ఆర్‌సీబీలో భారీగా మార్పులు... ఆడమ్ జంపా స్థానంలో హసరంగ, హెడ్‌‌కోచ్ కూడా మార్పు...

First Published Aug 21, 2021, 3:35 PM IST

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు... ఐపీఎల్ చరిత్రలో బహుశా ఈ జట్టు చేసినన్ని మార్పులు, మరే ఫ్రాంఛైజీ చేయలేదేమో. ప్రతీ సీజన్ ఆరంభానికి ముందు భారీగా ధర చెల్లించి ప్లేయర్లను కొనుగోలు చేయడం, నిరాశ పర్చిన ప్లేయర్లను వేలానికి వదిలేయడం జరుగుతూనే ఉన్నాయి... ఐపీఎల్ 2021 సీజన్ ఫేజ్ 2 ఆరంభానికి ముందు కూడా జట్టులో మార్పులు చేసింది ఆర్‌సీబీ...

శ్రీలంక, భారత్ మధ్య జరిగిన టీ20 సిరీస్‌లో ఆల్‌రౌండ్ పర్ఫామెన్స్‌తో అదరగొట్టిన వానిండు హసరంగను, ఐపీఎల్ 2021 సీజన్‌లో ఆడించబోతోంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు...

లంకతో సిరీస్ ముగిసిన తర్వాతే హసరంగను ఆర్‌సీబీ తరుపున ఆడించేందుకు పావులు కదిలాయి. ఆడమ్ జంపా స్థానంలో హసరంగను ఆడించబోతున్నట్టు ప్రకటించింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు...

ఐపీఎల్ 2021 సీజన్ మధ్యలోనే అర్ధాంతరంగా స్వదేశానికి పయనమైన కేన్ రిచర్డ్‌సన్‌ స్థానంలో మరో శ్రీలంక పేసర్ దుస్మంత ఛమీరాను ఆడించనుంది...

ఫిన్ ఆలెన్ స్థానంలో టిమ్ డేవిడ్‌ను తీసుకుంటున్నట్టు కూడా ప్రకటించింది ఆర్‌సీబీ... బిగ్‌బాస్ లీగ్‌లో ఘనమైన రికార్డు ఉన్న టిమ్ డేవిడ్‌కి ఇది చాలా మంచి అవకాశమే...

వీటితో పాటు ఇన్నాళ్లు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి హెడ్‌కోచ్‌గా వ్యవహరించిన సిమన్ కటిచ్ స్థానంలో మైక్ హెస్సెన్‌‌ను ఎంపిక చేసింది... అర్ధాంతరంగా సిమన్ కటిచ్ ఈ స్థానం నుంచి ఎందుకు తప్పుకోవాల్సి వచ్చిందో తెలియాల్సి ఉంది...

ఐపీఎల్ 2021 సీజన్‌కి బ్రేక్ పడే సమయానికి ఏడు మ్యాచుల్లో ఐదు విజయాలు అందుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది..

click me!