అనుమానం అక్కర్లేదు, ఈసారి కూడా వాళ్లే విజేతలు... టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీలో...

First Published Aug 22, 2021, 5:23 PM IST

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీకి రంగం సిద్ధమైంది. ఐపీఎల్ 2021 సీజన్ ముగిసిన తర్వాత టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీ మొదలుకానుంది. ఈసారి కూడా వెస్టిండీస్ జట్టే, టైటిల్ ఫెవరెట్ అంటున్నాడు ఇంగ్లాండ్ మాజీ స్పిన్నర్ గ్రేమ్ స్వాన్...

అక్టోబర్ 17 నుంచి యూఏఈ, ఓమన్ వేదికగా టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీ మొదలుకానుంది... ఐదేళ్ల తర్వాత తిరిగి జరిగే ఈ టోర్నీలోనూ డిఫెండింగ్ ఛాంపియన్ వెస్టిండీస్ జట్టే టైటిల్ ఫెవరెట్లలో ఒకటిగా నిలిచింది...

2012 టీ20 వరల్డ్‌కప్ ఫైనల్‌లో శ్రీలంకను ఓడించిన వెస్టిండీస్ జట్టు, ఆ తర్వాత 2016 టోర్నీలో టీమిండియాపై గెలిచి... రెండో టైటిల్ కైవసం చేసుకుంది...

Latest Videos


ఈ రెండు టీ20 వరల్డ్‌కప్ టోర్నీల్లో పాల్గొన్న క్రిస్ గేల్, డ్వేన్ బ్రావో, ఆండ్రే రస్సెల్, కిరన్ పోలార్డ్ వంటి ప్లేయర్లు... ఈసారి టీ20 వరల్డ్‌కప్‌లో కూడా పాల్గొనబోతున్నారు...

‘టీమిండియా మంచి స్ట్రాంగ్ పొజిషన్‌లో ఉంది. ఈ టోర్నీ ఇండియాలో జరిగి ఉంటే, కచ్ఛితంగా వాళ్లే విజేతలుగా నిలిచేవాళ్లు. అందులో ఎలాంటి సందేహం అవసరం లేదు...

యూఏఈలో జరిగే టీ20 వరల్డ్‌కప్‌లో వెస్టిండీస్ జట్టు ఫెవరెట్స్‌. ఎందుకంటే ఆ జట్టలో బ్యాటింగ్, బౌలింగ్‌ పవర్‌తో నిండింది... 

ఎలాంటి బౌలింగ్‌లో అయినా సిక్సర్లు బాదగల బ్యాట్స్‌మెన్ విండీస్ జట్టులో పుష్కలంగా ఉన్నారు. మిగిలిన జట్లతో పోలిస్తే విండీస్ బౌలర్లు కూడా భారీ షాట్లు ఆడగలరు... 

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీలో వాళ్లే ఫెవరెట్స్ అనడానికి ఇంకేం కావాలి...’ అంటూ కామెంట్ చేశాడు ఇంగ్లాండ్ మాజీ స్పిన్నర్ గ్రేమ్ స్వాన్..

సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా, పాకిస్తాన్‌లతో టీ20 సిరీస్ ఆడిన వెస్టిండీస్ ప్లేయర్లు... టీ20 వరల్డ్‌కప్‌కి ముందు కరేబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్), ఐపీఎల్ టోర్నీల్లో పాల్గొనబోతున్నారు.. దీంతో మెగా టోర్నీకి ముందు వారికి కావాల్సినంత ప్రాక్టీస్ దక్కనుంది..

మరోవైపు టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీ ఫెవరెట్లుగా ఉన్న ఇండియా, ఇంగ్లాండ్ జట్లు ప్రస్తుతం, ఆ టోర్నీతో ఏ మాత్రం సంబంధం లేని టెస్టు సిరీస్ ఆడుతున్నాయి... ఆ తర్వాత ఐపీఎల్‌లో పాల్గొనబోతున్నారు ఇంగ్లాండ్, ఇండియా ప్లేయర్లు...

గ్రూప్ 1లో ఇంగ్లాండ్, వెస్టిండీస్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా జట్లు ఉండగా... గ్రూప్ 2లో టీమిండియా, పాకిస్తాన్, న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్తాన్ జట్లు ఉన్నాయి... గ్రూప్ 2తో పోలిస్తే, గ్రూప్ 1లో హోరాహోరీ మ్యాచులు ఉంటాయని అంచనా వేస్తున్నారు క్రికెట్ విశ్లేషకులు...

click me!