వరల్డ్ కప్ గెలవాలంటే బుమ్రా ఉండాలి! టీమిండియా ఫాస్ట్ బౌలర్‌ రీఎంట్రీపై వసీం జాఫర్ కామెంట్..

Chinthakindhi Ramu | Published : Jul 23, 2023 5:42 PM
Google News Follow Us

అప్పుడెప్పుడో ఏడాది క్రితం ఆసియా కప్ 2022 టోర్నీ ఆరంభానికి ముందు గాయంతో క్రికెట్‌కి దూరమయ్యాడు జస్ప్రిత్ బుమ్రా. ఆసియా కప్ 2022 టోర్నీ తర్వాత ఆస్ట్రేలియాతో రెండు టీ20 మ్యాచులు ఆడిన జస్ప్రిత్ బుమ్రా, గాయం తిరగబెట్టడంతో మళ్లీ ఆటకు దూరమయ్యాడు..
 

18
వరల్డ్ కప్ గెలవాలంటే బుమ్రా ఉండాలి! టీమిండియా ఫాస్ట్ బౌలర్‌ రీఎంట్రీపై వసీం జాఫర్ కామెంట్..
Jasprit Bumrah

అప్పటి నుంచి జస్ప్రిత్ బుమ్రా అప్పుడు వస్తాడు? ఇప్పుడు వస్తాడు? అని వార్తలు వస్తున్నాయి కానీ అతను రీఎంట్రీ మాత్రం ఇవ్వడం లేదు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2023 సిరీస్‌లో బుమ్రా ఆడతాడని వార్తలు వచ్చాయి. మొదటి రెండు టెస్టులు కాకపోయినా ఆఖరి రెండు టెస్టుల్లో బుమ్రా వస్తాడని రోహిత్ శర్మ కూడా ఆశాభావం వ్యక్తం చేశాడు..

28
Jasprit Bumrah

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో కాకపోయినా ఐపీఎల్ 2023 సీజన్‌లో అతను రీఎంట్రీ ఇస్తాడని ప్రచారం జరిగింది. అయితే అది కూడా జరగలేదు. ఆఖరికి ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ 2023 ఫైనల్‌లో బుమ్రా రీఎంట్రీ ఉంటుందని కూడా వార్తలు వచ్చాయి. అదీ అవ్వలేదు..

38

ఎట్టకేలకు జస్ప్రిత్ బుమ్రా కోలుకుంటున్నాడని, జాతీయ క్రికెట్ అకాడమీలో రోజూ బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడని అతని ఫిట్‌నెస్‌పై అప్‌డేట్ ఇచ్చింది బీసీసీఐ. ఐర్లాండ్‌ టూర్‌లో బుమ్రా ఆడతాడని ప్రచారం జరుగుతోంది. అయితే అతని నిజమవుతుందా? లేదా? అనేది చెప్పడం కష్టమే..

Related Articles

48
Jasprit Bumrah

ఆఖరికి డిసెంబర్‌లో ఘోర రోడ్డు ప్రమాదానికి గురైన రిషబ్ పంత్ ఊహించిన దాని కంటే వేగంగా గాయాల నుంచి కోలుకుని, రీఎంట్రీ రెఢీ అంటున్నాడు. కానీ జస్ప్రిత్ బుమ్రా మాత్రం తన ఫిట్‌నెస్ గురించి క్లారిటీగా చెప్పడం లేదు.. 

58

‘భారత ఫాస్ట్ బౌలింగ్ అటాక్‌లో జస్ప్రిత్ బుమ్రా కీ బౌలర్. వరల్డ్ కప్‌లో అతని పాత్ర చాలా కీలకం. డెత్ ఓవర్లలో జస్ప్రిత్ బుమ్రా బౌలింగ్‌, టీమిండియాకి కావాల్సిందే. బుమ్రా లేకుండా ఏడాదిగా క్రికెట్ ఆడుతున్నాం..

68

బుమ్రా ఫిట్‌నెస్ అందుకుంటే అతనికి ఎలాంటి అడ్డంకులు ఉండవు. ఇంతకుముందున్న పేస్‌తో బౌలింగ్ చేయగలిగితే జస్ప్రిత్ బుమ్రా మళ్లీ టీమిండియాకి కీ బౌలర్ అవుతాడు. బుమ్రా కంటే బెటర్ బౌలర్‌ని ఇప్పటికిప్పుడైతే టీమిండియా తయారుచేయలేదు..’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ క్రికెటర్ వసీం జాఫర్..

78

‘టీమిండియాలో జస్ప్రిత్ బుమ్రా చాలా చాలా కీ ప్లేయర్. ఒక్క ఫార్మాట్ అని కాదు, మూడు ఫార్మాట్లలోనూ బుమ్రా సేవలు, టీమ్‌కి అవసరం. వరల్డ్ కప్‌లో అతను ఆడితే టీమ్ విజయావకాశాలు బాగా పెరుగుతాయి... బుమ్రా, ఎన్నో మ్యాచులను ఒంటిచేత్తో గెలిపించాడు..

88
Jasprit Bumrah

టీమ్‌లో సీనియర్ ఫాస్ట్ బౌలర్ కూడా. అతనికి కెప్టెన్సీ చేసిన అనుభవం కూడా వచ్చింది. నా ఉద్దేశంలో బౌలింగ్ యూనిట్‌కి వరల్డ్ కప్‌లో బుమ్రానే లీడర్‌. అతను రీఎంట్రీ ఇవ్వడం టీమ్‌కి చాలా అవసరం..’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా సీనియర్ ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మ..  

Recommended Photos