ఇక చాలు ఆపు! అతను నీకంటే సీనియర్... విరాట్ కోహ్లీపై మహేంద్ర సింగ్ ధోనీ సీరియస్...

First Published Feb 3, 2023, 9:46 AM IST

విరాట్ కోహ్లీకి మొదటి నుంచే దూకుడు ఎక్కువ. టీమిండియాని ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ వంటి టీమ్స్ సెడ్జ్ చేయాలంటే భయపడే స్టేజీకి తీసుకొచ్చిన కెప్టెన్ విరాట్ కోహ్లీయే. కెరీర్ ఆరంభంలోనూ ఇదే దూకుడు చూపించిన కోహ్లీని ధోనీ మందలించాడట...

పాకిస్తాన్ తరుపున ఆడిన సోహైల్ ఖాన్, 2008లో అంతర్జాతీయ ఆరంగ్రేటం చేశాడు. పాక్ తరుపున 9 టెస్టులు, 13 వన్డేలు ఆడిన సోహైల్, 46 వికెట్లు పడగొట్టాడు. ఐదు టీ20 మ్యాచులు ఆడిన సోహైల్ ఖాన్, 2017 తర్వాత జట్టులో చోటు కోల్పోయాడు...

2015 వన్డే వరల్డ్ కప్ సమయంలో ఇండియా, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ సమయంలో 55 పరుగులు ఇచ్చి 5 వికెట్లు తీశాడు సోహైల్ ఖాన్. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, సురేష్ రైనా, మహేంద్ర సింగ్ ధోనీ, అజింకా రహానే వంటి భారత టాప్ ఆర్డర్ బ్యాటర్లను అవుట్ చేశాడు సోహైల్ ఖాన్...

dhoni kohli

‘‘నేను బ్యాటింగ్‌కి వచ్చిన సమయంలో విరాట్ కోహ్లీ నన్ను సెడ్జ్ చేయడానికి ప్రయత్నించాడు. ‘నువ్వు వచ్చిందే ఇప్పడే, ఇంతలా వాగుతున్నావ్..’ అన్నాడు. నేను దానికి, ‘బేటా.. నువ్వు అండర్19 ఆడుతున్నప్పుడు నేను టెస్టు క్రికెటర్‌ని...’ అని సమాధానం ఇచ్చాడు...

dhoni kohli

అప్పటికే నేను టెస్టు మ్యాచ్‌లు ఆడాను. అయితే గాయం కారణంగా తప్పుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత మళ్లీ వచ్చాను. నా మాటల్లో ఓ బూతు ఉండడంతో మిస్బా వుల్ హక్ వచ్చి నాపై కోపడ్డాడు.. సైలెంట్‌గా ఉండమని చెప్పాడు...

India-Pakistan 2015 World Cup

అయితే విరాట్ కోహ్లీ మాత్రం ఆగలేదు. దీంతో ధోనీ వచ్చి, ‘ఇక చాలు ఆపు, అతను నీకంటే సీనియర్.. నీకు అతను తెలియక పోవచ్చు..’ అని చెప్పాడు. దాంతో కోహ్లీ ఏమనకుండా పక్కకు వెళ్లాడు... ’’ అంటూ చెప్పుకొచ్చాడు పాక్ బౌలర్ సోహైల్ ఖాన్..

2015 WORLD CUP

2015 వన్డే వరల్డ్ కప్‌లో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా తొలుత బ్యాటింగ్ చేసి 7 వికెట్ల నష్టానికి 300 పరుగుల స్కోరు చేసింది. రోహిత్ శర్మ 15 పరుగులు చేసి అవుట్ కాగా శిఖర్ ధావన్ 73, సురేష్ రైనా 74 పరుగులు చేయగా విరాట్ కోహ్లీ 107 పరుగులు చేసి సెంచరీ అందుకున్నాడు. ధోనీ 18 పరుగులు, జడేజా 3 పరుగులు చేయగా రహానే డకౌట్ అయ్యాడు...

అయితే 301 పరుగుల భారీ లక్ష్యఛేదనలో పాకిస్తాన్ 47 ఓవర్లలో 224 పరుగులకి ఆలౌట్ అయ్యింది. అప్పటి పాక్ కెప్టెన్ మిస్బా వుల్ హక్ 76 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలవగా భారత బౌలర్లు మహ్మద్ షమీ 4, ఉమేశ్ యాదవ్, మోహిత్ శర్మ రెండేసి వికెట్లు తీశారు.. 

click me!