుకొచ్చాడు హనుమ విహారి.
undefined
రాహుల్ ద్రావిడ్ శిక్షణ వల్లే ఆస్ట్రేలియాలో రాణించగలిగామని తెలిపారు. అయితే రాహుల్ ద్రావిడ్ మాత్రం తనదేం లేదంటున్నారు.
undefined
ఆసీస్ టూర్‌లో భారత కుర్రాళ్ల సక్సెస్‌లో ద్రావిడ్ భాగస్వామ్యం గురించి ప్రశ్నించగా... ‘హాహా... నిజంగా నాదేమీ లేదు... నాకు అనవసరంగా క్రెడిట్ ఇస్తున్నారు. కుర్రాళ్లు కష్టపడ్డారు, సక్సెస్ అయ్యారు. క్రిడిట్ మొత్తం వారికే దక్కుతుంది’ అంటూ కామెంట్ చేశారు.
undefined
భారత్ ఏ జట్టుకి, అండర్ 19 జట్టుకి కోచ్‌గా పనిచేసిన ద్రావిడ్ శిక్షణలో ఎందరో టాలెంటెడ్ క్రికెటర్లు భారత జట్టులో స్థానం దక్కించుకున్నారు.
undefined
ప్రస్తుతం జాతీయ క్రికెట్ అకాడమీలో క్రికెట్ ఆపరేషన్స్‌ డైరెక్టర్‌గా వ్యవహారిస్తున్నారు రాహుల్ ద్రావిడ్. ఐపీఎల్‌లో గాయపడిన రోహిత్ శర్మ, ఇషాంత్ శర్మ... రాహుల్ ద్రావిడ్ శిక్షణలోనే తిరిగి ఫిట్‌నెస్ సాధించి, జట్టులోకి రీఎంట్రీ ఇచ్చారు.
undefined
click me!