రాహుల్‌ని ఆడించి, చాహాల్‌ను ఎందుకు పక్కనబెట్టావు... కోహ్లీపై వీరేంద్ర సెహ్వాగ్ ఫైర్..

First Published Mar 25, 2021, 4:31 PM IST

మొదటి వన్డేలో గెలిచి, విజయ సంబరాలు కూడా చేసుకున్న టీమిండియా, రెండో వన్డే కోసం సిద్ధమవుతోంది. అయితే జట్టులో యజ్వేంద్ర చాహాల్‌కి చోటు ఇవ్వకపోవడంపై కెప్టెన్ కోహ్లీపై సీరియస్ అయ్యాడు మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్...

ఆస్ట్రేలియా టూర్‌లో అనుకోకుండా మొదటి టీ20లోకి కంకూషన్ సబ్‌స్టిట్యూట్‌గా వచ్చి మూడు వికెట్లు తీసి, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గెలుచుకున్న యజ్వేంద్ర చాహాల్ ఆ తర్వాత ఆ రేంజ్ పర్ఫామెన్స్ ఇవ్వలేకపోతున్నాడు...
undefined
ఇంగ్లాండ్‌తో జరిగిన మొదటి మూడు టీ20లు ఆడిన యజ్వేంద్ర చాహాల్.. భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. దాంతో నాలుగో టీ20లో చాహాల్‌ను పక్కనబెట్టి, రాహుల్ చాహార్‌కి అవకాశం ఇచ్చాడు విరాట్ కోహ్లీ...
undefined
ఆఖరి టీ20లో రాహుల్ చాహార్‌తో పాటు వాషింగ్టన్ సుందర్ కూడా భారీగా పరుగులు ఇవ్వడంతో మొదటి వన్డేలో కుల్దీప్ యాదవ్‌కి చోటు దక్కింది. అయితే కుల్దీప్ యాదవ్ కూడా భారీగా పరుగులు సమర్పించాడు...
undefined
‘టీమిండియా సెలక్షన్ నాకు ఏ మాత్రం నచ్చడం లేదు. బౌలర్లకు ఓ న్యాయం, బ్యాట్స్‌మెన్‌కి ఓ న్యాయం అన్నట్టుగా ఉంది పరిస్థితి. మొదటి మూడు టీ20ల్లో పెద్దగా ఆడకపోయినా కెఎల్ రాహుల్‌కి నాలుగో టీ20లో చోటు ఇచ్చారు...
undefined
యజ్వేంద్ర చాహాల్‌కి మాత్రం మొదటి మూడు మ్యాచుల తర్వాత మరో అవకాశం దక్కలేదు. మొదటి వన్డేలోనూ అంతే. ఫామ్‌లో లేని కెఎల్ రాహుల్‌ని వికెట్ కీపర్‌గా ఎంచుకున్నప్పుడు, చాహాల్‌కి ఎందుకు ఛాన్స్ ఇవ్వలేదు...
undefined
చాహాల్ స్థానంలో బుమ్రా ఉండి ఉంటే ఇలాగే చేసేవాళ్లా? రాహుల్‌కి ఛాన్స్ ఇవ్వడం తప్పని నేను అనడం లేదు. కానీ అతనికి అవకాశం ఇచ్చినప్పుడు చాహాల్‌ విషయంలో కూడా అలాగే వ్యవహారించొచ్చుగా...
undefined
చాహాల్ స్థానంలో కుల్దీప్ యాదవ్‌కి అవకాశం బాగానే ఉంది... కానీ బౌలర్ల విషయంలో వివక్ష చూపిస్తున్నారని మాత్రం నాకు అనిపిస్తోంది...’ అంటూ కామెంట్ చేశాడు వీరేంద్ర సెహ్వాగ్...
undefined
యజ్వేంద్ర చాహాల్‌కి బదులుగా టీమ్‌లో చోటు దక్కించుకున్న కుల్దీప్ యాదవ్, 9 ఓవర్లలో 68 పరుగులిచ్చాడు. ఒక్క వికెట్ కూడా తీసుకోలేకపోయాడు. దీంతో రెండో వన్డేలో అతను ఆడడం అనుమానంగా మారింది...
undefined
టీ20 సిరీస్‌లో ఘోరంగా ఫెయిల్ అయిన కెఎల్ రాహుల్, మొదటి వన్డేలో ఐదో స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చి అద్భుత హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. కృనాల్ పాండ్యాతో కలిసి శతాధిక భాగస్వామ్యం నెలకొల్పి టీమిండియా భారీ స్కోరు చేయడానికి కారణమయ్యాడు...
undefined
మొదటి వన్డేలో ఫెయిల్ అయిన కుల్దీప్ యాదవ్‌కి మరో అవకాశం దక్కడం అనుమానమే. రెండో వన్డేలో యజ్వేంద్ర చాహాల్ మళ్లీ రీఎంట్రీ ఇవ్వడం ఖాయమే అంటున్నారు క్రికెట్ విశ్లేషకులు.
undefined
click me!