బుమ్రా సారీ చెప్పాలనుకున్నాడు, కానీ అండర్సన్ మాత్రం వినకుండా... ఆరోజు అసలేం జరిగిందంటే...

First Published Aug 21, 2021, 4:45 PM IST

ఇండియా, ఇంగ్లాండ్ మధ్య జరిగిన రెండో టెస్టును మలుపు తిప్పిన సంఘటన... జేమ్స్ అండర్సన్, జస్ప్రిత్ బుమ్రా మధ్య జరిగిన గొడవే. తొలి ఇన్నింగ్స్‌లో అండర్సన్ బ్యాటింగ్‌కి వచ్చిన సమయంలో జస్ప్రిత్ బుమ్రా బౌన్సర్లు వేయడం దగ్గర మొదలైందీ అసలు గొడవే...

రెండో టెస్టులో టీమిండియాకి అంతగా కోపం రావడానికి, కసితో రగిలిపోయే చిరుత పులుల్లా ప్రత్యర్థిపై విరుచుకుపడడానికి కారణం ఏంటో బయటపెట్టాడు భారత జట్టు ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్...

‘జేమ్స్ అండర్సన్ బ్యాటింగ్‌కి వచ్చే సమయానికి జస్ప్రిత్ బుమ్రాకి తొలి ఇన్నింగ్స్‌లో వికెట్లేమీ దక్కలేదు. దీంతో ఎలాగైనా వికెట్ తీయాలని అండర్సన్‌కి మరింత వేగంగా బంతులు వేశాడు బుమ్రా...

అదీకాకుండా అప్పటికే ఇంగ్లాండ్ జట్టు, భారత్‌పై తొలి ఇన్నింగ్స్‌లో ఆధిక్యం సాధించింది. దీంతో సాధ్యమైనంత త్వరగా ఇంగ్లాండ్‌ను ఆలౌట్ చేయాల్సిన పరిస్థితి. అందుకే బుమ్రా వేగం పెంచి, బంతులు వేశాడు...

షార్ట్ పిచ్ బంతులు వేసి అండర్సన్ వికెట్ తీయాలని బుమ్రా భావించాడు. అయితే అండర్సన్‌కి బ్యాటింగ్ రాక, అవి అతని బాడీకి తగిలాయి. దీంతో అండర్సన్, బుమ్రాపై కామెంట్ చేశాడు....

‘ఎందుకు ఇంత వేగంగా వేస్తున్నావు? నేను నీకు ఇలాగే వేశానా? నన్ను చూడగానే ఏదో పగ ఉన్నట్టు విసురుతున్నావు...’ అంటూ అండర్సన్ కామెంట్ చేశాడు. దానికి బుమ్రా... ‘అతనికి 160 టెస్టుల అనుభవం ఉంది, ఇంకా స్లోగా బౌలింగ్ వేయమని కోరుతున్నాడు...’ అంటూ బదులిచ్చాడు...

ఆ ఇన్నింగ్స్ తర్వాత అండర్సన్ దగ్గరికి వెళ్లి ఉద్దేశపూర్వకంగా అలా వేయలేదని, సారీ చెప్పాలని అనుకున్నాడు బుమ్రా. అయితే అండర్సన్ మాత్రం అతని మాటలు వినిపించుకోలేదు సరికదా, తిరిగి అతన్నే తిట్టడం మొదలెట్టాడు..

బుమ్రాను పక్కకు తోసేసి... అందరికీ 85 మైళ్ల వేగంతో బౌలింగ్ వేసి, నాకేమీ 90 మైళ్ల వేగంతో బౌలింగ్ చేశావు. ఇది ఛీటింగ్... నేను ఒప్పుకోను...’ అంటూ కామెంట్ చేశాడు అండర్సన్...

ఈ సంఘటన తర్వాత భారత ఇన్నింగ్స్‌లో జేమ్స్ అండర్సన్, విరాట్ కోహ్లీ మధ్య కూడా ఈ విషయం చర్చకు వచ్చింది.. ‘నిన్ను బుమ్రాను బెదిరించినట్టు, నన్ను బెదిరించాలని చూస్తున్నావా... ఇది నీ బ్యాక్‌యార్డ్ కాదు, వెళ్లి బౌలింగ్ వెయ్’ అంటూ కామెంట్ చేశాడు కోహ్లీ...

జస్ప్రిత్ బుమ్రా బ్యాటింగ్‌కి వచ్చినప్పుడు, జేమ్స్ అండర్సన్ బౌలింగ్ కోరతాడని... కచ్ఛితంగా అతనిపై పగ తీర్చుకుంటాడని అంచనా వేశారు క్రికెట్ విశ్లేషకులు, ఫ్యాన్స్...

అయితే అండర్సన్ అలా చేయలేదు. కానీ ఇంగ్లాండ్ బౌలర్లు మార్క్ వుడ్, వికెట్ కీపర్ జోస్ బట్లర్ మాత్రం బుమ్రాని టార్గెట్ చేస్తూ బౌన్సర్లు విసిరారు. వుడ్ బౌలింగ్‌లో ఓ బంతి, బుమ్రా హెల్మెట్‌ను తాకడంతో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కోపంతో ఊగిపోయాడు...

ఆ సంఘటన తర్వాత మహ్మద్ షమీ బ్యాటింగ్‌లో చెలరేగడం, బౌలింగ్‌లో మహ్మద్ సిరాజ్ నుంచి ప్రతీ ఒక్క టీమిండియా ప్లేయర్ కూడా ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్‌ను టార్గెట్ చేస్తూ, ఐదో రోజు పూర్తి ఆధిపత్యం చెలాయించారు...

రిషబ్ పంత్ త్వరగా అవుట్ కావడంతో టీమిండియా బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ చాలా బాధపడ్డాడని, అయితే బుమ్రా, షమీ భాగస్వామ్యంతో అతనికి ఆ బాధ ఎక్కువ సేపు నిలవలేదని చెప్పుకొచ్చాడు ఆర్ శ్రీధర్....

click me!