సచిన్ అవుట్ అవ్వగానే, ఛానెల్ మార్చి షారుక్ మూవీ చూసిన మహ్మద్ కైఫ్ ఫ్యామిలీ... అసలు విషయం తెలిసి...

Published : Feb 14, 2023, 01:09 PM IST

సౌరవ్ గంగూలీ కెప్టెన్సీలో టీమిండియా విదేశాల్లో విజయాలు అందుకోవడం మొదలెట్టింది. 2002లో జరిగిన నాట్‌వెస్ట్ సిరీస్ ఫైనల్ మ్యాచ్ ఎవ్వరూ మరిచిపోలేరు. వన్డే క్రికెట్‌ చరిత్రలో వన్ ఆఫ్ ది బెస్ట్ థ్రిల్లర్ మ్యాచ్‌ అది. 326 పరుగుల భారీ లక్ష్యాన్ని ఆఖరి ఓవర్‌లో 3 బంతులు మిగిలి ఉండగా ఛేదించింది టీమిండియా. ఈ మ్యాచ్ సమయంలో జరిగిన ఓ సంఘటనను బయటపెట్టాడు మహ్మద్ కైఫ్...

PREV
19
సచిన్ అవుట్ అవ్వగానే, ఛానెల్ మార్చి షారుక్ మూవీ చూసిన మహ్మద్ కైఫ్ ఫ్యామిలీ... అసలు విషయం తెలిసి...
Mohammad Kaif

నాట్‌వెస్ట్ సిరీస్ ఫైనల్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు, నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 325 పరుగుల భారీ స్కోరు చేసింది. ఇంగ్లాండ్ ఓపెనర్ మార్కస్ ట్రెస్కోథిక్ 109 పరుగులు, నాజర్ హుస్సేన్ 115 పరుగులు చేశారు. ఆండ్రూ ఫ్లింటాప్ 40 పరుగులు చేశాడు..

29
Nasser Hussain, Mohammad Kaif

జహీర్ ఖాన్ 3 వికెట్లు తీయగా ఆశీష్ నెహ్రా, అనిల్ కుంబ్లేలకు చెరో వికెట్ దక్కాయి. ఎక్స్‌ట్రాల రూపంలో ఏకంగా 31 పరుగులు ఇంగ్లాండ్ స్కోరు బోర్డులో చేరాయి. ఆ రోజుల్లో రెండోసారి బ్యాటింగ్ చేసిన సందర్భాల్లో టీమిండియా గెలిచిన మ్యాచులే తక్కువంటే, అందులోనూ 300+ టార్గెట్..

39

వీరేంద్ర సెహ్వాగ్, సౌరవ్ గంగూలీ కలిసి దూకుడుగా ఆడుతూ 14.2 ఓవర్లలోనే తొలి వికెట్‌‌కి 106 పరుగుల భాగస్వామ్యం జోడించారు. అయితే 60 పరుగులు చేసిన గంగూలీ అవుటైన వెంటనే వీరేంద్ర సెహ్వాగ్ (45 పరుగులు), దినేశ్ మోంగియా (9 పరుగులు), రాహుల్ ద్రావిడ్ (5), సచిన్ టెండూల్కర్ (14) వికెట్లను త్వరత్వరగా కోల్పోయింది టీమిండియా...
 

49

ఆ రోజుల్లో సచిన్ టెండూల్కర్ అవుట్ అవ్వగానే దేశంలో సగానికి పైగా టీవీలు ఆఫ్ అయిపోయేవి. సచిన్ లేకపోతే భారత జట్టు గెలుస్తుందనే నమ్మకం ఎవ్వరికీ ఉండేది కాదు. అభిమానులకు మాత్రమే కాదు, టీమ్‌లో ఉన్న మిగిలిన ప్లేయర్ల కుటుంబాలకు కూడా...

59

146 పరుగుల వద్ద సచిన్ అవుట్ అవ్వడంతో ఛానెల్ మార్చేసి, ‘దేవ్‌దాస్’ సినిమా చూడడం మొదలెట్టారు భారత క్రికెటర్ మహ్మద్ కైఫ్ తల్లిదండ్రులు. ఆ సమయంలో కైఫ్ స్వయంగా క్రీజులో ఉన్నా, కొడుకు బ్యాటింగ్ చూడడం కంటే టీమిండియా ఎలాగూ ఓడిపోతుందని డిసైడ్ అయిపోయి... షారుక్ సినిమా చూసేందుకే ప్రాధాన్యం ఇచ్చారు..
 

69

మహ్మద్ కైఫ్, యువరాజ్ సింగ్ కలిసి ఆరో వికెట్‌కి 121 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. యువరాజ్ సింగ్ 63 బంతుల్లో 69 పరుగులు చేసి అవుట్ అయినా హర్భజన్ సింగ్ (15), జహీర్ ఖాన్ (4)లతో కలిసి టీమ్‌కి అద్భుత విజయం అందించాడు మహ్మద్ కైఫ్...

79

75 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 87 పరుగులు చేసి, ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు గెలిచాడు మహ్మద్ కైఫ్. భారత క్రికెట్‌లో అత్యుత్తమ ఫీల్డర్‌గా గుర్తింపు తెచ్చుకున్న కైఫ్ కెరీర్‌లో బెస్ట్ ఇన్నింగ్స్ ఇదే...

 

89

ఈ మ్యాచ్‌ గెలవగానే లార్డ్స్ బాల్కనీలో టీమిండియా కెప్టెన్ సౌరవ్ గంగూలీ, తన షర్ట్ విప్పి సెలబ్రేట్ చేసుకున్నాడు. భారత క్రికెట్ చరిత్రలో ఈ మ్యాచ్, గంగూలీ సెలబ్రేషన్స్‌కి చాలా ప్రత్యేకమైన మూమెంట్స్‌గా నిలిచిపోయాయి..

99

అయితే కొడుకు ఆడిన ఇన్నింగ్స్‌ని లైవ్‌ మ్యాచ్‌లో చూడలేకపోయారు మహ్మద్ కైఫ్ తల్లిదండ్రులు. మ్యాచ్ ముగిసిన తర్వాత బంధువులు ఫోన్లు చేసి విషయం చెప్పేదాకా, కైఫ్.. ఆ మ్యాచ్‌ని గెలిపించిన విషయం వాళ్లకి తెలీదట. ఈ విషయాన్ని స్వయంగా బయటపెట్టాడు మహ్మద్ కైఫ్.. 

click me!

Recommended Stories